Sep 05 | సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్ పై మొదట్లో ఉన్న ఆసక్తి పిల్లలు పుట్టిన తరువాత ఉండదని అంటారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పిల్లలు పుట్టాక సెక్స్ పై ఆసక్తి చూపకపోవడానికి నిపుణులు కొన్ని కారణాలు సూచిస్తున్నారు. ప్రధానంగా సిజేరియన్ వల్ల కలిగే భయం, కుట్లు వద్ద కలిగే నొప్పి, రక్తస్రావంతో రోగిలా పడి ఉండవలసి రావడం, కొత్తగా పుట్టిన పాప బాధ్యత, బేబీకి పాలు తాగించాల్సి రావడం, రాత్రిళ్లు పాపకు సంరక్షణ, ఆ నిర్వహణలో సరిగా నిద్ర పట్టక పోవడం, లేదా నిద్ర పోవడానికి సమయం లేకపోవడం, ప్రసవానంతరం హార్మోన్ల అసమతుల్యత వల్ల పోస్ట్ నాటల్ డిప్రెషన్ ఏర్పడటం, ఉద్రేకాలకు, ఆందోళనలకు లోను కావడం, చిరాకు, కోపం పెరగడం ఇవన్నీ కలిసి సెక్స్ పట్ల విముఖత కలిగించవచ్చని చెపుతున్నారు. దీనికితోడు.. మనసూ శరీరం రెండూ అలసి పోవడం అనే కారణం కూడా ఈ సెక్స్‌పట్ల విముఖతకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. సో... మీరు మీ భాగస్వామి బాధలను అర్థం చేసుకొని లైంగిక జీవితాన్ని అనందించండి.Read More
Aug 18 | రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే... జీ స్పాట్ కి చక్కని ప్రేరణ కలిగించాలి. మరి జీ స్పాట్ ఎక్కడ ఉంటుందో చాలా మంది యువతీ యువకులకు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీని కోసం అనేక మంది స్పెషలిస్టులకు ప్రశ్నలు సంధిస్తారు. నిజానికి.. జీ స్పాట్ అంటే.. స్త్రీ బీజవాహికపై కప్పులో సుమారు అంగుళం లోతున ఉండే ఒక సునిశతమైన ప్రదేశం.! ఈ భాగంలో స్పర్శ సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజవాహికలోకి వేలుజొనిపి అంతటా కలియత్రిప్పుతూ జి-స్పాట్ వద్ద స్పర్శించే సరికి సుఖానుభూతులతో స్త్రీ మెలికలు తిరగటమే కాకుండా మూత్ర ద్వారంలోంచి ఓ రకమైన ద్రవం వెలువడుతుందనీ 1950 ట్రాఫెన్‌బర్గ్ అనే సెక్సాలజిస్టు చెప్పాడు. అందుకే ఆయన పేరు జ్ఞాపకార్థంగా దీనికి జీ స్పాట్ అని పేరు వాడుకలోకి వచ్చింది. జి-స్పాట్‌కి ప్రేరణ చక్కగా లభించిన స్త్రీలు భావప్రాప్తి సమయంలో మూత్రనాళం నుంచి ద్రవాలను విడుదల చేస్తారనీ.. అనగా స్కలిస్తారనీ గ్రాఫెన్‌బర్గ్ పేర్కొన్నాడు. వాత్స్యాయన మహర్షి 2000 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు కూడా స్కలిస్తారని పేర్కొన్న సంగతి మర్చిపోకండి. స్త్రీ స్ఖలనం గురించి రీసెర్చి జరుగుతూనే ఉంది. దీనిపై సందేహం ఉన్నవారు జి స్పాట్ కోసం బీజవాహికలో తడిమి చూసుకోవచ్చు. ఆ నిశిత ప్రదేశం ఉన్న స్త్రీలు ఆ భాగానికి ప్రేరణ పొందడం ద్వారా కూడా ఆనందాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలో కామోద్దీపనం కలిగించే నిశిత శరీర భాగాలు ఎన్నో ఉన్నాయని వాటిలో ఇదొకటని వారు పేర్కొంటున్నారు.Read More
