YSRCP MLA Anil Kumar Yadav Compared Jagan as Baahubali

Ysrcp mla anil kumar praise jagan

Nellore YSRCP MLA, MLA Anil Kumar Yadav, Jagan Baahubali, Nara Lokesh Brahmi, Lokesh Jagan Comparision, Jagan Anil Kumar Yadav, MLA Anil Kumar Yadav , Anil Praise Jagan, Brahmi Baahubali, Baahubali Jagan, Brahmi Nara Lokesh

Nellore YSRCP MLA Anil Kumar Yadav draw a comparison between Minister Nara Lokesh with YSRC president Y S Jaganmohan Reddy to take a dig at the former.He described Jagan as a mighty hero like Baahubali, whereas Lokesh is a comical character like Brahmanandam.

లోకేశ్ బ్రహ్మీ.. జగన్ బాహుబలి

Posted: 04/27/2017 02:55 PM IST
Ysrcp mla anil kumar praise jagan

ఏపీ రాజకీయాలో సోషల్ మీడియా కు ఇప్పుడు చాలా స్పెషల్ స్థానం కట్టబెట్టారు. లోకేష్ నేతలను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తే అది కాస్త అరెస్ట్ లు, ప్రత్యేక చట్టాలు చేసేదాకా వెళ్లింది. పొలిటికల్ లీడర్లపై సెటైర్లు వేసేలా ఫోటోలు, కథనాలు ఏవీ వైరల్ చేసినా ఊచలు లెక్కించాల్సిందే. ఈ నేపథ్యంలో విమర్శల కోసం వినూత్న ఆలోచనలు చేస్తున్నారు.

వైఎస్సార్పీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తాజాగా చేసిన కామెంట్లే అందుకు ఉదాహరణ. జగన్, లోకేష్ ల పేర్లను ప్రస్తావిస్తూ ఓ పోలికను చేశాడు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల తనయులేనన్న విషయం ఉదాహరిస్తూ జగన్ లో ఉన్న పొలిటికల్ మెచ్యూరిటీలో లోకేశ్ ఇంచుకూడా లేదని చెప్పుకొచ్చాడు. జగన్ ఓ బాహుబలి లాంటోడు.. రోజురోజుకీ పెద్ద హీరోగా మారిపోతున్నాడు. కానీ, లోకేశ్ పరిస్థితి మాత్రం బ్రహ్మనందంలా తయారయ్యిందని ఎద్దేవా చేశాడు.

మరి జగన్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... భగవంతుడి దయ లేకపోవటం మూలంగానే ప్రతిపక్ష నేతగా మిగిలిపోయాడని చెప్పుకొచ్చాడు. కావాలనే ఈసారి ఆయనికి ఆ పదవి కట్టబెట్టిన దేవుడు వచ్చే ఎన్నికల్లో మాత్రం ముఖ్యమంత్రిని చేస్తాడంటూ జోస్యం చెప్పాడు. ఇదంతా జనాలకు జగన్ దగ్గరయ్యేందుకేనని తేల్చి చెప్పేశాడు.మొత్తానికి ఈ విచిత్రమైన కామెంట్లకు ఇప్పుడు విపరీతమైన పబ్లిసిటీ దక్కేస్తుంది. ఎవరో జోకర్, ఎవరో కింగ్ మేకరో.. తేలటానికి మరో రెండేళ్లుగా ఉందిగా అనిలా.. చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Kumar Yadav  YS Jagan Baahubali  Nara Lokesh  Brahmi  

Other Articles