Apr 02 | మోనోపాజ్ అంటే ఏమిటంటే... స్ర్తీలకు వచ్చే నెలసరి ఆగిపోవడం. నెలసరి సరిగా రాకపోయినా, ఆగిపోయినా వారికి పిల్లలు పుట్టరు. ప్రతి స్ర్తీ తల్లి కాలవాలంటే ఇది ముఖ్యమైనది. సాదారణంగా మోనోపాజ్ దశకు చేరుకునే వయస్సు45 ఏళ్ళ తరువాత నుండి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ద్రుష్ట్యా 20 సంవత్సరాల వయస్సులోనే యువతులు మోనోపాజ్ దశకు చేరకుంటున్నారని తాజాగా చేసిన ఓ సర్వే చెబుతుంది. ఇరవై ఎనిమిదేళ్ల సంజన పేరుమోసిన ఐటీ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తోంది. ఆఫీసులో పని.. ఇంటి దగ్గర ఉన్నా ల్యాప్‌టాప్ ముందు పెట్టుకుని ఏదో ఒక పని! ఇటీవలి కాలంలో ఆమె ఆరోగ్యం మందగించింది. మానసికంగానే కాదు, శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె రుతుక్రమంలో సైతం చాలా మార్పులు వచ్చాయి. గైనకాలజిస్టును సంప్రదించగా... ఆమె మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) దశలోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. తన కు ఇంకా పెళ్లి కూడా కాలేదని, ఇప్పుడే సంబంధాలు చూస్తున్నారని.. ఈ దశలో మెనోపోజ్ రావడమేంటో అర్థం కాలేదని వాపోతోంది. రాత్రి ఉద్యోగాలు, డెడ్లైన్లు, అలవిమాలిన పని ఒత్తిళ్లతో ఉరుకులు పరుగులుగా మారిపోయిన జీవనశైలి కారణంగా నగరాల్లో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇది. దీనిపై సత్యం అనే సంస్థ 980 మంది మహిళలపై ఐదేళ్ల అధ్యయనం నిర్వహించగా.. అందులో 432 మంది 30-35 ఏళ్ల వయసులోను... 216 మంది మహిళలు 35-40 ఏళ్ల వయసు లో, 264 మంది 40 ఏళ్లు దాటాక మెనోపాజ్ దశలోకి అడుగుపెట్టినట్టు తేలింది. సో తగినన్ని జాగ్రత్తలు తీసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకొండి.Read More
Mar 29 | దంపతులు తమ దాంపత్యంలో విసుగుదలను పోగొ ట్టుకోవాలనుకుంటే వారిద్దరి మధ్యా సరసానికి తగినంత స్పేస్ వుండాలి. కొత్తగా పెళ్లయిన వ్యక్తులు కూడా ఇటీవల, వయసు మీద పడిపోయిన వాళ్లల్లా వ్యవహరిస్తు న్నారు. పెళ్లి కాగానే తమకు అంతకు ముందు లేని పెద్దరి కం వచ్చేసినట్టుగాను, తామిక చిన్న పిల్లలం కాదు బాధ్యత గా వుండాలి అనే వైఖరితోను వుంటున్నారు. బరువు బాధ్య తలు తీసుకోవడం తపకాదు కానీ అదే పనిగా వాటిగురించి ఆలోచిస్తూ గడపడం వారిలో వున్న చిలిపితనానికి స్వస్తి చెబుతుంది. ఆ చిలిపితనమే వారి దాంపత్య జీవితాన్ని పరి మళభరితం చేస్తుంది. ముఖ్యంగా వారిద్దరి మధ్య లైంగిక విన్యాసాలకు అవరోధమవుతుంది. ఫలితంగా వారిరువురి సెక్స్ జీవితం, ఒక తప్పని సరి అంశంగా మాత్రమే మిగిలి పోతున్నది. దంపతులు ఏ వయసులో వున్నవారైనా ఎప్ప టికీ అమర ప్రేమికులే ! ఈ సంగతిని వారు గుర్తించాలి. వారి మధ్య మధుర భావనలకు వయసు మళ్లదు. ఆ మధుర భావనల్లో సరసం ఎంత ముఖ్యమో విరసం అం టే చిలిపి తగాదాలు కూడా అంతే ముఖ్యం. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టేసినా సరే ఇంకా టీనేజీ ప్రేమి కుల్లానే పడక గదిలో వుండగలిగితే అది వారి దాంప త్య జీవితాన్ని ఇంకా ఇంకా మధురం చేస్తుంది. నిరం తరం ఒకే విధమయిన జీవితాన్ని గడిపే భార్యా భర్తలు మధ్య సరస సల్లాపాలు ఒక రిలీఫ్‌ను కలిగిస్తాయి. నవ్యతను అందిస్తాయి. సరసంలో భాగంగా ఒకరినొక రు పొగుడుకోవడం, ఒకరి విషయాలను మరొకరు ఆరాధనా పూర్వకంగా మెచ్చుకోవడం చేస్తే ఒక విధమై న ఆనందం కలుగుతుంది. అలాగే