May 10 | మంచి రతి చేయాలంటే, సమయం, ప్రదేశం వంటివాటితో సంబంధం లేదు. అది మీ మనో భావనపై ఆధారపడి వుంటుంది. మీ పార్టనర్ పైనా, మీ పైనా అది ఆధారపడి వుంటుంది. అయితే, చక్కని భావప్రాప్తి ఎపుడు పడితే అపుడు రాదనే చెప్పాలి. దానికి మంచి సమయం కావాలి. సైంటిఫిక్ గా నిరూపణ అయినవి అనుభవంపై వచ్చేవాటితో ఇది మంచి సమయం అని సరైన సమయంకాదని చెపుతారు. 1. రోజులో ఉదయం వేళ - ఉదయంవేళ రతి కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తారు. కాని అది ఇంతవరకు ఎవ్వరిని నిరాశ పరచలేదు. ఉదయంవేళ పెందలకడే ఇద్దరికి బాగానే వుంటుంది. ఒకరితర్వాత మరి ఒకరు లేచి అందుకు సిద్ధం కావచ్చు. మరింత సన్నిహితంగా వుంటారు. నిద్ర భావన ఇద్దరికి పోకుండా వుంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే, ఉదయం వేళ పురుషుడి అంగ స్తంభనలు బాగా వుంటాయి. 2. ఒక మంచి నిద్ర లేచిన తర్వాత సమయం - సాధారణంగా మంచి నిద్రపోయి లేచిన తర్వాత చాలా శక్తివంతంగా వుంటారు. ఈ సమయం కూడా రతికి మంచి సమయం. అది ఆదివారం మధ్యాహ్నమైనా లేక వారంలో ఉదయమైనా ఇది బాగానే వుంటుంది. మీకుగల శక్తికి మీరే ఆశ్చర్యపోతారు. 3. స్నానం చేసిన తర్వాత - నిద్ర తర్వాత వేడి నీటి స్నానం మాత్రమే మీకు మంచి శక్తినివ్వగలదు. కనుక స్నానం తర్వాత రతికి మంచి సమయమే. కలసి స్నానం చేసినా బాగానే వుంటుంది. అలసి సొలసి ఇంటికి వచ్చారా? రాగానే బాత్ రూమ్ లో స్నానం చేసేస్తే ఎంతో ఆనందంగా భావిస్తారు. కనుక బాత్ రూమ్ స్నానం చేసిన తర్వాత రతి బాగా సాగుతుంది. 4. ఆమెకు నెలసరి సమయమా? ఇది సూచించదగినది కాదుగానీ, సురక్షిత రతికి అనుకూలమే. ఆమె కు 10 నుండి 18వ రోజువరకు రతినాచరించడం సురక్షితం. ఈ సమయంలో హార్మోన్లు పెరిగి రతి ఆమెకు కావాలనిపిస్తూంటుంది. కనుక ఇది చాలా మంచి సమయం. 5. ఇద్దరికి మూడ్ వుందా? అన్నిటికి మించి ఇద్దరికి రతి మూడ్ వుండటం ప్రధానం. ఒకరికి కావాలని అనిపిస్తూ మరొకరికి వద్దు బాబో అనిపిస్తే ఇక ఆసమయం రతిక్రీడలకు మంచిది కాదు. కనుక ఇద్దరూ సమానంగా రతిలో భాగం పంచుకుని ఆనందించాలి. మరి మంచి రతి సమయానికిగాను ఈ చిట్కాలు పాటించండి.Read More
May 03 | సెక్స్ గురించి మాట్లాడుకోవడం పెద్ద తప్పేం కాదు అని ప్రస్తుతం సమాజమే అభిప్రాయపడుతోంది…అంటూ అమ్మాయిలు ఏం మాట్లాడుకుంటారు అని అంశం గురించి వివరించారు ఆ అధ్యయన కర్తలు. అమ్మాయిలు సెక్స్ లైఫ్ గురించి అనేక అంశాలపై ఒకరితో ఒకరు మాట్లాడుకొంటారట! సెక్స్ వల్ ఎక్స్ పీరియన్స్, ఆర్గసమ్స్, సైజ్, నంబర్ ఆఫ్ సెక్స్ వల్ ఎక్ప్ పీరియన్స్సెస్, కొత్త రుచుల గురించి, సెక్స్ లో నచ్చిన, నచ్చని అంశాల గురించి వారిలో వారు చాలా ఓపెన్ గా మాట్లాడుకొంటారట! ఇలా మాట్లాడు కోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అమ్మాయిలు అభిప్రాయపడుతున్నారు. మరి ఎలాంటి వారితో ఈ విషయాల గురించి చర్చిస్తున్నారు అని విశ్లేషిస్తే…క్లోజ్ ఫ్రెండ్స్, తనకు అత్యంత విశ్వసనీయులైన బంధువుల అమ్మాయిలతో మాత్రమే అమ్మాయిలు దీని గురించి మనసు విప్పుతారట. ఏ మాత్రం అన్ కంఫర్ట్ అనిపించినా, వారి వ్యక్తిత్వం నచ్చకపోయినా సెక్స్ అనే పదాన్ని ఎత్తడానికి కూడా అమ్మాయిలు సంకోచిస్తారట. ఇదంతా ఓకే కానీ ఈ సర్వే చేసింది భారతదేశంలో కాదు. హార్వర్డ్ యూనివర్సిటీలో!Read More
Apr 13 | మీ భాగస్వామితో రతిలో పాల్గొనాలని ఉండి కూడా మీరు రతిలో పాల్గొన లేక పోతున్నారా ? అయిత ఈ మూడు పద్దతులు ట్రై చేసి మూడ్ తెచ్చుకోండి. పురుషుడు పైన - పురుషుడికి ఇది చాలా ప్రయోజనం. 30 నిమిషాలు పైన వుంటే ఎన్నో కేలరీలు ఖర్చవుతాయి. కాలి పిక్కలు, తొడకండరాలు కింది పొట్ట కండరాలు బలపడతాయి. చేతులు, మోకాళ్ళు మరియు పొట్ట భాగం ఇద్దరికి సాగుతూనే వుంటాయి. మహిళ పైన - భావప్రాప్తికి ఈ భంగిమ మహిళలకు ఎంతో ఆనందం. మహిళలు కదిలే వేగాన్ని అంగంలోతును చక్కగా నియంత్రించుకునే అవకాశం. దీనిలో మహిళ తొడ కండరాలు, చేతులు, బాగా బలపడతాయి. లేదంటే మహిలలు తమ తొడలపై కూర్చోవచ్చు కూడాను. ఈ భంగిమలో ఆనందంతో పాటు బరువు తగ్గటం కూడా జరుగుతుంది. పురుషుడు తన చేతి కండరాలతో ఆమెను పైకి కిందకి ఆడించవచ్చు. నిలబడి - దీనికి పురుషుడు చాలా కష్టపడాలి. ఆమె బరువు మోయాలి. పిరుదులు, తొడలు, బాగా శ్రమిస్తాయి. మహిళ కూర్చోటానికి ఏదీ సపోర్టు తీసుకోకుంటే ఆమె చేతులు, భుజాలు, కాలి కంటరాలతో నిలబడిన పురుషుడిని చుట్టేస్తుంది. ఇది శరీర కండరాలు బలపరచి కేలరీలు కరిగిస్తుంది.Read More