Aug 10 | భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ అత్యంత ఆనందదాయకపమైన ప్రక్రియ. మీ జీవితభాగస్వామితో కలిసి పంచుకునే అనందానికి ఎన్నో మార్గాలున్నాయి. రతిక్రీడలో వివిభ భంగిమలను ప్రయత్నించవచ్చు. నిత్యం రతిలో ఉపయోగించే భంగిమలు ఎన్ని ఉన్నా కొత్త భంగిమలు ప్రయత్నిస్తేనే రతిలో ఆనందం. ఆరోగ్యం. కొంత మంది స్ర్తీలు, ఎక్కువ మంది పురుషులు ఇష్టపడే భంగిమ ‘‘శునక సంయోగ భంగిమ’’. ఈ భంగిమను ప్రయత్నించండి, రతిలో ఆనందాన్ని పొందండి. ఈ భంగిమలో స్త్రీ తన వీపును పురుషుడికి ఎదురుగా పెట్టి మోకాళ్లపై వంగుతుంది. అలా ఉన్నప్పుడు మహిళ శునకం కూర్చున్న ఆకారం వస్తుంది. అందుకే ఈ భంగిమకు ఆ పేరు వచ్చింది. ఈ భంగిమ వల్ల కలిగే ప్రయోజనం ఈ భంగిమ అత్యంత సులభమైందే కాకుండా ఎక్కువ సంతృప్తినిచ్చేది కూడా. సర్వసాధారణమైన భంగిమల్లో కన్నా ఈ భంగిమ ద్వారా సంయోగం ఎక్కువగా మోతాదులో జరుగుతుంది. విభిన్నమైన సంతోషం కోసం ఈ భిన్నమైన భంగిమను మీరు వాడవచ్చు. మహిళ వెనక భాగం నుంచి సంయోగం కావడం వల్ల ఎక్కువగా పురుషాంగం లోనికి చొచ్చుకుని పోవడం వల్ల మహిళలు నొప్పితో కూడిన రసోల్లాసాన్ని పొందుతారు.పైగా, తొందరగా సంతృప్తి పొందే అవకాశం ఉంటుంది. పురుషుడు మరింత కొంత చొరవ ప్రదర్శించి మహిళ జీ స్పాట్‌ను తాకితే దంపతుల శృంగారం పతాక స్థాయికి చేరుకుంటుంది. సంయోగ ప్రక్రియలో జోరును పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పురుషులు ఎక్కువగా ఈ భంగిమను ఇష్టపడతారు. వేగంగా ముందుకు సాగవచ్చు లేదా మెల్లగా కదలవచ్చు.జీవిత భాగస్వామి పిరుదుల కదలికను చూస్తూ ఈ భంగిమలో పురుషుడు ఎక్కువ ఆనందం పొందుతాడు. పురుషులకు స్త్రీల పిరుదులపై వింతైన ఫాంటసీలుంటాయి. పిరుదులను ఒత్తడం, తాకడం, వాటిపై చరచడం ద్వారా పురుషుడు రతి సంతృప్తిలో ముందుకు సాగుతాడు. మరో చర్యను కూడా కొంత మంది పురుషులు ఎక్కువగా ఇష్టపడుతారు. స్త్రీ తల వెంట్రుకలను గుర్రం కళ్లెం పట్టుకుని స్వారీ చేస్తున్నట్లు ఈ చర్య ఉంటుంది. దీని ద్వారా మహిళ కదలికను పురుషుడు నియంత్రిస్తాడు.. ఈ భంగిమలో రతి క్రీడను ఏ స్థలంలోనైనా సాగించవచ్చు. పడకగదిలో, స్నానాల గదిలో, స్విమ్మింగ్ పూల్‌లో, కుర్చీపై లేదా బాల్కనీలో ఈ భంగిమలో రతి క్రీడ జరపవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రయత్నించండి.Read More
Aug 01 | రతిక్రియ చేసేందుకు కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పగటి పూట రతిక్రియ చేయకూడదు. రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి. అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలంటున్నారు వైద్య నిపుణులు. * సూర్యోదయానికి ముందు నుంచి సూర్యోదయం తర్వాత చేసే రతిక్రియ వలన ఆరోగ్యం పాడవుతుంది. * కొందరు రాత్రి ఏడుగంటలకే భోజనాన్ని ముగుస్తారు. ఇలాంటి వారు రాత్రి పదిగంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అదే రాత్రి 10-11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్ధరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి. * నిద్రకుపక్రమించే ముందు పాలు సేవించకండి. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు పాలు సేవించండి. ఆరోగ్యానికి చాలా మంచిది. * స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించకండి. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. ఇలా చేస్తే రకరకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్లేనని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. * కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. రతిక్రియ జరిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోను తొందరపాటు ఉండకూడదు. తొందరపాటుంటే త్వరగా వీర్యస్ఖలనం జరిగిపోయి మీ జీవిత భాగస్వామికి అసంతృప్తి కలుగుతుంది. దీంతో వారు మీపై ఆ కార్యానికి విముఖత ప్రదర్శించే అవకాశాలు ఎక్కువే. * రతిక్రియకు ముందు రొమాంటిక్ మాటలు మాట్లాడండి. అప్పుడే వారితో మీరు ఆ క్రియలో స్వర్గసుఖాలను అనుభవిస్తారు. దీంతోపాటు మీ జీవితభాగస్వామిని కూడా మీరు తృప్తి పరచినవారవుతారు. .Read More