అపుడపుడు పెట్టుకునే గిల్లికజ్జాలు కూడా వారి ఇరువురిని దగ్గర చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే, శృతి మించని ఈ తగాదాలు వారిద్దరి మధ్యా నెలకొని వున్న స్తబ్దతను పోగొడతాయి. కోపం నటిస్తూ, వాదులాడుకోవడం, ఒకరినొకరు కసురుకోవడం, ఒకరి నించి ఒకరు తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించ డం వారిని పట్టుకోవాలని పరిగెట్టడం, ఈ నేపథ్యంలో కిందా మీదా పడడం, పక్కమీద దొర్లడం, ఒకరిపై మరొకరు జోక్స్ వేసుకోవడం లాంటి చేష్టలు వారిని తెలియకుండానే కలుపుతాయి. రతికి అసలైన రంగాన్ని సిద్ధం చేస్తాయి. రతి భాగస్వామ్యంలో ఇలా వ్యవహరించ డాన్ని పాశ్చాత్య సెక్సాలజిస్టులు రోయింగ్ అని అంటారు. రోయింగ్‌లో భార్యభర్తలు తమ తమ లైంగిక అభిరుచులను చెప్పకనే చెబుతారని ఆ భావ వ్యక్తీకరణలో వారిద్దరి నడుమ మనసుకు హత్తుకునే అనుబంధం ఏర్పడుతుందని అంటారు. కాబట్టి, ప్రపంచాన్ని మరిచి పోయి దంపతులు పడక గదిలో సరస విరసాలకు తగినంత చోటు కల్పిస్తే వారి సెక్స్ జీవితంలో నీరసం వుండదు.Read More
Mar 29 | అంగస్తంభన లోపాలకు మానసిక స్థితే పూర్తి కారణమన్న భావన చాలా మందిలో పాతకుపోయింది. వాస్తవానికి అంగస్తంభన లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. ఓ 15 శాతం మానసికమైనవి ఉన్నా మిగతా 85 శాతం కారణాలు పూర్తిగా శారీరకమైనవి. శృంగారం..... భౌతిక జీవితంలో అత్యంత కీలకమైనదీ ఇదే. ఎంతోమంది అత్యంత రహస్యంగా ఉంచుకునేదీ ఇదే. అన్నీ సవ్యంగానే సాగిపోతున్నప్పుడు ఎవరికీ ఏమీ చెప్పుకోవలసిన అవసరం ఉండదు. కానీ, ఒక సమస్య మొదలైనప్పుడు, ఒక లోపం కాల్చివేస్తున్నప్పుడు కూడా మౌనంగా ఉంటే ఎలా? మొత్తం జీవితాన్నే నిర్జీవంగా మార్చివేసే అతిపెద లైంగిక లోపాన్ని అతి రహస్యంగా ఉంచుకుంటే ఏమవుతుంది? అసలు జీవించి ఉన్నామో లేదో తెలీకుండాపోతుంది. 1995లో ప్రపంచ వ్యాప్తంగా 152 మిలియన్ల మంది ఈ అంగస్థంభన లోపాలతో బాధపడినట్లు అధ్యనాల్లో తేలింది. ఈ క్రమంలో 2025 నాటికి వీరి సంఖ్య 322 మిలియన్ల మంది ఈ సమస్య బారిన పడతారన్నది ఒక అంచనా. ఈ పరిణామాలు ఇంతతీవ్రంగా పెరగుతూ పోతే, మానవ సంతతే మరుగయ్యే పరిస్థితి.అంగస్థంభన లోపాలు కొందరిలో పాక్షికంగా ఉంటే మరికొందరిలో పూర్తిస్థాయిలో ఉంటాయి. కొందరిలో అతి స్వల్పం కాలం ఉండిపోయే అంగస్థంభనలూ ఉంటాయి. మొత్తంగా చూస్తూ ప్రతి ఇద్దరిలో ఒకరు అంగస్థంభన లోపాలతో సతమతమవుతున్నారు. మధుమేహ పీడితుల్లో కూడా దాదాపు 50 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. రోజూ ఒక పాకెట్ సిగరెట్లు తాగే వారిలో దాదాపు 50 శాత మంది అంగస్తంభనలోపాలతో బాదపడుతున్నవారే. 40 ఏళ్లు దాటిన వారిలో 70 శాతం దాకా ఈ సమస్య ఉంది. వాస్తవికంగా ఇంత పెద్ద శాతం మంది ఈ సమస్యతో బాదపడుతున్నా, వారిలో అత్యంత స్వల్ప సంఖ్యలోనే వైద్యచికిత్సలకు వెళుతున్నారు. స్తంభనా లోపం ఇద్దరి సమస్య లైంగిక ప్రక్రియలో అత్యధిక శాతం పురుషులు ఎదుర్కొనే సమస్య అంగస్తంభన లోపం. ఒకప్పుడు ఈ సమస్య కేవలం వయసు పైబడిన వారిలోనే ఉంటుందని భావించేవారు. కానీ, ఇప్పుడది అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. ఎవరో ఎందుకు? కొత్తగా పెళ్లయిన వాళ్లలోనే దాదాపు 40 శాతం మంది అంగస్తంభన సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాల్లో బయటపడింది.