Apr 04 | ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అప్పుడే మూడు నెలలు గడిచి పోయాయి. మార్చి వెళ్ళి పోయి ఏప్రిల్ వచ్చేసింది. అంటే సమ్మర్ వచ్చేసిందన్న మాట. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎండ తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏకాలంలోనైనా సెక్స్ అనేది ఒక నూతన వసంతం. మరి అలాంటి సెక్స్ ని వేసవిలో అంతగా ఎంజాయ్ చేయలేరు. బయటి ఉష్టోగ్రతలకు చాలా మంది అలసి... రాత్రి చల్లబడే సరికి బెడ్ రూం లో సొలసి పోయి సెక్స్ ని ఎంజాయ్ చేయలేదు. అటు వంటి వారికి ఇంటిలో ఎండ వేడికి చల్లబడటమేకాక రాత్రయ్యేసరికి బెడ్ పై ఆనందంగా అనుభవించేయాలంటే కొన్ని చిట్కాలు చూడండి. పుచ్చకాయ - పుచ్చకాయలో వయాగ్రా మందులోని పదార్ధాలున్నాయని చెపుతూంటారు. ఇది సహజంగా కామాన్ని పెంచే పండు. దీనిలో వుండే అర్జినైన్ అనే ఎమినో యాసిడ్ రసికతను పెంచుతుంది. కనుక ఈ వేసవిలో పుచ్చకాయలు తిని మీ రతి సామర్ధ్యం పెంచుకోండి. టమాటాలు - ఎర్రటి టమాటాలను ‘ లవ్ ఆపిల్’ అని కూడా అనటం వినేవుంటారు. రతి సామర్ధ్యం పెంచేవాటిలో టమాటా ఒక పండు. పురుషుల వీర్యం నాణ్యత కూడా దీనితో పెరుగుతుంది. సలాడ్ గా తింటే రుచిగా వుంటుంది. ప్రయోజనం అధికం. మింట్ కాక్ టెయిల్ - మింట్ ని మౌత్ ఫ్రెషనర్ గా అంటే తాజా శ్వాస కొరకు వాడతారు. ప్రత్యేకించి ఇది మహిళలలో మంచి మూడ్ తెప్పిస్తుంది. కనుక దీనితో మింట్ కాక్ టెయిల్ తయారు చేసికొని సిప్ చేయండి. ఆల్కహాల్ కూడా తగుమాత్రంగా ఈ సమయంలో మీ కామ కోర్కెలను పెంచుతుంది. కీరదోస - వేసవిలో విరివిగా దొరికే కీరదోస కూరగాయతో మీ మూడ్ చల్లబరచుకోండి. రాత్రయ్యేసరికి రతికి సిద్ధం చేస్తుంది. కరిగిన చాక్లెట్ల్ లు - వింటేనే నోరూరిపోతుంది. ఏ సీజన్ లో అయినా సరే ప్రేయసి పక్కనేవుండి చాక్లెట్ నోట్లో వేస్తే...రాత్రంతా ఇక జాగరణే. ఈ చిట్కాలు పాటించండి... వేసవిలో సెక్స్ ని శీతాకాలం లాగా చల్లగా మార్చుకోండి.Read More
Mar 22 | నేడు నూటికి ఎనభై శాతం నుండి తొంభై శాతం మంది దంపతుల మధ్య కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే... మొక్కుబడి తంతులా... తూ...తూ... మంత్రంలా ఆ.. కార్యాన్ని జరుపుకుంటున్నారు. రొటీన్ కి భిన్నంగా ట్రై చేస్తే సంసార స్వర్గాన్ని చవిచూడొచ్చనే సంగతి చాలా మందికి తెలియదు. ఇలా నిత్యజీవితంలో మనం ఏ పనిచేసినా ఒకే విధంగ చేస్తే ఆ పనిమీద అంతగా ఆసక్తి చూపం. ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తిని కనబరుస్తాం. అందుకే వాత్సాయనుడు కామశాస్త్రంలో దాదాపు 525 కి పైగా భంగిమలను అభివర్ణించాడు. వాటిలో కొన్ని మీరు అనుసరించండి. ఆ కార్యంలో మధురానుభూతిని పొందండి. పురుషుడు పైనుండే భంగిమ.... ఇది దాదాపు 70 శాతం మంది పురుషులు పాల్గొనే సెక్స్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో పురుషుడు పై భాగంలో ఉంటాడు.అతని కింద స్త్రీ ఉంటుంది. ఇద్దరి ముఖాలు ఒకరిని ఒకరు చూసుకునే విధంగా ఉంటుంది. సాధారణంగా ఈ భంగిమ ద్వారానే స్త్రీలు స్వర్గాన్ని చూస్తారని పురుషులు అపోహ పడుతుంటారు. ఈ భంగిమలో కదలికలు అంత ఫ్రీగా ఉండవు. పైగా పురుషుడు బరువు అధికంగా ఉంటే... ఒక్కోసారి కింద ఉన్న స్త్రీ ఆ బరువు తట్టుకోలేక... సెక్స్ అంటే విరక్తి కలిగే అవకాశం ఉంది. పైగా స్త్రీల లో సెక్స్ లో పతాక స్థాయికి చేర్చే కేంద్రబిందువైన క్లిటోరస్ కు ఈ ప్రక్రియ ద్వారా ఒరిపిడి చాలా తక్కువ స్థాయిలో కలిగే అవకాశం ఉంటుంది. కదలికలు ఎక్కువ శాతం ఉండవు. కేవలం పురుషాధిక్యత కోసమే ఈ భంగిమ అని కొందరు స్త్రీలు అంటుంటారు. పురుషుడు కిందవుండే భంగిమ.... ఇది చాలా ఉత్తమమైన భంగిమ. ఈ భంగిమ ద్వారా స్త్రీకి వివిధ కామోద్రేకాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. స్త్రీ తన నియంత్రణ శక్తి ద్వారా తనకు ఏ మేరకు త్రుప్తి పొందవచ్చో ఈ ప్రక్రియ ద్వారా పొందుతుంది. ఎక్కువగా పురుషులలో శీఘ్రస్కలనం ఉన్నవారికి ఈ భంగిమ ఉత్తమమైనది. భార్యకన్నా భర్త అధిక బరువు ఉన్నా ఈ భంగిమ ఉత్తమమైనది. మోకాలు నొప్పి ఉన్న వారికి.... స్త్రీ’ని వి ఆకారంలో పడుకొని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీని వల్ల ఇద్దరికీ ఎటువంటి భాద అనిపించదు. నడివయసులో ఉన్న వారికి ఎక్కువగా మోకాలి నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి ఇది దివ్యఔషదం. భావ ప్రాప్తి భంగిమ.... లూబ్రికేషన్ తక్కువ శాతం కలిగిన స్త్రీలకు అత్యంత త్రుప్తినిచ్చే భంగిమ ఇది. అయితే ఇందులో ఆలుమగల మధ్య సహకారం ముఖ్యం. పురుషుడు వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్ ని సున్నితంగా మీటుతుండాలి. స్త్రీ కూడా పురుషుడి శిష్నం ని చేతితో తీసుకొని మ్రదువుగా మర్థిస్తుండాలి. ఇలాంటి భంగిమలు వయసు పై బడిన వారికి బాగా ఉంటుంది.Read More
Mar 15 | స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు, పుట్టుమచ్చ రంగులను బట్టి వారి జీవితంలో పరిణామాలు చోటుచేసుకుంటాయంటాయట. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్ర్తీ కుడి వక్షోజంపై తిలకం రంగులో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆమె సంతానవతి అవుతుంది. అయితే సామాన్యమైన జీవితాన్ని మాత్రమే గడుపుతుంది. పురుష సంతానం అధికంగా ఉంటుంది. ఎడమ కుచముపై బొట్టు ఆకారంలో ఎరుపు రంగు కలిగిన మచ్చ ఉన్నచో ఆ స్త్రీ పురుష సంతానం ప్రసవించిన పిదప భర్తకు గండం కలుగుతుంది. కనుక దీనికి వెనువెంటనే శాంతి చేయించుకోవలసి ఉంటుంది. కుడి స్తనమునకు కుడి భాగమున ఎర్రటి పుట్టుమచ్చ ఉన్నచో ఆ స్త్రీ ఇతరులను దూషించేదిగా ఉంటుంది. భర్త మాటను లెక్కచేయదు. కోప స్వభావం అధికంగా ఉంటుంది. కుడి స్తనమునకు ఎడవైపున మచ్చ ఉన్నట్లయితే పతి భక్తి కలిగి, దైవ భక్తితో ఉంటుంది. దేవబ్రాహ్మణ పూజలు చేస్తుంటుంది. సంతానవతియై సర్వసుఖములు పొందుతుంది. బంధుప్రీతి కలిగి ఉంటుంది. ఎడమ వక్షోజానికి ఎడమ భాగమున మచ్చ ఉన్నట్లయితే ఆ స్త్రీకి సంతాన భాగ్యం ఉండదు. అయితే తీరని కామము కలిగి ఉంటుంది.