Jul 20 | ము... ము... ము... ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా అంటే... ‘నిను ముద్దాడాలంటే, అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా...!’ అని అన్నాడో సినీ కవి. నిజమే మరి. ముద్దు పెట్టాలన్నా కూడా మనసు ప్రతిస్పందించాలి. ఈ ముద్దుల్లో కూడా చాలా రకాలున్నాయంటున్నారు పరిశోధకులు. ముద్దంటే ఇష్టం ఉండనివారెవరుంటారు నేటి ఈ సమాజంలో. ప్రతి ప్రాణికి ముద్దంటే మహా ప్రీతి. అందునా మానవజాతికైతే మరీనూ... చిన్న పిల్లలనుంచి ముదుసలి వరకు ముద్దంటే భలే ఇష్టం. మరి ఆ ముద్దుల్లో మహత్తేందో తెలుసుకుందాంమా! ముద్దుకు అనుకూల ప్రదేశాలు... విశాలమైన నుదుటిభాగంలో ఇచ్చే ముద్దు మనసుకు ప్రశాంత తనిస్తుంది. ఆమె కళ్లపై ఇస్తే.. ఆమెలో ధైర్యాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నామన్నమాట. మెడమీద ఇచ్చే ముద్దు ఆమెలో తాపాన్ని కలిగించడం... వక్షస్థలం మీద ఇచ్చే ముద్దుతో ఆమె హృదయంలో శాశ్వితస్థానం పొందగలగడం... నాభిమీద ఇచ్చే ముద్దుతో ఆమె మనసును కేంద్రీ కరింపజేయడం... తొడలమీద ఇచ్చే ముద్దుతో రసస్వాదన కల్పించడం, కాలిబొటనవేలిమీద ఇచ్చే ముద్దుతో ఆమె ప్రేమకు దాసోహం అని సింబాలిక్‌గా చెప్పడం అన్నమాట. ఇలా స్ర్తీకి ముద్దిచ్చే ప్రదేశాలలో ఆచితూచి అడుగేసే పురుషుడు తప్పక రతిసౌఖ్యం పొందుతాడని వాత్సాయనుడు ఎప్పుడో చెప్పాడు. కవ్వించే ముద్దులు... రెండుచేతులతో ప్రియుడు ప్రియురాలి ము ఖాన్ని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో పు రుషుడు ఆబగా తన పెదవులను ఆమె పెదవులకు తాకించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె సు న్నితంగా అరచేతిని అడ్డు పెట్టడమో లేక తన మునిపంటితో పెదవులను లోపలికి బిగించి తన ముద్దును అతనికి అందించీ అందించ కుండా కవ్విస్తూ...అతడు అలసిపోగానే చటుక్కున తన పెదాలను అతని పెదాలకు ఆనించి అంతే వేగంగా తలతిప్పేసుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇటువంటి వ్వించే ముద్దులు ఆ లుమగల మధ్య అనురాగాన్ని పెంచుతాయి. కొసరు ముద్దులు... నవవధువు సిగ్గుతో పురుషుడు చూస్తాడని ప్రేమగా దగ్గరకి తీసుకున్న అతని బాహువులలో చిక్కుకుని... ప్రేమగా అతని కళ్లను తన చేతులతో మూసి దాగుడుమూతలు ఆడుకునేలా చటుక్కున ముద్దిచ్చేసి ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తుంటుంది. ఇవి అడగక ఇచ్చే కొసరుముద్దులు. చాలామందికి ఇటువంటి కొసరు ముద్దులంటే ఇష్టం.దంతాలు తగలకుండా...