అంగస్తంభన లోపాలు ప్రారంభంలో అప్పుడో ఇప్పుడో చాలా అరుదుగా వచ్చిపోతుంటాయి. స్తంభనలు ఎలా వస్తాయి? అంగ స్తంభన వ్యవస్థ ఎన్నెన్నో అంశాల మిశ్రణం. ఆలోచనలు, అనుభూతులు, కండరాలు, నరాలు, రక్తం ఇవన్నీ సరియైన రీతిలో పనిచేసినప్పుడే స్తంభనలు పరిపూర్ణంగా ఉంటాయి. శరీరంలోని న్యూరోట్రాన్స్మీటర్లన్నీ సరిగ్గా ఉండి, అవసరమైనంత నైట్రస్ ఆక్సైడ్ అంది, రక్తంలో ఆక్సీజన్ పరిమాణం సరిపడా ఉండి, టెస్టోస్టెరాన్ హార్మోన్లు అవసరమైన మోతాదులో ఉన్నప్పుడే లైంగిక పటుత్వం ఉంటుంది. అంగస్తంభనా లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. 85 శాతం కారణాలు శారీరకమైతే, మిగతా 15 శాతమే మానసిక కారణాలు ఉంటాయి. వాస్తవానికి అంగస్తంభన లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. ఓ 15 శాతం మానసికమైనవి ఉన్నా మిగతా 85 శాతం కారణాలు పూర్తిగా శారీరకమైనవే. ఈ సమస్యలను అధికమించాలంటే డాక్టర్లను కలిసి నిర్భయంగా చెప్పుకొని సంసార జీవితాన్ని ఆస్వాదించండి.Read More
Mar 16 | చాలా మంది యువతీ యువకులకు విపరీతమైన లైంగిక కోర్కెలు ఉంటాయి. అలాంటి వారు.. సమయం సందర్భం లేకుండా వీలు చిక్కినపుడు రతి క్రీడకు ఉపక్రమిస్తుంటారు. మరికొంతమందికి తమకు మంచి మూడ్ ఉన్నప్పటికీ.. సెక్స్‌లో పాల్గొనేందుకు వెసులుబాటు ఉండదు. అలాంటి సమయాల్లో భార్య సెక్స్ కోరుకుంటుందని అలాగే, భర్త రతి కోసం ఆరాట పడుతున్నట్టు గుర్తించడం ఎలా? అనే సందేహం చాలా మంది యువతీ యువకుల్లో ఉంటుంది. ఈ అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే.... ఇలాంటి సందేహాలు లైంగిక విజ్ఞానం లేని యువతీ యువకుల్లో వస్తుంటాయన్నారు. ఇలాంటి సందేహాలు ఉత్పన్నమయ్యే యువతీ యువకులు తమలో లైంగిక పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు వీలుగా శృంగార పుస్తకాలు చదవాలని సలహా ఇస్తున్నారు. లైంగిక విజ్ఞానం కోసం సెక్స్ పుస్తకాలను చదవడంలో ఎలాంటి తప్పు లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతిలో లైంగిక కోర్కెలు అనేవి సహజసిద్ధంగా వచ్చేవన్నారు. ఇవి స్త్రీపురుషులిద్దరికీ కలుగుతుంటాయి. యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి జీవితకాలం ఈ కోర్కెలు ఉంటాయి. వీటిని తీర్చుకోవడంలో తప్పు లేదు. ముఖ్యంగా భార్యతో కలిసి ఆనందించడమే సక్రమమైన మార్గం. అయితే, సెక్స్‌లో పాల్గొనేందుకు ముందు భార్యతో గడిపే సమయమే అత్యంత కీలకం. సెక్స్ చేసే విషయంలో పురుషులకు ఆదుర్దా ఉంటే శీఘ్రస్కలనం అవుతుంది. అలాగే, ఆడవారికి భయం ఉంటే సెక్స్ బాధాకరంగా ఉంటుంది. అందువల్ల భార్యాభార్తలు సెక్స్‌లో పాల్గొనే ముందు ఎంత ఎక్కువ సేపు గడిపితే అంత మంచిది. అలాగే, భార్యకు సెక్స్‌పై ఆసక్తి ఉందో పురుషుడు గ్రహించి నడుచుకుంటే దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నంకావని కామశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Read More