ఇక వక్షోజాల దిగువ భాగమునకు దగ్గరగా మచ్చి కలిగిన స్త్రీ సమస్త భోగములను అనుభవిస్తుంది. కుచములకు మరీ క్రింది భాగమున మచ్చ ఉన్నట్లయితే నిలకడలేని మనసు కలిగి ఉంటుంది. మితము లేని ఆశతో, కోప స్వభావంతో ఉంటుంది.మొత్తమ్మీద వక్షస్థలమున మచ్చ ఉన్నట్లయితే స్త్రీకి సర్వ సౌఖ్యములేనని చెప్పవచ్చు. అయితే ప్రతి విషయములో మచ్చ యొక్క ఆకార పరిమాణాన్ని బట్టి ఫలితం ఉంటుంది.Read More
Mar 01 | శృంగారం లేకుంటే.. చావేరాదు! ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ? నిజమే మీరు సెక్స్ చేయకుండా ఉంటే మీకు చావేరాదట ? దీంతో మీరు జీవితకాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పెరుగుదలను అరికట్టవచ్చా? జీవితకాలాన్ని పెంచడం సాధ్యమేనా? మరణాన్ని కూడా జయించవచ్చా?.. సెక్సుకు దూరమైతేనే అది సాధ్యమా? అవును, లింగ భేదంలేని ఒక జాతి జీవులు ఆ మార్గాన్ని చూపిస్తున్నాయంటున్నారు లండన్ శాస్త్రవేత్తలు! ఫ్లాట్ వార్మ్ వర్గానికి చెందిన ప్రాణులపై నాటింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వయసు పెరుగుదలను అరికట్టి ఎప్పటికీ యవ్వనంగా ఉండగలిగే శక్తి వాటిలో ఉందని గుర్తించారు. ఈ జీవుల్లో జరిగే ప్రక్రియ మనిషి ఆయుష్షు పెంచడానికి కూడా మార్గం చూపుతుందని భావిస్తున్నారు. ఫ్లాట్ వార్మ్ జీవుల అపరిమితమైన పునరుత్పత్తి సామర్థ్యం ఆశ్చర్యపరుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసు మీద పడిన, చెడిపోయిన కణాలను, కణజాలాన్ని ఈ క్రిములు ఎప్పటికప్పుడు కొత్తవాటితో మార్చేసుకుంటాయట! దాంతో అవి ఎప్పుడూ యవ్వనంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఫ్లాట్ వార్మ్ జాతికి చెందిన రెండు రకాల (లైంగిక చర్యతో పునరుత్పత్తి జరిపేవి, రెండుగా విడిపోయి తమ సంఖ్య పెంచుకునేవి) జీవులపై అధ్యయనం జరుగుతోంది. 'సాధారణంగా కొత్త కణాల అభివృద్ధికి మూలకణాలు (స్టెమ్ సెల్స్) ఉపయోగపడతాయి. కణాల పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే మూలకణాలు కూడా క్రమంగా శక్తిని కోల్పోయి చివరకు నశిస్తాయి. అయితే ఫ్లాట్‌వార్మ్ జీవుల్లో మాత్రం అలా జరగడం లేదు. అవి అపరిమితంగా అన్ని రకాల కణాలను పునరుత్పత్తి చేస్తున్నాయి. మెదడును కూడా ఎన్నిసార్లయినా కొత్తగా సృష్టించగలుగుతున్నాయి' అని పరిశోధకులు వివరించారు. 'కణ విభజన జరిగినపుడు మాతృ కణంలోని డీ ఎన్ఏ కొత్త కణానికి అందుతుంది. వాటిలోని క్రోమోజోముల జతలను ముడిపెట్టి ఉంచే టెలోమెర్ చాలా కీలకమైనది. గొలుసుకట్టుగా ఉండే క్రోమోజోమ్‌ల చివరన ఇది రక్షణ తొడుగులా ఉంటుంది. ప్రతిసారీ కణవిభజన జరిగినపుడు ఈ టెలోమెర్ పొడవు తగ్గిపోతుంది. దీంతో కణాల్లోని జన్యు సమాచారం క్రమంగా నశించి.. వాటికి కొత్త కణాలను సృష్టించే శక్తి క్షీణిస్తుంది. అయితే మరణంలేని ఫ్లాట్‌వార్మ్ వంటి అలైంగిక జీవుల్లో మాత్రం టెలోమెర్ పొడవు ఎన్నటికీ మారడం లేదని భావిస్తున్నాం' అని ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ థామస్ టాన్ తెలిపారు. ఈ జీవుల్లో టెలోమెర్ నశించకపోవడానికి 'టెలోమెరాస్' అనే ఎంజైమ్ కారణమని ఆయన గతంలోనే కనుగొన్నారు. ఇందుకుగాను 2009లో ఆయనకు వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది. మనుషుల్లో ఈ ఎంజైమ్ తొలినాళ్లలో మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని, అలైంగిక జీవుల్లో మాత్రం పునరుత్పత్తి జరిగిన ప్రతిసారీ ఇది పనిచేస్తుందని థామస్ గుర్తించారు. లైంగిక చర్య జరుపుకొనే జీవుల్లో మాత్రం ఈ ఎంజైమ్ ఎందుకు ఎక్కువ కాలం పనిచేయడం లేదన్నది శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. సెక్స్ కు దూరంగా ఉండటం వల్లే 'టెలోమెరాస్' శక్తివంతంగా పనిచేస్తోందా? అన్న విషయాన్నీ వారు పరిశీలిస్తున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించి మనుషుల్లోనూ టెలోమెర్ పొడవు తగ్గకుండా చేస్తే ఇక మరణం అనేదే ఉండకపోవచ్చు! లేదా జీవితకాలం అసాధారణంగా పెరగవచ్చు! మరోవైపు.. వయసుకు సంబంధించే అమెరికన్ పరిశోధకులు మరో కొత్త విషయం బయటపెట్టారు. 'మీ మెదడు చురుగ్గా ఉండాలంటే చేపలు బాగా తినండి' అని కాలిఫోర్నియా యూనిర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని పాటిస్తే మన మెదడుకు ముసలితనం రాదట! మనం తీసుకునే ఆహారంలో ఒమెగా-3 వంటి ఆమ్లాలు తగ్గడం వల్ల మెదడు కణాలు క్షీణిస్తున్నాయని, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. చేపలు అధికంగా తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, చేపనూనె వల్ల మెదడు చురుగ్గా మారుతుందని చెబుతున్నారు.Read More