దంతాలు తగలకుండా కేవలం పెదవులతోనే చుంబించి అత్యంత కూల్‌గా ఇచ్చే ఇటువంటి ముద్దులను స్వీట్ కిసెస్ అంటారు. తేనె నాకినంత మధురంగా ఉంటుంది. మెడ ముద్దులు... వెనకనుంచి ప్రియుడు ప్రియురాలిని తన బాహువులలో బంధించి మెడమీదనుంచి ఆమె పెదవులను అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ఆమె అతడికి పూర్తిగా సహకారం అందిస్తూ ధనుస్సులా వెనక్కివంగి తన పెదాలను సుతారంగా ప్రియునికి అందిస్తుంది. ఇటువంటి ముద్దులు ప్రియుని ఆవేశాన్ని రెచ్చగొడతాయి. నాలుకలతో పెనవేసి... ఈ ఆటలో కేవలం ఇద్దరూ తమ నాలుకలతోనే శత్రురాజులు కత్తులతో యుద్ధం చేసినట్లుగా కొట్టుకోవాలి. ఈ ప్రక్రియలో పెదాలుగానీ, దంతాలుగానీ తగలకూడదు. కాసేపు ఇలా యుద్ధం చేసి అలసిపోయాక చుంబన ప్రక్రియ కొనసాగించాలి. గాఢంగా ఇచ్చేవి... మృదులంగా ఇచ్చేవి... స్ర్తీ బుగ్గలమీద, పెదవులమీద, స్తనద్వయం మీద కొంచెం గాఢంగా ముద్దులివ్వవచ్చు. అయితే నుదిటిమీద, కంటిమీద, చెవి మీద, పిరుదులు, బొడ్డు లాంటి భాగాలపై కేవలం మృదువుగా ఇస్తేనే ఆడవారు ఇష్టపడతారు.Read More
Jul 13 | మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి సమయాల్లో భార్యలు చికాకు పడి.. భర్తకు దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. నిజానికి మెన్సస్ అయిన సమయంలో స్త్రీతో శృంగారంలో పాల్గొన వచ్చా అనే అంశంపై సెక్స్ వైద్యులను, గైనకాలజిస్టులను సంప్రదిస్తే కింది విధంగా అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమీ కానిది మగవారికి మాత్రమే. ఈ సమయంలో స్త్రీలు మానసికంగా ఆందోళన, చిరాకు, కోపం, ఉద్రేకం, దుఃఖంలాంటి భావోద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో పాటుగా, తీవ్రమైన కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్ళూ, తొడలు గుంజడం, రక్తస్రావంతో నీరసం లాంటివి ఉంటాయి. మానసికంగా కూడా ఆమెకు సాంత్వననివ్వాలి. ఇలాంటి సమయాల్లో మహిళలకు పూర్తి విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తులైతే స్త్రీలు ఇంటిపని, ఉద్యోగం రెండూ చేసుకుంటూ అధిక అలసటకు లోనవుతే, ఇంటి పట్టున ఉండే స్త్రీలు విపరీతమైన ఇంటిపనితో అంతే అలసటకు లోనవుతారు. నెలసరప్పుడు శృంగారంలో పాల్గొనవద్దు. పాల్గొంటే అధిక రక్తస్రావం - నొప్పి ఎక్కువ అవుతాయి. పురుషులు - మగ డాక్టర్లనడిగి ఏం కాదు, పాల్గొనవచ్చు అంటారు. కానీ, స్త్రీలు ఆ సమయంలో విపరీతమైన బాధను, చిరాకుని అనుభవిస్తారు. కాబట్టి, నెలసరి అప్పుడు శృంగారం అసలు వద్దనే వద్దని చెప్పాలని సూచిస్తున్నారు.Read More
Jul 06 | శృంగారం అనగానే శారీరక శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు. ఇందులో తృప్తి పొందిన దంపతులు లేదా ఏ ఒక్క జంట మధ్యనైనా అరమరికలు లేని జీవనం సాగిపోతుంది. మరి అన్ని జంటలు భావప్రాప్తిని ఆస్వాదిస్తున్నాయా? అన్ని జంటలూ శృంగారంలో తమ భాగస్వామితో తృప్తి పొందుతున్నాయా? అనుమానమే? చాలా జంటలు కేవలం సమాజానికి వెరసి జీవనం సాగిస్తున్నాయి. వాస్తవానికి ఇద్దరికీ బలమైన శృంగార కోరికలు ఉంటాయి. కాని సంతృప్తి ఉండదు. ఏదో అవసరానికి అన్నట్లు దంపతులిద్దరూ మొక్కుబడిగా ఉద్యోగం చేసినట్లు కార్యం ముగించేస్తుంటారు. దీనికే అయితే పెళ్ళి, పేరంటాలు అసలు అవసరమే లేదు. ఏ సాని కొంపలో దూరినా పది నిమిషాల్లో మొక్కుబడి కార్యక్రమం కానించేయొచ్చు. ఇందులో తాత్కాలిక ఉపశమనమే తప్ప. భావం.. దానికున్న తృప్తి.. సంతృప్తి చెందవు. మరేం చేయాలి? భావ ప్రాప్తి ఏ ఒక్క శరీరానికి మాత్రమే చెందినది కాదు. మరీ శృంగారం విషయంలో ఎంత మాత్రం కాదు.