Mar 07 | రతికి అవరోధంగా నిలిచేది సిగ్గు, బిడియం. అందుచేత చాలామంది రసానుభూతికి పెద్దగా తావులేని చీకటిలో నే అసలు పని కానిస్తారు. ఇది వాళ్ల వాళ్ల అభిరుచులను బట్టి మాత్రమే అనుభూతిని కల్గిస్తుంది. సిగ్గు, బిడియా లను విడిచిపెట్టి ఆలుమగలు చేరువయితే అందులో ఒక ఉత్కంఠతో కూడుకున్న ఒక కొత్త రుచి కనిపిస్తుంది. ప్రధానంగా రతిక్రియ చీకటిలోనే చేయాలనే సూత్రం ఏదీలేదు. ప్రాచీనకాలం నాటి నుంచి, మైధునం రాత్రిపూ ట చేసుకునే వ్యవహారం కాబట్టి కరెంట్ లేని ఆ కాలంలో, ఇలా చీకట్లో చిందులు వేయడం అలవాటయింది. అందువల్ల కూడా రతి అంటే చీకట్లోనే చేయాలనే వైఖరి ఏర్పడి వుంటుంది. ఆరాధన, ప్రేమ పట్టపగలు ఆనం దంగా సాగించి, చీకటి పడిన తర్వాత జీవిత భాగస్వాములిద్దరూ శారీరకంగా ఒకటి కావడం పరిపాటి అయిం ది. అందువల్ల వారిద్దరి మధ్యా సాగే ప్రధానమయిన సంగమ చర్యకు విజువల్ ఎఫెక్ట్ లేకుండా పోయింది. లైంగిక అవరోధ భావాల కారణంగా, ఆలుమగలు తమ తమ బాహ్య సౌందర్యాలను తిలకించకుండానే మైధునాన్ని కొనసాగించడం, దీనిని శారీరక అవసరాన్ని తీర్చే ఒక తప్పనిసరి చర్యగా మారిపోవడం జరిగింది. ఆలుమగలు మానసికంగా దగ్గర కావడానికి ఎంత ఒద్దిక అవసరమో శారీరకంగా మరింత గాఢంగా హత్తుకుపోవడానికి ఇరువురి శారీరక సౌందర్యాల రసాస్వదన కూడా అంతే అవసరం. వారి మనోభావాలు, ప్రతిస్పందనలు వారి శరీరాల కదలికల ద్వారా, భంగిమలద్వారా ప్రస్ఫుటితమవుతాయి. అందుచేత చీకటిలో దగ్గరయితే శరీరం ద్వా రా కమ్యూనికేట్ అయ్యే అనేక విషయాలు, అంతులేని భావావేశాలు ఒకరికొకరు వీక్షించి తెలుసుకునే మహత్తర అవకాశం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి రాత్రి పడకగదిలో చేరువకాగానే, ఆ తర్వాత సాగే మదనకాండకు సింబాలిక్‌గా లైట్ స్విచ్ ఆఫ్ చేసేయడం మానేసి, మరి కాసేపు భార్యాభర్తలు తమ తమ సౌందర్యాలను కంటి ద్వారా ఆస్వాదించుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ రాత్రి ఏర్పడే అనుభవం వారి ఎదలో మధురోహలను నింపుతుం ది. కొంతమందికి లైట్ వున్నంతసేపు మూడ్ రాని పరిస్థితి వుంటుంది. అటువంటి వ్యక్తులు ఈ మార్పు కారణం గా పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీకి గురవుతారు. ఇటువంటి వారిని మినహాయిస్తే, ఇతర దంపతులకు మైధున కార్య క్రమం లైట్ వేసుకునే చేసుకోవడం ఒక చక్కని అనుభవమ వుతుందనటంలో సందేహంలేదు. చాలామంది స్ర్తీలల్లో ఇందు కు సుముఖత లేకపోవడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే పురుషుల్లో కూడా ఇటువంటి బిడియం, సంకోచాలు వుండడం అసహజమేమీ కాదు. ఆలుమగలు, ముఖ్యంగా తమ రతి కార్యక్రమాలలో కొత్తదనం కోసం పరితపించే వ్యక్తులు ఇట్లాంటి అనుభవాలను ప్రయత్నించడం వల్ల మరింత ఆనందాన్ని కైవసం చేసుకున్నవారవు తారు. మరీ ట్యూబ్ లైట్ వేసుకోకపోయినా... కనీసం బెడ్ బల్బు సహాయం తీసుకున్నా ఆ తీరే వేరుగా వుంటుంది.Read More
Mar 01 | శృంగార జీవితాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే దూరంగా ఉన్న దంపతులకు మంచి మార్గం సెక్యువల్ టెక్స్ట్ మెసేజ్ మంచి ఆయుధం. సెక్స్టింగ్ చిలిపిగానూ ఉద్వేగభరితంగానూ ఉంటుంది. విపరీతమైన సెక్స్టింగ్ జరుపుతుంతుంటే శృంగారంలోకి దిగకుండా నియంత్రించుకోవడం అసాధ్యంగా మారుతుంది. అతి సాధారణంగా మొదలు పెట్టండి.... నాకు సెక్స్ చేయాలనిపిస్తుందని నేరుగా మొదలు పెట్టకూడదు. దానివల్ల నిస్పృహ చోటు చేసుకునే ప్రమాదం ఉంది. మీ దాంపత్యం ప్రారంభమై చాలా రోజులైతే అటువంటి సందేశం వల్ల పెద్దగా సమస్య ఉండదు. కొత్త దంపతులు నేరుగా అటువంటి సందేశంతో ప్రారంభిస్తే మానసికమైన సమస్య తలెత్తుతుంది. అందువల్ల అతి సాధారణంగా మొదలు పెట్టండి. ఏం చేస్తున్నావు వంటి ప్రశ్నలతో ప్రారంభిస్తే సంభాషణ కొనసాగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, చలిగా ఉందా, వేడిగా ఉందా వంటి వాటితో ప్రారంభించి