Feb 24 | పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ మరింత సన్నిహితం చేసే ఒక రాత్రి గడిపేటంతవరకు కూడా రావచ్చు. సాధారణంగా నేటి రోజుల్లో అంతవరకు వస్తే, ఎవరికి వారు ఎంత అదృష్టం అనుకోవడం కూడా సహజమే. తాజాగా చేసిన ఒక సర్వేలో ఈ రకంగా ఒక్కరాత్రి రతి చాలా మందికి చక్కని భాగస్వామిని ఏర్పరచేటంత అదృష్టంగా వరించిందని మానసిక వేత్తలు చెపుతున్నారు. చాలా సర్వేలు ఒక గట్టి సంబంధం ఏర్పడాలంటే ఒక్కరోజు రతి బాగా సహకరిస్తోందని చెపుతున్నాయి. మహిళలు 44 శాతం ఈ రతి జరిగిన తర్వాత తమ పురుష స్నేహితులకు కట్టుబడి వుండగా, పురుషులు 25 శాతం తమ మహిళా స్నేహితులకు కట్టుబడి వున్నారని సర్వే చెపుతోంది. స్నేహితులుగా కాకుండా కొద్దిపాటి పరిచయం వుంటే చాలు ఒక్క రాత్రి రతి జరిపిన వారు, మహిళలలో 30 శాతం, పురుషులలో 43 శాతం తమ సంబంధాలకు కట్టుబడి వున్నారట. అయితే, ఈ రకమైన భావనలను వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. ఒక్కరాత్రి సెక్స్ చేస్తే చాలు, సుఖ వ్యాధులు జీవితాంతం వెన్నాడుతూంటాయనుకునేవారు కూడా లేకపోలేదు. మరి కొందరు ఈ ఒక్కరాత్రి రతిని తేలికగా తీసుకుని ఉదయం అయ్యే సరికి మర్చిపోయే టట్లు కూడా వుంటారు. అదనపు సౌకర్యంతో ఒక ఫ్రెండ్ అనే భావన దీర్ఘకాలంగా యువతలో బలపడింది. తాత్కాలికంగా సెక్స్ అవసరం గడిచిపోతున్నప్పటికి పరిపక్వంగా ఆలోచించే మైండ్ మాత్రం ఈ ఒక్క రాత్రి సెక్స్ కు వ్యతిరేకంగానే వుంది. విచ్చలవిడిగా తిరిగేసే వారు చివరకు విలువలేనివారుగా కూడా అయిపోతారని భావిస్తున్నారు. మీకు మీరు శరీరాన్ని పాడు చేసుకోవడమే నంటున్నారు. అయితే మరి కొందరు, సెక్స్ వరకు రానియకుండానే స్నేహంతోనే సంబంధాన్ని గడిపే వారు కూడా వున్నారు. డేటింగ్ లు చేస్తూ సంబంధాలను బలపరచుకున్న వారెంత సంతోషంగా వుంటారో, సాధారణంగా వైవాహిక జీవనంలో సంబంధం ఏర్పరచుకున్న వారు కూడా అంతే సంతోషంగా వున్నారని కూడా సర్వే తెలిపింది. కనుక ఒక్క రాత్రి సెక్స్ తో ఏర్పడే సంబంధాలు అరుదుగా వైవాహిక జీవనం వరకు వస్తున్నాయని, వివాహం తర్వాత విఫలమైన జంటలు కూడా వున్నారని. విఫలత పొందిన జంటలలోని పురుషులు, స్త్రీలు మరో మారు సంబంధాలలోకి దిగినప్పటికి దీర్ఘకాల సంబంధాలు నిర్వహించటం జరగటంలేదని సర్వే చెపుతోంది.Read More
Feb 20 | మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో లైంగిక సమస్యలు డయాబెటిస్... మధుమేహవ్యాధి... ఈ పేరు తలుచుకుంటేనే తెలియని భయం, ఆందోళన. వయస్సుతో నిమిత్తం లేకుండా విలయతాండవం చేస్తున్న వ్యాధి ఇది. డయాబెటిస్ వచ్చింది అంటే చాలు... ప్రతి రోగి కూడా తమ జీవితం ఇక అరుుపోరుుందనే ఆలోచనలో పడిపోతారు. దేనికీ పనికిరామేమోననే ఆత్మన్యూనత భావం కలుగుతుంది. ఒక్కసారి బ్లడ్గషూగర్ కనిపించిందని తెలియగానే, మానసికంగా, శారీరకంగా క్రుంగిపోతున్న వారు కోకొల్లలు. దీనికి నమ్మకమైన పరిష్కారం ఉందని, దీనిపైన అవగాహన పెంచాలని అంటున్నారు మాస్టర్స్ ెమియోపతి డైరెక్టర్ డాక్టర్ మధు. మధుమేహవ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నది. భారతదేశంలో వేగం గా విస్తరిస్తూ, శరీరంలో అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తూ అతలా కుతలం చేస్తున్నది. మనదేశంలో దాదాపు 5 కోట్ల మంది ఈ వ్యాధిన బారిన పడి బాధపడుతున్నారు. 30 సంవత్సరాల లోపు వారు కూడా దీని బారిన పడు తున్నారు. 30 సంవత్సరాల లోపు వస్తే జీవితంలో ఏమీ అనుభవించని పరిస్థితి వస్తున్నది. ఎంత సంపద ఉన్నా, మానసిక, శారీరక ఆనందం లేకపోతే ఇక ఆ జీవనం వృథా అనిపిస్తోంది. 2006 డిసెంబర్ 20న ఐక్యరాజ్యసమితి ఈ వ్యాధిని వేగంగా విస్తరించే దీర్ఘ కాలిక వ్యాధిగా నిర్ణయించి, అవగాహన పెంచాలని ప్రకటించింది. వాస్తవాలను గమనిస్తే, ప్రతీ 10 సెకన్లకు ఇద్దరు మధుమేహవ్యాధిగ్రస్తుల జాబితాలో చేరుతున్నారు. రోజుకు కనీసం 200 మందికి ఈ వ్యాధి కారణంగా కాళ్ళను తొలగిస్తున్నారు. వ్యాధి రావడానికి కారణాలు: వారసత్వం, అతిగా జంక్ఫుడ్స్ తినడం, మితిమీరిన ఆహారపు అలవాట్లు, మాన సిక ఒత్తిడి, అదుపులో లేని రక్తపోటు, అధిక బరువు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉం డడం, పొగ తాగడం, మద్యపానం, స్టెరాయిడ్స్ వాడం, సరైన వ్యాయామం లేకపోవడం మధుమేహవ్యాధిగ్రస్తులకు హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తోంది. విచిత్రం ఏమిటంటే మధుమేహం ఉన్నవారిలో 60 శాతం మందికి అది తమకు ఉన్న ట్లుగా తెలియదు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు. విచిత్రమైన విష యం ఏమిటంటే చాల మంది డయాబెటిస్ రోగులకు లైంగిక సమస్యలు ఎదు రవుతున్నాయి. చాలాకాలం నుంచి మధుమేహంతో బాధపడుతున్న వారు అంతకుముందులా దాంపత్యజీవితంలో పాల్గొనలేకపోతున్నామని బాధపడుతు ననారు. దీని వలన చాలామందిలో కోరిక తగ్గిపోతున్నది. భయం వలన సెక్స్ సామర్థ్యం తగ్గిపోతున్నదని భావిస్తున్నారు. చాలా కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఫంగస్ ఇన్ఫెక్షన్ల వలన మర్మావయవాల దగ్గర