మనసులోని కోరికను శరీరంతో జరిపే రతి కార్యక్రమం ద్వారా తృప్తి పడడమే శృంగారం. ఇందుకోసం మానసిక భావనలు అవసరం. ఏ భార్యకైనా భర్త ఎన్నటీకి ఆ జీవిత కథానాయకుడు. భర్తకు భార్య కథానాయికి అనే విషయం ఎన్నటికీ గుర్తు పెట్టుకోవాలి? వీరి మధ్య ఓ సరసం. ఓ సల్లాపం నిత్యకృత్యాలు అవసరం. ఇది భారతీయ సాంప్రదాయం. అప్పుడే భార్యపై భర్తకు, భర్తపై భార్యకు విశ్వాసం కలుగుతుంది. అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలి. ఇక ఆ తర్వాత చూడడండి మీ దాంపత్యం ఆదర్శం అవుతుంది. శృంగారం సాగర తీరం అవుతుంది. ఇంకా కొందరైతే తాను ఇలా చేస్తే భార్య ఎక్కడ ఇబ్బంది పడుతుందనో, శృంగారంలో ఇలా వ్యవహరిస్తే భర్త ఎక్కడ ఫీలవుతాడోనని ఇద్దరూ… ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోరు. తమ భావాలు బయటపెడితే.. ఏమనుకుంటారోనని అనుమానం. కానీ.. సెక్స్‌లో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఇలాంటి వారు ఏం చేయాలి? ఇది ప్రపంచంలో చాలా జంటల మధ్య ఉన్న స్వభావమే. కొత్తేమి కాదు. చాలా జంటల్లో శృంగారపరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి. శృంగారం భారతీయ సంప్రదాయంలో భాగం అయ్యింది. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా గడపాలి. ఈ ప్రపంచంలో తాము తప్ప ఇంకెవరూ లేరు అనే భావనకు రావాలి. ఆ తరువాత ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవాలి. దీని ద్వారా శృంగార భాగస్వామి ఇష్టాఇష్టాలు బయట పడుతాయి. పైగా సెక్స్‌కు ముందు ఉత్తేజాన్ని పొందుతారు. ఒకరిపై ఒకరికి ఇష్టం పెరుగుతుంది కూడా. ఆపై జరిగే శృంగారాన్ని మీరే అనుభవించండి. Read More
Jun 29 | భార్యా భర్తల బెడ్ రూమ్ లో చోటుచేసుకున్న నిశ్శబ్దం, కామపరంగా వారిని బయట పక్కదోవలు పట్టిస్తోంది. స్త్రీలు, పురుషులు వివాహ బంధాన్ని పక్కన పెట్టి ఇతర ప్రదేశాలలో దొరికే ఆనందానికి లొంగిపోతున్నారు. పురుషులు బహిర్గతంగానే ఎక్కడో అక్కడ దొరికిన చోట ఒక రాత్రి గడిపేస్తున్నారు. అది భార్యకు తెలిసేదే. అయితే ఇక స్త్రీలు మరింత తెలివిగా, నేర్పుగా ఎవరికి తెలియకుండా క్రమం తప్పని అలవాట్లకు దాసోహమంటున్నారు. ఫలితం…..అటు భర్త, ఇటు భార్య ఇద్దరూ కూడా వివాహబంధంలోని సెక్స్ కు దూరమవుతున్నారు. వివాహేతర సంబంధాలు అధికమవుతున్నాయి. ఉద్యోగాల్లోనే తమ కామవాంఛలను తీర్చేసుకుంటున్నారు. ఇంటికొచ్చేటప్పటికి బయట పొందిన అనుభవాలను ఇంటిలో వాటికి పోల్చుకోటమే. వీటికి తోడు తాజాగా వచ్చిన సెల్ ఫోన్లు భార్యా భర్తల లైంగిక చర్యలకు అడ్డంకిగా వుంటున్నాయి. పడకగది సమయంలో మంచం ఊగే సమయంలో….సరిగ్గా కామకేళి మధ్యలో బ్లాక్ బెర్రీ బీప్ సౌండ్ తో భర్త లేచిపోవడంగా వుందని ఒక భార్య ఇబ్బంది. సెల్ ఫోన్ కాకపోతే, ఇక ఇడియట్ బాక్స్ ఇబ్బంది….ప్రతిరాత్రి టివిలో ఏదో ఒక మ్యాచ్….దాని స్కోరంటూ, ఆట గెలుపంటూ పురుషుడు పడకగది చేరేదే లేదు. చేరినప్పటికి మధ్య మధ్యలో టివి చూడాల్సిందే. వారి మైండులో వుండేది మ్యాచ్ తప్పించి పక్కలోవుండే భార్య కాదని కూడా భార్యలు వాపోతున్నారు. అదే విధంగా టివియే దైవంగా భావించి చూసే భార్యలు తమ జంట అందులోని ఇమ్రాన్ ఖాన్ , అవంతికల జంటగా వుండాలని కూడా కోరతారు. వారు గడిపే జీవితంలోని లోటుపాట్లు వీరికి తెలియవు. నగర జీవనంలో మాయమైన శృంగార జీవితం పురుషులు తమ భార్యలను స్లీపింగ్ పిల్స్ గా వాడేస్తున్నారు. తరచుగా పురుషుడు సెక్స్ లో భార్య సగం లో వుండగానే తాను క్లైమాక్స్ చేరిపోడం ఆమెకు నిరాశ కలిగేటప్పటికి నిద్రలో గుర్రు పెడుతూండటం జరుగుతోందని