మెల్లగా శృంగార సంభాషణలోకి దిగండి. మీ మూడ్ ఎలా ఉందో, అతని లేదా ఆమె సాన్నిహిత్యాన్ని ఎలా కోరుకుంటున్నారో చెప్పండి. మీ పురుషుడు ఆసక్తి ప్రదర్శిస్తుంటే.. ఏ దుస్తులు వేసుకున్నాడో అడగండి. తన కోసం కొన్న లోదుస్తుల గురించి చెప్పండి. వాటిని నీకు చూపించాలని ఉందని అనండి. అతను ఆసక్తి ప్రదర్శిస్తే మూడ్‌లోకి తెచ్చే పని చేయండి. డర్టీ సంభాషణ మొదలు పెట్టండి. ఉద్వేగ స్థాయిని పొందిన తర్వాత కాస్తా శృంగారం పలుకులు రాయండి. ఇంతకు ముందు పడక గది చేష్టలే గుర్తుకొస్తున్నాయని చెప్పండి. నువ్వు గుర్తుకొచ్చి చేతులకు పని చెప్పా, వస్తావా అని అగండి. ఇది మీ భాగస్వామిలో కామోద్రేకాన్ని రెచ్చగొడుతుంది. దాంతో అతనిలో కామోద్రేకం పరాకాష్టకు చేరుతుంది. నీతో మాట్లాడుతూ హస్తప్రయోగం చేసుకుంటే నీతో గడిపినట్లే ఉందని చెప్పండి, నువ్వుంటే ఇంకా ఎంత బాగుండేదో అని మత్తుగా అనండి.Read More
Feb 21 | పెళ్లయిన కొత్తలో దంపతులు ఏకాంతం కోసం తాపత్రయ పడతారు. ఎలాగో అలా సాధించుకుంటారు. క్రమంగా ఆ అవకాశం కనుమరుగైపోతుంది. దంప తులకు శ్రద్ధ ఇంతకు ముందు ఉన్నంతగా ఉండదు. దాంతో ఎంతో ప్రాముఖ్యత వున్న శృంగార బంధం, దాంపత్యంలో ఒక శారీరక అవసరాన్ని తీర్చే క్రియగానే మిగిలిపోతుంది. చాపకింద నీరులా నిశ్శబ్దంగా జరిగిపోతుంది. బాధ్యతలు, బరువులు, ఏకాంతం దొరకకపోవడం, జీవితం రొటీన్‌గా మారిపోవడం వంటి అనేక కారణాలు రసానుభూతిని పంచాల్సిన ఈ సంబంధాన్ని, యాంత్రికం చేస్తాయి.రతి పట్ల ఆసక్తి ఎక్కువగా వుండి, తమకు నచ్చినట్లుగా రతిని చేయాలనుకునే దంపతుల్లోనూ ఏ ఒక్కరయినా తమ ఆసక్తిని అటకెక్కిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. నిశ్శబ్దంగా రోజూ అలవాటుగా చేసే ఒక పనిలా దీనిని కూడా అయ్యిందనిపిస్తారు. సంభోగ సమయంలో కామోద్రిక్తతకు లోనయినప్పుడు, నోటితో పలురకాల ధ్వనులు చేసే అలవాటున్న వ్యక్తులకు, ఈ పరిస్థితి మరింత అయిష్టతను పెంచేస్తాయి. ఎవరయినా వింటారేమోనన్న బెంగ, భయం వారిని మరింత మూగవారిని చేసేస్తాయి. ఇలా కేకలు, అరుపులు పెడుతూ చేస్తే అది తప్పేమో అనే జంకును కలిగిస్తాయి. ఫలితంగా వారి దాంపత్యం మోడువారుతుంది.hot-navelకాబట్టి ఇటువంటి అలవాటు వున్న వారు దానిని వదులు కోనక్కర్లేదు. అందుకు తగినట్టుగా ఇంట్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నించా లి. సంభోగ సమయంలో తీవ్రస్థాయిలో భావ వ్యక్తీకరణ, స్వయం ప్రేరణకు చాలా బాగా ఉపకరి స్తాయి. అలాగే జీవిత భాగస్వామిని మరింత ప్రేరేపించడానికి, మరింత ఉత్సాహపరచడానికి, ఆ విధంగా రతిని ఒక నవ్యాతి నవ్యమయిన ప్రక్రియగా మార్చుకోవడానికి తోడ్పడుతుంది. ఇందులో సిగ్గు పడాల్సింది కానీ, భయపడాల్సింది కానీ, తలదించుకోవాల్సింది కానీ ఏదీ లేదని దంపతులు నమ్మాలి! రతి నిశ్శబ్దాన్ని చీల్చే ఒక చైతన్య పూరితమయిన చర్య.Read More
Feb 12 | భార్య రతిలో పాల్గొనడానికి భయపడడం వల్ల ఒక్కోసారి తన భర్తతో సరిగ్గా దాంపత్య సుఖంలో పాలుపంచు కోలేకపోతుంది. ఇందుకు రతిలో నొప్పి ఒక కారణం! దీనిని వైజ్ఞానిక పరిభాషలో వెజైనమస్ అంటారు.