దురద, అంగం చివర చర్మం చిట్లిపోవడం వంటి సమస్యలుంటాయి. దీని వలన భయం తో కోరికలు తగ్గుతాయి. దీని వలన అంగస్తంభన, శీఘ్రస్కలనం లాంటివి ఎదురవుతాయి. ఇవన్నీ మధుమేహానికి తోడయి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే డయాబిటిస్ రోగులలో 60 శాతం మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. భయం, ఆత్మన్యూనత, మానసిక దుర్భలత్వం లాంటివి మధుమేహంతో వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నరాల సంబంధ వ్యాధులతో సెక్స్ కోరికలు తగ్గడం, అంగస్తంభన, శీఘ్రస్కలనం లాం టి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం హార్మోన్ల లోపాలు, మానసిక ఒత్తిడి, న్యూరోపతి లాంటివి అని చెప్పవచ్చు. డయాబిటిస్ ఉన్న వాళ్ళలో ముందుగా కన్పించే సమస్య సెక్స్‌లో అసమర్థత. ఈ సమస్య చాలా మందిలో కనిపించే లోపు డయాబిటిస్ తీవ్రతరం అయిన దాఖలాలు ఉన్నాయి. రక్తంలో షుగర్ శాతం పెరగడంతో రక్తనాళాల్లో మార్పు లు కనిపిస్తాయి. రక్తనాళాలలోని నరాలు దెబ్బ తిన్నప్పుడు ఇతర అవయవా లలో దుష్ఫలితాలు కనిపిస్తాయి. దీనివలన అంగస్తంభన ముఖ్యమైన సమ స్యగా చెప్పవచ్చు. అంగస్తంభన ఉన్నవారికి, గుండెకు సంబంధించిన సమ స్యలు ఏవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలాంటివారిలో డయాబెటిస్ గుర్తిం చడం జరుగుతోంది. అంగస్తంభన వైఫల్యం ఉన్న వారిలో పొగ తాగే అలవాటు ఉంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. డిప్రెషన్ తగ్గించే మందులు వాడే వారిలో కూడా లైంగిక సమస్యలు కలుగుతాయి. షుగర్ వ్యాధి ఉన్నవారిలో సమస్యలు ఉన్నప్పుడు రక్తంలో టెస్టోస్టెరోన్ లెవల్స్ కూడా చూసుకోవాలి. టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవల్లో మార్పులు జరిగినప్పుడు షుగర్ రావడం, అంగస్తంభన సమస్యలు ఎదురు కావడం చోటు చేసుకుం టాయి. సాధారణంగా అంగస్తంభన వైఫల్యానికి చికిత్స చేసేటప్పుడు డయాబెటిస్ వలన వచ్చే దుష్ఫలితాలను కూడా సరిదిద్దుకోవాలి. లైంగిక సమస్యలకు మూల కార ణాన్ని, దాని తీవ్రతను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. మూత్రనాళానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ల వలన కూడా అంగస్తంభన సమస్య ఏర్పడవచ్చునని కొన్ని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ రోగుల్లో తరచుగా మూత్రనాళానికి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. డయాబెటిస్ ఉన్న వారిలో లైంగిక స్పందనలు తక్కువగా ఉండడం గమనించదగ్గ విషయం. పరిష్కార మార్గాలు: • డయాబెటిస్‌పై అవగాహన పెంచుకోవాలి.• ఒత్తిడి లేని జీవన విధానాన్ని అలవరుచుకోవాలి.• మానసిక ప్రశాంతత అలవర్చుకోవాలి. • ప్రతి రోజూ 40 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి.• మద్యపానం, స్మోకింగ్, గుట్కాలు మానివేయాలి.• బాదం, పిస్తా, దానిమ్మ, నేరెడుపళ్ళు లాంటివి తినాలి. హోమియో చికిత్స: హోమియోపతి వైద్యం శాస్ర్తీయతతో కూడుకున్న వైద్య విధానం. డయాబెటిస్ రోగుల్లో వచ్చే లైంగిక సమస్యలకు హోమియోపతి ఒక వరప్రసాదంగా చెప్ప వచ్చు. మానసిక, శారీరక లక్షణాలను ఆధారంగా చేసుకుంటే లైంగిక సమస్య లు తగ్గించడం పెద్ద సమస్య కాదు. మందులు: AGNUS CASTUS: కోరికలు అధికంగా ఉంటాయి. కానీ అంగస్తంభన జరుగదు. దీనితో పాటు వీర్యస్కలనం తరచుగా తెలియకుండానే జరుగు తుంది.Acid PHOS: నిరాశ, అలసటతో బాధపడేవారికి ఈ మందు ఉపయోగకారి. బాధితుల్లో అంగం గట్టిపడదు. గట్టిపడినా వెంటనే మెత్తబడిపోతుంది.PHOSPHOROUS: లైంగిక వాంఛ ఎక్కువ. కోరికలు ఎక్కువ. శారీరకంగా నీరస పడిపోతారు. భయం, ఆందోళన ఎక్కువ. Lycopodicm: యువకుల్లో వచ్చే డయా బెటిస్‌కు ఆలోచించదగిన మందు. హస్త ప్రయోగం అలవాటు వలన వచ్చే వ్యాధులకు ఈ మందు బాగా పని చేస్తుంది. సరైన వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడితే డయాబెటిస్తో వచ్చే లైంగిక సమస్య లను దూరం చేసుకోవచ్చు. మేము సాధించిన ఫలితాలే ఇందుకు నిద ర్శనం. సొంతవైద్యంతో రకరకాల ప్రయో గా లు చేసుకుంటే సమస్య ముదిరిపోయే అవ కాశం ఉంది.Read More
Feb 15 | చాలామంది మహిళలు రతిక్రీడకు ముందు పురుషులు చేసే కొన్ని పనులకు అయిష్టం చూపుతారు అవేమిటంటే.....శ్రద్ధగా చదవండి ....మరోమారు భాగస్వామితో కలిసినపుడు ఆచరించండి.విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా? మీ భాగస్వామికి ఏ మ్యూజిక్ ఇష్టమో తప్పక తెలుసుకోండి. మహిళలు పాడే మ్యూజిక్ లేదా సెక్స్ ప్రేరిత పాటలు పెట్టకండి. ఏ మాత్రం అయిష్టం కలిగినా మూడ్ ఆఫ్ అయినట్లే. సెల్ ఫోన్ ఆటంకం: ఆ సమయంలో సెల్ ఫోన్ వీరికి మరో శత్రువే! సరిగ్గా క్రీడ మధ్యలో సెల్ ఫోన్ అటెండ్ అయ్యారా? క్రీడలో టెంపో తగ్గినట్లే. ఇక ఆ ఫోన్ మీ తల్లినుంచి అయితే, మీ సెక్స్ భాగస్వామి తన జాకెట్ వేసుకొని వెళ్ళటానికి రెడీ అయినట్లే సుమా! కనుక సెల్ ఫోన్ తప్పకుండా స్విచ్ ఆఫ్ చేయడం మరువకండి. శరీరంపై చేయి వేసేటపుడు అతి జాగ్రత్త పాటించండి. స్తనాలు బిగువుగా పట్టటం లేదా జననాంగం ముట్టడం లేదా ఆమె దుస్తులు తీసేయడం వంటివి చేస్తే మూడ్ ఆఫ్ అయినట్లే. శరీరంలో అక్కడో భాగం, అక్కడో భాగం ముట్టుకుంటుంటే అసలేం జరుగుతోందో ఆమెకు తెలియక సరి అయిన మూడ్ లోకి రానట్లే. ప్రారంభంలో సున్నిత స్పర్శ, ఆపై శరీరంలోని భాగాలను ఒకదాని తర్వాత ఒకటిగా స్పర్శిస్తూ పోవాలి. ఉద్రేకాన్ని క్రమేణా పెంచాలి.