డా. కొఠారి చెపుతారు. భారతీయులలో అధిక జనాభా సెక్స్ మొదలు పెట్టిన వెంటనే క్లయిమాక్స్ చేరిపోతారని, తాము చేసిన సర్వేలో 46 శాతం మాత్రమే వాస్తవ రతిక్రీడను తృప్తిగా ఆచరిస్తున్నారని తేలిందని డా. కేవన్ వీలే చెపుతారు. సెక్స్ లో క్లయిమాక్స్ లకంటే కూడా రిలాక్సేషన్ ప్రధానమని దానికిగాను కొంత సమయం పడకలో భాగస్వామితో అటు ఇటు పొర్లటం, ఫోర్ ప్లే చేయటం, ముద్దులు పెట్టటం వంటివి చేయాలని, సెక్స్ సమయంలో ఏ ఆటంకం వుండరాదని, సమస్యలన్ని బెడ్ రూమ్ బయట వదలాలని ఆధునిక సెక్సాలజిస్టులు చెపుతున్నారు. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో సెక్స్ చేయటంలో, 27 శాతం నెలకో రెండు నెలలకో ఒకసారి, 18 శాతం అసలు ఎపుడూ లేదు. 57 శాతం పురుషులు పైన పడుకొని చేయటం బాగుంటుందని, 62 శాతం రాత్రిపూట బెడ్ రూమ్ లలో బాగుంటుందని తెలిపినట్లు తేలింది.Read More
Jun 22 | కొత్తగా పెళ్ళైయిన జంటలు హనీమూన్ కి వెళుతుంటారు. ఎక్కడో దూరంగా వెళ్లి పోయి ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని దూరంగా వెళుతుంటారు. మరి హనీమూన్ కి వెళ్ళే జంటలు కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ ట్రిప్ ఎంతో ఆనందకరంగా సాగిపోతుంది. వారి కోసం కొన్ని చిట్కాలు. 1. అనుకోని బహుమతి - ఎపుడూ కూడా అనుకోని బహుమతులు ఎంతో సంతోషం కలిగిస్తాయి. అందులోనూ కొత్త జంటలకు ఒకరి కొకరు బహుమతులిచ్చుకోవడం ఎంతో మంచిది. వారి అనుబంధాన్ని, ఆనందాలను పెంచుతాయి. కనుక సెలవుల టూర్ లేదా హనీమూన్ ట్రిప్ వంటి వాటిలో మీ భాగస్వామి లేదా స్వీట్ హార్ట్ అకస్మాత్ గా చూసేలా ఒక మంచి బహుమతిని ఆమె తలగడకింద వుంచండి. మీ ఆనందం రెట్టింపవుతుంది. ట్రిప్ జాలీగా సాగిపోతుంది. 2. సెక్సీ లోదుస్తులు - మీకు కాదండోయ్....ఆమెకు. మీ ప్రేయసికి సెక్సీగా వుండే లోదుస్తులు కొని హానీమూన్ లో ఆమెను ఆశ్చర్యపరచండి. డిపార్ట్ మెంట్ స్టోర్ కు వెళ్ళి అక్కడి లేడీ సహకారంతో కొనుగోలు చేయండి. అందులోని మంచి చెడూ వారికే బాగా తెలుస్తాయి. ఈ లోదుస్తులలో మీ స్వీట్ హార్ట్ ని చూస్తే హనీమూన్ పడకలో మీ హార్మోన్లను పరుగులు పెట్టిస్తాయి. ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. 3. కేండిల్స్ మరియు మ్యూజిక్ - ఇవి లేకుంటే మీ మధ్య అసలు కధ నడవదు. ఆమె మూడ్ రెడీ అయ్యేటంతవరకు వీటిని బయట పెట్టకండి. మూడ్ వచ్చిందంటే, లైట్లు ఆఫ్, కేండిల్ ఆన్, మ్యూజిక్ వీర బాదుడు. ఇక చూస్కో...అనండి. డ్యాన్స్ చేయండి, రెయిన్ లో తడిసిపొండి. మీ రొమాన్స్ నూటికి నూరు శాతం రొమాంటిక్ గా వుండేలా చూడండి. 4. కండోమ్ లు లేదా గర్భనియంత్రణ మాత్రలు - వీటి గురించి అతిగా చెప్పాల్సిన పనిలేదు. వీటి ఉపయోగం అందరికి తెలిసినదే. నేడు మార్కెట్ లో అధునాతనంగా వస్తున్న రుచి, వాసనలు గల కండోమ్ పేకెట్లు ఒకటి లేదా రెండు మరియు పిల్స్ వంటివి తప్పక తీసుకోండి. ఆమెకు ఏది సౌకర్యమో దానిని వాడి ఆనందించండి. కొంతమంది మహిళలు కండోమ్ ధరించేందుకు ఇష్టపడరు. అటువంటపుడు మార్నింగ్ పిల్స్ వంటివి వేస్తే అతి త్వరగా గర్భం రాకుండా కూడా వుంటుంది. 5. వ్యక్తిగత వస్తువులు - హనీమూన్ కు వెళ్ళినా, చాలా భాగం పడక గది తలుపులు వేసి లోపలే వుంటారు. కనుక మీ వ్యక్తిగత శుభ్రత, అలంకరణలు ఎంతో ప్రధానం. మీ, మీ ప్రేయసి అందాలను అతిగా పెంచేసే మేకప్ సామాగ్రిని కూడా తీసుకు వెళ్ళండి. లేదంటే మీ ప్రేయసి రాక్షసిగా కనపడితే....అంతా ఫెయిల్ అయి త్వరగా తిరిగి రావలసివస్తుంది.Read More