అంగప్రవేశం పట్ల అకారణమైన భయంతో జననేంద్రియం చుట్టూ వుండే కండరాలు బిగుసుకుపోయి, అంగప్రవేశాన్ని అసాధ్యం చేస్తాయి. ఏర్పడిన భయం పరిమాణాన్ని బట్టి, తొడల లోపలివైపు కండరాలు, గజ్జల కండరాలు కూడా బిగుసుకుపోయి రతిని మరింత ఇబ్బందికరంగా మలుస్తాయి. తాత్కాలికంగా ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా రతిలో నొప్పి ఏర్పడుతుంది. కాని తగిన మందులు వాడితే వెంటనే నయం అవుతుంది. మానసిక కారణాల రీత్యా, లేదా గతంలో ఏర్పడిన చేదు అనుభవాల రీత్యా కాని, జననేంద్రియాల నిర్మాణం పట్ల అవగాహన లేకపోవడ, సెక్స్ అంటేనే పాపం అనే భావన అంతరంగంలో గూడుకట్టుకుపోవడం వంటి కారణాల వల్ల రతిలో బాధ, నొప్పి కలుగుతాయి. ఈ విషయంలో దంపతులు, ముఖ్యంగా భార్యలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భర్త తన భార్యకు గల భయాలను అర్ధం చేసుకుని వాటిని తొలగించడంలో సహకారాన్ని అందివ్వాలి. స్ర్తీకి పునరుత్పత్తి అవయవాలు నిర్మాణాన్ని వివరంగా తెలియచెప్పి సంభోగ సమయంలో కండరాల రిలాక్సే షన్ ఎక్సర్ సైలు చేయించాలి. ముఖ్యంగా భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకోవాలి. భార్యకు చిరాకు కలిగించే విషయా లేమిటో ఆసక్తి కలిగించే విషయాలేమిటో తెలుసుకోవటానికి తదను గుణంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. సంభోగం సమయం లో ఏర్పడే చిక్కులు బయటకు చెప్పుకోకపోవడానికి బిడియపడే విషయాలు. కాబట్టి భర్తే చొరవ చేసి, భార్య మనసును తెరిచేందుకు ప్రయత్నించాలి. భయాన్ని పోగొట్టాలి. అంతేకాని ఈ కారణంగా భర్యా రతికి పనికిరాదనే నిర్ణయానికి వచ్చి, కాపురాన్ని కల్లోలభరితం చేసుకోరాదు.Read More
Jan 28 | మనది పొద్దున్న లేస్తునే హడావిడి జీవితం...రాత్రి పడుకునే ముందు దాకా ఆఫీసుకు వెళ్లడం...రావడం గురించే ఆలోచనలు తప్ప...ఆలుమగలు కలిసి సరదాగా బుర్లు చెప్పుకునే పరిస్థితి లేదు. ఒక వేళ ఉన్న కాసేపు సమయంలో...ఇద్దరూ ఆ కార్యక్రమాన్ని మొక్కుబడి తంతుగా ముగించేస్తు న్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి తృప్తి కలిగినా ఆ కార్యక్రమాన్ని అర్థంతరంగా మధ్యలో ఆపేసి...పక్కకి తిరిగి పడుకుంటుంటారు. ఇద్దరిలో ఒకరు మాత్రమే భావప్రాప్తి దశకు చేరుకోగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వస్తోందని ప్రశ్నించుకుంటే... కొందరు మానసిక, సెక్స్ శాస్తవ్రేత్తలు జరిపిన అధ్యయనంలో తేలిందేమిటంటే... ముందుగా ఆలుమగలకు సెక్స్‌కు సంబం దించిన అవగాహన ఉండాలి. - ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీల నుంచి వచ్చిన ఆడ, మగవారిలో ఇటువంటి సెక్స్ అవగాహన తక్కువగా ఉంటుందని తేలింది. - కొత్తగా పెళ్లిచేసుకునే జంటకు తమ శరీర అవయవాలమీద...వాటి నిర్మాణం మీద సరైన అవగాహన కల్పించేవిధంగా ఇంట్లో పెద్దలు సహకరించాలి.లేకుంటే వాళ్లను దగ్గరలో ఉన్న ఎవరైనా మంచి సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకు వెళ్లి... ఇటువంటి విషయాలమీద అవగాహన కల్పించాలి. - భావప్రాప్తి అనేది ఒక మానసిక భావన. మనసుకు సంబంధించినది. మన మనసు ఉల్లాసంగా... ఉద్వేగంగా ఉంటే... అవతల వ్యక్తిపై అన్యోన్యం ఉంటే తప్పక భావప్రాప్తి కలుగుతుంది. అలాగాక అందుకు వ్యతిరే కంగా... అంటే ఆ వ్యక్తి మీద మనసులో ఏ మూలనైనా అయిష్టత చోటుచేసుకుంటే... భావప్రాప్తి తక్కువగా... ఒక్కో సందర్భంలో అస్సలు లేకుండా కూడా ఉండే చాన్స్ ఉందని సెక్సాలజిస్ట్‌లు సూచిస్తున్నారు. - మగవారికి... ఆడవారికి కూడా వారు పని చేసే ఆయా సంస్థలలో పని ఒత్తిడిని బట్టికూడా వాళ్ల మానసిక పరిస్థితి ఆధారపడి వుంటుంది. పని ఎక్కువయితే...