రతికై ఆమెను యాచించవద్దు. మహిళలు ఖచ్చితంగా వ్యవహరిస్తారు. ఆమె రుతుక్రమ సమయాలకు ముందర ఎంతవరకు రతిక్రీడకు ఇష్టపడతారనేది గమనించాలి. మీరు ఎంత సిద్ధంగా వున్నప్పటికి ఆమెకు ఒక సుతిమెత్తని కిస్ ఇవ్వండి. ఇక ఆమె మీతో రతిక్రీడకు రెండోసారి కూడా ఆలోచిస్తుంది. అప్పటికి ఆమె ఒప్పుకోక, వద్దని చెప్పేస్తే, మరింత ముందుకు వెళ్ళి ఆమెను బలవంతం చేయడం లేదా యాచించడం చేయకండి. అలా చేస్తే, మరో సారి మీకు ఎప్పటికి ఛాన్స్ రానట్లే. ఆతృత పడకండి....మహిళలు రతిక్రీడ భావనలోకి రావాలంటే సమయం తీసుకుంటారు. చాలామంది మహిళలు అసలైన క్రీడకు ముందు ముద్దులకు, స్పర్శకు, శరీర సున్నిత మర్దనలకు ఆశిస్తారు. కనుక కొంత సమయం ఆమెపై పెట్టండి. ఈ అంశాలు ఆమెతో ఆచరించకపోతే, ఆమె విసుగెత్తి లేదా బోర్ కొట్టి ఇక మీకు గుడ్ నైట్ చెప్పేస్తుంది. ఆమెను మూడ్ లోకి దింపినపుడు ఎట్టి పరిస్ధితులలోను చేతి వాచి లో టైమ్ చూడకండి. మహిళలు రతిక్రీడలో సమయం తీసుకుంటారు. ప్రత్యేకించి భావప్రాప్తికి రెండు నిమిషాల ముందు ఆమె తనను కిస్ చేయాలని, స్పర్శించాలని, శరీరం నిమరాలని కోరుతూంటుంది. కనుక ఆమె ఆ దశకు చేరకముందే మీరు హడావుడి పడితే, ఆమె అసంతృప్తికిలోనై గుడ్ నైట్ చెప్పేసే ప్రమాదముంది. కనుక మీరు హడావుడి పడకుండా ఆమె మూడ్ పైనే దృష్టి పెట్టి కొనసాగండి. జననాంగం ఎంత వేడెక్కిందనేది కాదు సమస్య. మీరు ఎంత గాఢంగా ముద్దు పెట్టారనేది మీరు కోరే స్త్రీ గమనిస్తుంది. అనవసరంగా ఆమె నోటిలోని పళ్లు, నాలిక, లేదా బుగ్గలు, నుదురు, గొంతు మొదలైనవి టచ్ చేస్తూ పోకండి. వీటితో మూడ్ మారినట్లే. మీ నోరు దుర్వాసన రాకుండా మాత్రం జాగ్రత్త పడండి. చెత్త మాటలు డల్ గా మాట్లాడుతూ కూర్చోవద్దు. వారికి కావలసింది పొగడటం...ఎంత బాగున్నావని...ఆహ్ అధ్భుతమని కొనసాగించాలి. అలాగని పొగడుతున్నట్లు బయట పడిపోవద్దు. సహజంగా వారి మూడ్ కనిపెట్టి పొగడండి! నిజంగా ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడితే......నేను ముద్దు పెడితే ఎలా వుంది? అక్కడ ముట్టుకుంటే ఎలా వుంది? అంటూ టైమ్ వేస్ట్ చేయకండి. ఆమెనుండి వచ్చే ప్రతి స్పందనలు మీరు ఆమెను ఎంత బాగా స్పందించేలా చేస్తున్నారో తెలుపుతాయి. ఆమె మూడ్ లో లేదా? తమకు దూరంగా ఉండలేని పురుషులను మహిళలు ఇష్టపడరు! ఇక మీరు ఏమి చేసినప్పటికి ఆమె రతిక్రీడకు ముందుకు రాదు. చాలామంది యువతులు, ముద్దు పెట్టనా, మరల డేటింగ్ కి వస్తావా? చేసింది ఎలా వుంది? వంటి మెత్తగా అనుమతులు కోరుతున్న పురుషులంటే ఇష్టం చూపరనేది, మిమ్మల్ని ఒక బలహీనుడిగా భావిస్తారనేది కూడా గుర్తుంచుకోవాలి. పరిస్ధితిని సన్నిహితంగా పరిశీలించండి. సందర్భాన్నిబట్టి ఒక ‘హీ మాన్’ గా దూసుకుపొండి.Read More
Feb 09 | మధుమేహం – అంగ స్తంభనమధుమేహం, అంగస్తంభన చదివి గంటసేపు సమయాన్ని ఆనందంగా గడపండి. అంగస్తంభన వచ్చి నిలబెట్టుకోవడంలో అసమర్థతనే ఎరెక్టెల్ డిస్ ఫంక్షన్ అంటారు. మధుమేహం ఉన్న వారిలో నపుంసకత్వం సర్వసాధారణం. గుండె జబ్బులను, డిప్రెషన్ ని సూచిస్తుంది. కామపరమైన అసమర్థత జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. భాగస్వామితో సంబంధాలను ప్రభావితం చేస్తుంది. జబ్బు, మందులు, మద్యం ఇ.డి.కి. దారితీయవచ్చు. రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని సరిగా అదుపుచేయనందువల్ల మధుమేహం వస్తుంది. దాంతో పురుషుల్లో ఇ.డి. సమస్య తలెత్తుతుంది. రక్తనాళాలు కూరుకుపోవడం కూడా నపుంసకత్వానికి దారి తీస్తుంది. రక్తనాళాలు గట్టిపడిపోయినప్పుడు రక్తం, ప్రాణవాయువు, శరీరంలోని కొన్ని భాగాలకు ప్రసరించలేవు. పురుషాంగానికి వెళ్ళే రక్త నాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోయినట్లయితే అది పెద్దగా,. గట్టిగా అవడానికి మెత్తటి కండరాల కణాలు విశ్రాంతి పొందలేవు. ఇ.డి.కి మధుమేహం ఒక కారణం మాత్రమే. వయసు, గుండెకు సంబంధించిన జబ్బులు ఇతర కారణాలు, ఉత్తేజపరిచే సంకేతం మెదడుకు చేరదు. పురుష హార్మోన్లు తక్కువ స్థాయిలో ఉండటం, మందులు వాడటం, రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ పరిమాణంలో ఉండటం కూడా అంగస్థంభన సమస్యకు దారితీస్తాయి. మధుమేహం ఉండే పురుషులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుకున్నట్లయితే ఇ.డి. సమస్యను అరికట్టవచ్చు. సిగరెట్లు తాగడం మానెయ్యండి. బరువు తగ్గించుకోండి. రోజూ వ్యాయామం చేయండి. మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని (బ్లడ్ షుగర్ లెవల్) ను అదుపులో పెట్టుకోండి. రోజూ వ్యాయామం చేస్తూ బరువుతగ్గిన తరువాత అంగస్తంభన మెరుగైనట్లు ఇటీవల వెలువడ్డ పరిశోధనలు తెలుపుతున్నాయి. మధుమేహం ఉన్న వారు వాడే మందులు ఇ.డి.కి దారితీయవచ్చు. సాధారణంగా మధుమేహం ఉన్న పురుషులకు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా మందులు వాడుతారు. డాక్టరు చెప్పే మందుల పట్టికను జాగ్రత్తగా పరిశీలించి మందుల వాడకంలో మార్పులు చేస్తే అంగస్థంభన సమస్యను నివారించడానికి దోహదపడుతుంది. Read More