Jun 07 | శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది. అయితే, దురదృష్టవశాత్తూ, ఉరుకుల పరుగుల జీవితాలు, ఉద్యోగాల ఒత్తిడి వంటివి జంటల సంతోషానికి అడ్డంకులుగా వున్నాయి. ఎలా? ఎలాగంటే, జంటలు కలసి వుండే సమయాన్ని కేటాయించుకోలేకుండా వున్నారు. అంతేకాదు, మీ అలవాట్లు కూడా మీ లైంగిక జీవితాన్ని కుదించేస్తున్నాయి. ఆరోగ్యకరమైన, మధురమైన రతి జీవితాలు గడపాలంటే, జంటలు కింది అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఆనందకర రతి జీవితానికి వదలాల్సిన అలవాట్లు - లేటుగా రావటం - ఆఫీస్ లో పని అధికంగా వుండవచ్చు. అలా అని మీరు మీ భార్యను మరచిపోనవసరం లేదు. పని ప్రేమిగా వుంటే అది మీ ప్రేమపూర్వక వివాహ జీవితానికి హాని కలిగిస్తుంది. బాస్ ను సంతోష పెట్టటమే కాదు మీ భార్యను కూడా సంతోష పెట్టాలి. ఇంటికి లేట్ గా వచ్చారా? వస్తూనే బుట్టెడు మల్లెలు తెచ్చి మీ భార్య మూడ్ సెకండ్లలో మార్చేయండి. దగ్గరగా వెళ్ళి మీ వేలి స్పర్శతో మేజిక్ చేయండి. సెల్ ఫోన్ న్యూసెన్స్ - మీ డార్లింగ్ పక్కనుంటే ఫోన్ దూరంగా పెట్టేయండి. పురుషుడు లేదా స్త్రీకి ఇటువంటి సమయాలలో దీనిని మించిన శత్రువు లేదు. సరిగ్గా రతి సగంలో మీ ఫోన్ ఇక ఆపేయ్ అంటూ అలారం కొడితే....ఇద్దరి మూడ్ ఖరాబే. కనుక చక్కటి సుఖవంతమైన రతికై మీ ఫోన్ దూరంగా వుంచండి. ఆఫీస్ పని ఇంటికి తేకండి. మరీ అర్జంట్ కాల్ అయితే, తక్కువగా మాట్లాడి కట్ చేయండి. నిద్ర - రతిలో మీరు వారానికి కనీసం 3 లేదా 4 సార్లు అయినా, చురుకుగా పాల్గొనాలి. రతి మీ ఒత్తిడి దూరం చేస్తుంది. అది కూడా ఒక ఆరోగ్యకర వ్యాయామమే. బరువు తగ్గిస్తుంది. విసుగెత్తించే మీ జీవితాలకు చక్కటి భంగిమలు ఆహ్లాదాన్నిస్తాయి. రతి తర్వాత వెంటనే గుర్రు మంటూ నిద్రించకండి. మీ మహిళను కౌగిలించి సంభాషించండి. మహిళలు దానిని కోరతారు. స్నేహితులంటూ అధిక సమయం గడపకండి? స్త్రీలకు, పురుషులకు ఇదొక చెడు అలవాటే. మీ పార్టనర్ కు మించిన స్నేహితులు లేరు అనుకోండి. మీ స్నేహితుడితో బీర్ కొడుతూ కూర్చునేకంటే మీ భాగస్వామి వద్దే ఆపని చేయండి. వైన్ వంటిది కోరిక ఆమెలో కూడా రగిలిస్తుంది. కనుక ఈ డ్రింక్ తో మీ జీవితం ఆనందించండి. అదికూడా ఎపుడైనా ఒకసారి సిప్ చేస్తే మీ రతిలో టాప్ లేపుతుంది. ఈ అలవాట్లు మార్చుకుంటే, మీ వైవాహిక రతిజీవితం అమోఘం, మరింత బాగుండాలంటే కొత్త భంగిమలు ఆచరించండి. మీ అలవాట్లతో ఆందోళన చెందేకంటే, మీ డార్లింగ్ ను బెడ్ లో ఎలా సంతోష పెట్టాలనేది ప్రధానంగా భావించండి.Read More
May 25 | ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు. కుటుంబ భాధ్యతలు, ఆఫీస్ కార్యకలాపాలు, సామాజిక పనులు, పిల్లల భాధ్యతలు ఈ రకంగా అంతూ పొంతూ లేని చర్యలు ప్రతిరోజూ కొనసాగుతూనే వుంటాయి. చివరకు రాత్రయ్యేసరికి మరి పక్కలో భాగస్వామిని తృప్తి పరచటం కష్టమైపోతుంది. మగవారైతే అంగం సహకరించక ఫ్లాట్...ఆడవారైతే ...ఆ యావే లేదు పో....