సెక్స్ ప్రక్రియను మొక్కు బడితంతుగాముగించేస్తుంటారు. ఒక్కొక్కసారి ఆ పని అంటేనే విముఖత చూపిస్తుంటారు. - చాలామంది మగవారు ఆ...కార్యక్రమాన్ని ఓ పనైపోయింది బాబూ...అనేలా తొందర, తొందరగా ముగించేసి...ఒక్కసారిగా పెద్దగా ఆవలించేసి అవతలకి తిరిగి పడుకుంటారు. ఇవతల వాళ్ల పార్ట నర్ మనసులో ఇంకా సెక్స్ కావాలని కోరుకుంటుంది. ఆమెకు భావప్రాప్తి కలగలేదు. ఈ సంగతి మనవాడు గ్రహించే స్థితిలో ఉండడు. అలాంటి స్థితిలో ఇద్దరూ ఒకరి నొకరు సహకరించుకుంటే ఈ పరి స్థితి నుండి బయటపడవచ్చు. - మగవారిలో అటువంటి సమస్య ఉన్నప్పుడు లైఫ్పార్ట్నర్గా స్ర్తీ సిగ్గు పడకుండా పురుషుని అంగాన్ని ప్రేరేపిస్తూ... అతనికి స్కలనం కాబోతుండగా కొంతసేపు గ్యాప్ ఇచ్చి...అలా మొల్లిగా శీఘ్రస్కలనం సమస్య నుండి దూరం చేయవచ్చును. - పురుషుని ఇష్టానికి తగ్గట్లుగా కొన్నిసార్లు ఉపరతి...అంటే పురుషుడు కింద ఉండి స్ర్తీ పైన ఉండే భంగిమలో సెక్స్ప్రక్రియలో పాల్గొంటే పురుషునికి అంత తొందరగా శీఘ్ర స్కలనం అవదు. - పురుషుడు కూడా వెంటనే రతిలో పాల్గొన కుండా... కొద్దిసేపు సరస సంభాషణలు సాగించి మొల్లిగా ఆమె శరీరాంగాలను చేతి వేళ్లతో సున్నితంగా స్మృజిస్తూ... ఆమెలో సెక్స్ కోరికలు కలిగేలా చేస్తూ... వైణికుడు వీణ మీటినట్లుగా లయబద్ధంగా ఆ కార్యక్రమంపై ఆమెకు ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. - ఎప్పుడూ ఒకటే భంగిమకాకుండా... బోర్ డమ్లేకుండా వివిధ భంగిమలను పాటిస్తూ... నిత్యం ఆరోగ్య సూత్రాలను పాటిస్తూవుంటే ఇద్దరిలో ఎటువంటి సమస్య ఉత్పన్నమవదు.Read More
Jan 28 | ఈరోజుల్లో సెల్‌ఫోన్ లేనిదే క్షణం గడవటంలేదు. ఎక్కడెక్కడివారితోనో ఎన్నో విషయాలు సంభాషించందే మనసు శాంతించదు. నిజానికి సెల్ఫోన్ల వాడకం మగవారి కన్నా, ఆడవారే ఎక్కువగా వినియోగిస్తున్నారని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అది మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నాయి.అయితే తాజాగా గర్భిణులు మొబైల్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడితే, పుట్టబోయే బిడ్డపై దుష్ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏడేళ్ల వయస్సు రాగానే వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు కనిపిస్తాయని కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలు తాజా అధ్యయనంలో వెల్లడించాయి. 29వేల మంది పిల్లలపై సర్వే జరుపగా సుమారు 50 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించాయని పేర్కొంది. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి మొబైల్ ఫోన్లో మాట్లాడితే 30 శాతం, బాల్యం నుంచే ఫోన్లో మాట్లాడే చిన్నారుల ప్రవర్తనలో 20 శాతం మార్పులు కనిపించాయని వివరించింది. గర్భిణులు రోజుకి నాలుగుసార్లు కంటే ఎక్కువగా మొబైల్లో మాట్లాడితే, రేడియేషన్ ప్రభావం త్వరగా బిడ్డకి చేరుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చెప్పిన మాట విని, పండంటి బిడ్డ పుట్టేదాకా చెవిదగ్గరకి సెల్‌ని చేర్చకండి.Read More