Feb 01 | ఎండోమెట్రియాసిస్గర్భాశయంలోపల ఉండే పొర ఎండోమెట్రియమ్. ఇది గర్భాశయంలోపలే పెరగాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల అది ట్యూబ్స్‌పై, గర్భాశయం మీద, పొత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై పెరిగితే..? చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులో ఏర్పడితే...? గర్భం ధరించకపోతే గర్భాశయంలోని ఆ పొర మందం కావడం ఆగిపోయి... రక్తస్రావం ద్వారా వెళ్లిపోవాలి. ఒకవేళ అలాంటి రక్తస్రావమే పై కీలక భాగాలలో అయితే...? అదే ఎండోమెట్రియాసిస్. కొందరు మహిళల్లో కనిపించే ఈ కండిషన్‌పై అవగాహన కోసం ఈ కథనం. గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియమ్ అంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల రుతుక్రమంలో ఈ ఎండోమెట్రియం పొర అనేక మార్పులకు లోనవుతుంది. ఒకసారి రుతుస్రావం అయిన తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడం వల్ల అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి 14 రోజులు వృద్ధి చెందుతుంది. అది 7 నుంచి పది మిల్లీమీటర్ల మందం ఉంటుంది. 15వ రోజు నుంచి విడుదల అయ్యే ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల పొర మరింత వృద్ధి చెందుతుంది. దానికి సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. రుతుస్రావం ఎందుకు కనిపిస్తుందంటే... ఎండోమెట్రియమ్‌లో రక్తనాళాలు అభివృద్ధి చెందాక... అండం శుక్రకణంతో కలవడం జరగకపోతే 14 రోజుల తర్వాత ప్రొజెస్టరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే రుతుస్రావం. కొంతమందిలో ఎండోమెట్రియమ్ కణాలు గర్భాశయం లోపల కాకుండా, కొన్ని కారణాల వల్ల కడుపులోకి వివిధ అవయవాలపైన అంటే... అండాశయాలపై, ట్యూబ్స్‌పై, గర్భాశయం పై పొరపై, పొత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై, ఇంకా చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులో ఏర్పడుతుంది. హార్మోన్ల ప్రభావం వల్ల అది రుతుచక్రంలో ఎలాంటి మార్పులు చెందుతుందో... అలాంటి మార్పులే అవి పెరిగిన చోట కూడా వృద్ధి చెందుతాయి. మెన్సెస్ సమయంలో ఆ అవయవాల్లో కూడా అలాగే కొద్దిపాటి బ్లీడింగ్ అవుతుంది. వీటిని ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ అంటారు. ఈ కండిషన్‌ను ఎండోమెట్రియాసిస్ అంటారు. ఇది 5-10 శాతం మహిళల్లో ఉంటుంది. వివిధ అవయవాలపై ఉన్న ఎండోమెట్రియమ్ ఇంప్లాంట్స్‌లో రక్తస్రావం జరిగి అది బయటకు వెళ్లడానికి మార్గం లేక కొందరిలో రక్తం అక్కడ కరిగిపోతుంది. అయితే కొందరిలో రక్తం గూడు కట్టడం జరగవచ్చు. కొందరిలో ఒక అవయవానికి, మరో అవయవానికి మధ్య కండ వంటిది పెరగడం జరగవచ్చు. వాటిని అడ్హెషన్స్ లేదా ఫైబ్రోసిస్ బ్యాండ్స్ అంటారు. అలా పెరిగిన కణజాలం నుంచి విడుదల అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్స్‌తో పాటు ఇతర రసాయన పదార్థాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అంటే... అండాశయాల పైన ఎండోమెట్రియాసిస్ ఏర్పడటం వల్ల అక్కడ నెలనెలా రక్తం గూడు కట్టి అది మెల్లగా చాకొలెట్ సిస్ట్గా రూపాంతరం చెందుతుంది. వ్యాధి విస్తరించిన తీరును బట్టి ఎండోమెట్రియాసిస్ను ఒకటి నుంచి నాలుగు దశలుగా చెప్పవచ్చు. లక్షణాలు... కొందరిలో వ్యాధి తీవ్రంగా ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఎండోమెట్రియాసిస్లో కనిపించే సాధారణ లక్షణం పొత్తికడుపులో నొప్పి లేదా ఎండోమెట్రియాసిస్ అభివృద్ధి చెందే ప్రదేశాన్ని బట్టి కూడా వ్యాధి లక్షణాలు ఉంటాయి. నొప్పి : కొందరిలో మొదటి దశలో ఉన్నా తీవ్రంగా నొప్పి రావచ్చు. మరికొందరిలో అది నాలుగో దశలో ఉన్నా నొప్పి లేకపోవచ్చు. కొందరిలో పొత్తికడుపులో నొప్పి లేకుండా వేరే భాగాల్లో అంటే... నడుములో, తొడలో కూడా రావచ్చు. - డిస్మెనోరియా: మెన్సెస్ సమయంలో పొత్తికడుపులో నొప్పి తీవ్రంగా ఉంటూ నెలనెలా నొప్పి తీవ్రత పెరుగుతూ ఉండవచ్చు. కొందరిలో మెన్సెస్ అయ్యే వారం ముందునుంచీ నొప్పి ఉండవచ్చు. - క్రానిక్ పెల్విక్ పెయిన్: మెన్సెస్తో సంబంధం లేకుండా పొత్తికడుపులో నొప్పితో పాటు, అప్పుడప్పుడు నడుము నొప్పి రావచ్చు. - డిస్పెరూనియా: కలయిక సమయంలో పొత్తికడుపులో, నడుములో నొప్పి రావచ్చు. - కొందరిలో మూత్ర విసర్జన, మల విసర్జన సమయంలో నొప్పి వచ్చి మెన్సెస్ సమయంలో అది పెరగవచ్చు. - చాలా అరుదుగా కొందరిలో సిజేరియన్ సమయంలో ఎండోమెట్రియల్ టిష్యూ... పొట్ట మీద కుట్ల దగ్గర ఉండిపోయి... మెన్సెస్ సమయంలో కుట్ల వద్ద రక్తస్రావమై పైన వాపు, నొప్పి వచ్చి, తగ్గుతుండవచ్చు. ఎండోమెట్రియాసిస్‌తో సమస్యలు...