అనేస్తారు. మరిక సృష్టి కార్యానికి, జంటల అనుబంధానికి సమయం, సందర్భం ఎక్కడ? చక్కటి సెక్స్ చేస్తేనే ఇరువురి మధ్య బంధం బలపడుతుంది. కనుక మీ డార్లింగ్ తో గట్టిపట్టు పట్టాలంటే కొన్ని చిట్కాలు చూడండి. శృంగారం చేయండి. మీ ప్రేమ జీవితంలోని మొదటి పేజీలు తిప్పండి. ఒక కొత్త రెస్టరెంట్ కు మీరిద్దరే అంటే మీరిద్దరూ వెళ్ళండి. మీ భాగస్వామికి ఒక రాత్రి అరుదైన స్వర్గం అందించండి. పగటిపూట రాత్రికి మీరు వేసే ప్రణాళికలు చర్చించండి. చక్కటి భోజనం చేయండి. టి.వి.లు, కంప్యూటర్లు స్విచ్ ఆఫ్ చేయండి. అవసరమనుకుంటే సెల్ కు సైతం స్వస్తి చెప్పండి. మీరు అలసి పోకుండానే అసలు పని కొరకై బెడ్ రూమ్ లేదా మరో ప్రయివేట్ ప్రదేశానికి చేరండి.సెక్స్ ఆనందించాలంటే దానికి ప్రణాళిక చేయడం మంచి పద్ధతి. సరిఅయిన సమయం నిర్ణయించండి. మీ ఇష్టాలు, అయిష్టాలు ఆమె లేదా అతనికి తెలియపరచండి. రతి గురించి మాట్లాడుకుంటూ వుండటం మీరు మరింత సమయం దానికి కేటాయిస్తున్నట్లు వుంటుంది. బెడ్ రూమ్ ఎలా వుండాలి, మీరు ఏం చేయాలి వంటివి చర్చించండి. ఇది అసభ్యమే కాని మరోమారు మీలోని పాత జీవాన్ని బయటకు తీయటానికి అవసరం. నిజాయతీగా చర్చలు చేసుకుంటే మరోమారు మీ లైంగిక జీవితం రెన్యువల్ చేసుకున్నట్లే. మీ పరిసరాలు మీకు అనుభూతిని చేకూర్చేలా మలచుకోండి. ఏది చేసినా మీలో కామోద్రేకం కలిగించేదిగా వుండాలి. మీరు ఎంత బాగా అనుభూతి చెందితే, పార్టనర్ తో అంత సన్నిహితం ఏర్పడుతుంది. ఆమె ఆనందిస్తుంది.మహిళలా? మీ పురుషుడే వచ్చి మొదలు పెట్టాలని భావించకండి. మీరే మొదలు పెట్టండి. ప్రతి రాత్రి ఆనందమే. మీ పురుషుడు మీరు తీసుకునే చర్యలను తిరస్కరించాడా? అసలు ఏం కావాలో అడగండి. మీ ఇరువురిలో ఏ మాత్రం కోరిక తగ్గినా సరైన సెక్స్ కౌన్సిలింగ్ చేయించుకోండి. ఒక విషయ నిపుణుడిని సంప్రదించండిRead More
May 18 | పురుషులు నగ్నంగా చూసినా, లేదా ఊహించుకున్నా సరే ఉద్రేకపడతారు. కాని మహిళలు పూర్తిగా వ్యతిరేకం. వీరికి రతి అంటే, రొమాన్స్ మరియు మానసిక అనుబంధాలు అన్ని వుంటాయి. ఎంతో కష్టపడితే కాని మీరు మీ మహిళను ఉద్రేకపరచలేరు. కాని రతిలో మీరు మాత్రంత్వరగా క్లయిమాక్స్ చేరిపోతారు. మరి ఈ పరిస్ధితిని నివారించి మీ మహిళకు పూర్తి ఆనందం కలిగే వరకూ మీరు క్లయిమాక్స్ చేరకూడదనుకుంటే ....కొన్ని టిప్స్ మీ కోసం ఎక్కువసార్లు - ఎక్కువ సార్లు చేస్తే క్లయిమాక్స్ చేరేందుకు రెండో సారి లేదా మూడో సారికి మరింత సమయం తీసుకుంటుంది. మొదటి సారిమాత్రం మీ మహిళ నిరాశపడాల్సిందే. ఆసక్తి, ఆరోగ్యం బట్టి రెండు లేదా మూడు రతులు ఒకేసారి చేయండి. అసురక్షిత రతిక్రీడ - నిరోధ్ వంటి సాధనాలు లేకుండా రతిక్రీడ చేయకండి. అవి తొడుగుగా వేసుకుంటే డైరెక్ట్ టచ్ వుండక త్వరగా స్కలనం కాదు. కండోమ్ పెట్టుకుంటే అధిక సమయం రతిలో గడపవచ్చు. ఫోర్ ప్లే అధికంగా చేయకండి - మీ మహిళ మూడ్ లోకి వచ్చేసిందనుకుంటే ఇక ఫోర్ ప్లే కొనసాగించకండి. తక్షణమే రతి మొదలు పెట్టి క్లయిమాక్స్ చేరేంతవరకు ఆనందించండి. వేగం - రతిలో అంగాన్ని ఎంత వేగంతో పుష్ చేస్తున్నారనేదానిపై కూడా మీ స్కలన సమయం ఆధారపడివుంటుంది. బెడ్ లో అధిక సమయం గడపాలంటే, వేగం తగ్గించి మెల్లగా చేయండి. ఆనందం, అధికంగా చేశామన్న భావన కలుగుతాయి. నియంత్రణ - మీకు ఇక స్కలనం అయుపోతోంది ....అనుకుంటే రతిని నిలిపి కొన్ని సెకండ్లపాటు నియంత్రించండి. నియంత్రణ అనేది క్లయిమాక్స్ త్వరగా చేరకుండా వుండటంలో ప్రధానం. ఈ పద్ధతులను ఆచరిస్తూ త్వరగా క్లయిమాక్స్ చేరటాన్ని ఆపి మీ రతిక్రీడను ఆనందించండి.Read More