Jan 19 | రతిలో స్ర్తీలకు భావప్రాప్తి లేదా ఉద్వేగం కలగటం లేదని తోటి స్నేహితుల వద్ద వాపోతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందన్న అంశాల పై నిపుణులు కొన్ని సూచనలు చెబుతున్నారు. ప్రధానంగా సెక్స్‌లో పాల్గొనే మహిళకు రతి క్రీడలో కేవలం రెండంటే రెండు నిమిషాలు మాత్రమే స్వర్గలోక ఆనందాన్ని పొందుతారట. అలాగే, పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనే మహిళకు రెండు అంశాల్లో ఆందోళన చెందుతుందట. అది ఒకటి గర్భం వచ్చేస్తుందనే భయం కాగా మరొకటి, తాను ఎంజాయ్ చేసే మగాడి నుంచి సుఖ వ్యాధులు అంటుతాయనే భయం ఉంటుందట. అలాంటి సమయంలో సురక్షితమైన సెక్స్ పద్ధతులు పాటించి రతి క్రీడలో పాల్గొనంత సేపు ఎంజాయ్ చేయాలని సెక్స్ వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే, సెక్స్ చేసే సమయంలో తమలో వచ్చే అనుమానాలను భర్యాభర్తలిద్దరు ఏమాత్రం బిడియం, సంకోచం లేకుండా చర్చించుకోవడంలో తప్పులేదని చెపుతున్నారు. అపుడే భార్యా భర్తలిద్దరు భావప్రాప్తి పొందగలుగుతారని చెపుతున్నారు. కొన్నిసార్లు భావప్రాప్తి మహిళలు శారీరక కారణంగా కూడా పొందలేరు. అయితే, కొద్దిపాటి మార్గదర్శకతతో వీరు లైంగిక చర్యలలో నిపుణులుగా కూడా రాణించగలరు. మహిళకు ఒకసారి భావప్రాప్తి లేదా స్కలనం జరిగిందంటే, రెండో సారి భావప్రాప్తి తేలికవుతుందట. ఒకే సెషన్లో రెండు లేదా మూడు సార్లు సైతం ఆమె భావప్రాప్తి పొందే అవకాశం ఉంది. కాని పురుషుడి అంగం, ఫోర్ ప్లే, అతని శారీరక చర్యలు వంటివి అందుకు మళ్లీ సహకరించేలా ఉండాలి. అదేసమయంలో సెక్స్‌లో ఎంత సేపు పాల్గొన్నా భావప్రాప్తి పొందలేని మహిళలు కూడా సెక్స్ వైద్య నిపుణులను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.Read More
Jan 19 | సాధారణంగా గృహిణులైన మహిళలు సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. అయితే, ఏ మహిళ అయిన తొలుత.. తన పట్ల భర్త లేదా పురుషుడు అమితమైన ప్రేమను కనుపరుస్తూ ఉండాలని కోరుకుంటుందట. ఆ తర్వాతే.. సెక్స్‌లో పాల్గొనాలని తహతహలాడుతుందట. ఈ విషయం నిపుణులైన మానసిక శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. స్త్రీ, పురుషుల్లో శృంగార చర్య తగ్గటం కూడా ఒక కారణమని మానసిక శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అదే మానసిక శాస్త్రవేత్తలు మరో విషయం చెప్పారు. ప్రపంచంలో స్త్రీకి మించిన నెంబర్ వన్ సైకాలజిస్టు లేదని కూడా చెప్పారు. ప్రధానంగా భాగస్వామి పడక గదిలో నిశ్శబ్ధంగా ఉన్నా.. ఆమె ప్రైవేట్ భాగాలను తాకినపుడు, నుదురుపై చేయి వేచినపుడు చేయిని తీసేస్తే సెక్స్ పట్ల అయిష్టంగా ఉందని గ్రహించాలని చెపుతున్నారు. దీనికి కారణం స్త్రీ ఎప్పుడూ ముందు ప్రేమ కోరుకొని ఆపై శృంగారం కావాలని కోరుకుంటుందని చెపుతున్నారు. కానీ, పురుషుని విషయంలో మాత్రం ముందు సెక్స్‌లో పాల్గొని ఆ తర్వాత ప్రేమను పంచేందుకు అమితాసక్తిని చూపుతారని చెపుతున్నారు. అంతేకాకుండా, రతిలో పాల్గొనడం కూడా ఏ అర్థరాత్రి లేదా.. మంచి నిద్రా సమయంలో చేయడం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. మంచి నిద్ర సమయంలో శరీరంలోని కొన్ని అలసిపోయిన భాగాలు పూర్తిగా విశ్రాంతిని కోరుకుంటాయని, అలాంటపుడు స్త్రీని సెక్స్‌కు ప్రపోజ్ చేస్తే నో అనే సమాధానమే వస్తుందంటున్నారు. అదేసమయంలో పగటి పూట ఉండే కోపం.. పడక గదికి వచ్చేలోపు మాయం కావాలని అంటున్నారు. అపుడే భార్యాభర్తల శృంగారం పూర్తి సంతృప్తితో సాగుతుందని చెపుతున్నారు. ఇలాంటి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే భార్యాభర్తల శృంగార జీవితం సాఫీగా సాగుతుందని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.Read More