- సంతానలేమి: ఎండోమెట్రియాసిస్ ఉన్నవారిలో పొత్తికడుపులో అవయవాల మధ్య అతుకులు ఏర్పడటం వల్ల అండాశయం నుంచి అండం - ట్యూబ్స్‌లోకి వెళ్లదు. దాంతో కొందరిలో గర్భం రాకపోవచ్చు. - కొంతమందిలో ఈ కణజాలం నుంచి విడుదల అయ్యే రసాయనాల ప్రభావం వల్ల అండం నాణ్యత తగ్గుతుంది. దాని వల్ల కూడా గర్భధారణ జరగకపోవచ్చు. - అండాశయంలో వచ్చే చాక్లెట్ సిస్ట్ నెలనెలా పెరగడం వల్ల కొందరిలో అండాశయం మీద ఒత్తిడి ఏర్పడుతుంది. అది అండాశయాన్ని నొక్కివేయడం వల్ల అండం విడుదల కాకపోవచ్చు. గడ్డలు: చాక్లెట్ సిస్ట్స్ కొందరిలో మెలికపడటమో లేదా పగిలిపోవడమో జరగవచ్చు. అవి పెరిగే కొద్దీ మిగతా అవయవాలపై ఒత్తిడితో నొప్పి రావచ్చు. అవి పగలడం వల్ల గూడు కట్టిన రక్తం పొత్తికడుపులోకి చేరి అవయవాల మధ్యన అతుకులు ఇంకా పెరగవచ్చు. పేగులు అతుక్కుపోవచ్చు. మూత్రం పైపులు, పేగుల్లో అడ్డంకులు రావచ్చు. నిర్ధారణ... చాలా మందిలో లక్షణాలను బట్టి ఎండోమెట్రియాసిస్ ఉండవచ్చునని డాక్టర్లు అనుమానిస్తారు. - కొందరిలో స్పెకులమ్ అనే పరీక్ష చేసినప్పుడు యోనిలోపల ఎండోమెట్రిక్ ఇంప్లాంట్స్ కనిపించవచ్చు. పరీక్ష చేసే సమయంలో నొప్పి ఉండవచ్చు. చేతికి గట్టిగా చిన్న గడ్డలు తగలవచ్చు. కొంతమందిలో ఏమీ తగలకపోవచ్చు. కొందరిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నా పరీక్షలో కనిపించకపోవచ్చు.- అల్ట్రాసౌండ్ స్కానింగ్ : కొందరిలో వ్యాధి ఒకటి, రెండు దశలలో ఉన్నప్పుడు స్కానింగ్‌లో ఏమీ తెలియకపోవచ్చు. అండాశయంలో చాక్లెట్ సిస్ట్ ఉంటే స్కానింగ్‌లో గడ్డల్లా కనిపిస్తాయి. అయితే స్కానింగ్‌తో ఖచ్చితంగా వాటి నిర్ధారణ జరగదు. - ఎమ్మారై : ఇందులో కూడా ఖచ్చితంగా ఎండోమెట్రియాసిస్ నిర్ధారణ జరగకపోవచ్చు. అయితే ఎండోమెట్రియాసిస్ ఆస్కారాన్ని పసిగట్టవచ్చు. - రక్తపరీక్షలు : ఎండోమెట్రియాసిస్ ఉన్నప్పుడు సీఏ 125 అనే రసాయనం రక్తంలో పెరుగుతుంది. అయితే మరికొన్ని వ్యాధుల్లోనూ ఇది జరుగుతుంది. - కొందరిలో ఆపరేషన్ సమయంలో నేరుగా చూసినప్పుడు ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్, అడ్హెషన్స్, చాక్లెట్ సిస్ట్స్ కనిపిస్తాయి. దీన్ని బట్టి అది ఏ దశలో ఉందో తెలుస్తుంది. తర్వాత ఆ ముక్కను సేకరించి, దాన్ని బయాప్సీకి పంపినప్పుడూ నిర్ధారణ అవుతుంది. దీన్ని ల్యాపరోస్కోపీ ద్వారా లేదా గాటు పెట్టడం ద్వారా చేయవచ్చు. చికిత్స... లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. కొంతమందిలో నొప్పి నివారణ మందులతో చికిత్స చేస్తారు కొంతమందికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ పిల్స్ కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు ఇవ్వడం కొంతమందిలో కేవలం ప్రొజెస్టరాన్ పిల్స్ లేదా ఇంజెక్షన్స్ లేదా వేరే హార్మోన్స్ ద్వారా చికిత్స చేయవచ్చు మందులు ఇచ్చినా కొందరిలో ఎండోమెట్రియాసిస్ తిరగబెట్టవచ్చు. చాక్లెట్ సిస్ట్స్ పెద్దగా ఉన్నప్పుడు ఆపరేషన్ తప్పనిసరి. ఆపరేషన్: ఇందులో ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్‌ను కాల్చేయడం లేదా మరీ పెద్దగా ఉంటే తొలగించడం జరుగుతుంది. చిన్న గాటు (ల్యాపరోస్కోపీ) ద్వారా లేదా సంప్రదాయ శస్త్రచికిత్స రూపంలో పొట్టకు గాటు వేసి దీన్ని చేస్తారు. ఆపరేషన్ తర్వాత కూడా మళ్లీ గర్భధారణకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాక్లెట్ సిస్ట్స్ తర్వాత మళ్లీ అవి పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారిలో అవసరాన్ని బట్టి గర్భాశయాన్ని, అండాశయాలను తొలగించాల్సి రావచ్చు. తిరగబెట్టినప్పుడు రెండు మూడుసార్లు ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. కారణాలుఎండోమెట్రియాసిస్కు కారణాలు నిర్దిష్టంగా ఇంకా వెల్లడి కాలేదు. అయితే దీనికి కారణాలను తెలిపేందుకు చాలా సిద్ధాంతాలు (థియరీస్) ఉన్నాయి. జన్యుపరమైన కారణాలు, పర్యావరణంలో మార్పులు, హార్మోన్ల మార్పుల వంటి ఎన్నో కారణాల వల్ల ఇది రావచ్చునని ఈ సిద్ధాంతాలు చెబుతున్నాయి. ఆ సిద్ధాంతాల వివరాలివి... సాధారణంగా మెన్సెస్ సమయంలో ఎండో మెట్రియమ్ అన్న పొర సర్విక్స్ నుంచి యోని బయటకు వచ్చేస్తుంది. అయితే కొందరిలో అది గర్భాశయం నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా పొత్తికడుపులోకి చేరుతుంది. రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉన్నవారిలో అది అక్కడ కరిగిపోతుంది. అయితే రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న కొందరిలో అది కడుపులోని వివిధ అవయవాలపై అంటుకుని ప్రతి నెలా వృద్ధి చెందుతుంది. ఇది శ్యామ్ప్సన్ సిద్ధాంతం కొంతమందిలో పొత్తికడుపులోని పెరిటోనియమ్ పొరలోని కణాలు ఎండోమెట్రియ్ కణాలుగా మార్పు చెంది ఎండోమెట్రియమ్ వ్యాధికి దారితీస్తాయి. కొందరిలో ఎండోమెట్రియమ్ కణాలు రక్తం లేదా లింఫాటిక్ వ్యవస్థ వల్ల అరుదుగా ఊపిరితిత్తుల్లోకి, మెదడులోకి చేరవచ్చు. ఎవరిలో ఎక్కువ... గర్భాశయంలో బ్లీడింగ్ బయటకు రావడానికి అడ్డుపడే తరహా లోపాలు (యుటిరైన్ సెప్టమ్స్) ఉన్నవారిలో పిల్లలు లేనివారిలో పీరియడ్స్ తొందరగా... అంటే 20 రోజులకే వచ్చే వారిలో. Read More