Govt to invite preliminary bids for IDBI Bank stake sale ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటైజేష‌న్‌.. వ‌చ్చేనెల‌లో ప్రిలిమిన‌రీ బిడ్లు..?

Idbi bank stake sale govt might invite preliminary bids in september

IDBI Bank, finance ministry, idbi, rbi, lic, fdi, cabinet, preliminary bids, stake selling, Indian companies established, Companies, All India Financial Institutions, Banks (NEC), Life Insurance, Corporate Banks, Semiconductors (NEC), Auto, Truck & Motorcycle Parts (NEC), Financial & Commodity Market Operators & Service Providers

The government is likely to invite preliminary bids for selling a stake in IDBI Bank in September and the discussions with the RBI are at the final stages, an official said. "There are still some pending issues that need to be discussed with the Reserve Bank of India and Securities and Exchange Board of India. We are hopeful of issuing the EoI by September," the official told PTI.

ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటైజేష‌న్‌.. వ‌చ్చేనెల‌లో ప్రిలిమిన‌రీ బిడ్లు..?

Posted: 09/01/2022 09:26 PM IST
Idbi bank stake sale govt might invite preliminary bids in september

ప్ర‌భుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం ఈ నెల ప్రాథ‌మిక బిడ్ల‌ను ఆహ్వానించ‌నుంది. ఈ విష‌య‌మై ఆర్బీఐతో చ‌ర్చ‌లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయ‌ని అధికారులు చెప్పారు. `ఇప్ప‌టికీ కొన్ని పెండింగ్ స‌మ‌స్య‌లు ఉన్నాయి. వాటిపై ఆర్బీఐ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)ల‌తో చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంది. సెప్టెంబ‌ర్ నాటికి ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ (ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట‌రెస్ట్-ఈవోఐ) కోసం బిడ్లను ఆహ్వానిస్తామ‌ని ఆశాభావంతో ఉన్నాం` అని ఓ అధికారి తెలిపారు. బ్యాంకింగ్, ఈక్విటీ మార్కెట్ల నియంత్ర‌ణ సంస్థ‌లు ఆర్బీఐ, సెబీల‌తో ప్ర‌భుత్వం జ‌రుపుతున్న చ‌ర్చ‌ల వివ‌రాలు వెల్ల‌డించ‌డానికి నిరాక‌రించారు.

`బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటీక‌రించ‌నున్న తొలి బ్యాంకు ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల కొనుగోలుకు ఇన్వెస్ట‌ర్ల నుంచి భారీగా బిడ్లు దాఖ‌ల‌వుతాయ‌ని మేం విశ్వ‌సిస్తున్నాం. ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ (ఈవోఐ) బిడ్లు ఆహ్వానిస్తాం. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో వాటాల విక్ర‌యం పూర్తి కాక‌పోవ‌చ్చు` అని ఆ అధికారి పీటీఐకి చెప్పారు. గ‌తేడాది మే నెల‌లోనే ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్ర‌యంతోపాటు యాజ‌మాన్య నియంత్ర‌ణ హ‌క్కుల‌ను బ‌దిలీ చేయాల‌ని కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల క్యాబినెట్ క‌మిటీ (సీసీఈఏ) సూత్ర‌ప్రాయంగా ఆమోదించింది.

ప్ర‌స్తుతం ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్ర‌భుత్వానికి 45.48 శాతం, భార‌తీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కి 49.24 వాటాలు ఉన్నాయి. విక్ర‌యించ‌త‌ల‌పెట్టిన వ్యూహాత్మ‌క వాటా ఎంత అన్న‌ది ఖ‌రారు కాలేదు. కొనుగోలుదారు (క‌న్సార్టియం)కు ఓపెన్ ఆఫ‌ర్ వంటి ప‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల్సి ఉంది` అని అధికారులు తెలిపారు. ఎల్ఐసీతోపాటు కేంద్ర ప్ర‌భుత్వం త‌మ వాటాల విక్ర‌యంపై నిర్ణ‌యం తీసుకోనున్నాయి. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2022-23)లో రూ.65 వేల కోట్ల వాటాల ఉప‌సంహ‌ర‌ణ ల‌క్ష్యంగా పెట్టుకోగా, ఇప్ప‌టి వ‌ర‌కు రూ.24,544 కోట్ల నిధులు సేక‌రించింది కేంద్రం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : idbi bank  finance ministry  idbi  rbi  lic  fdi  cabinet  preliminary bids  stake selling  final stages  RBI  Union Government  

Other Articles

  • From reviews to photoshoots how pothole issues are going viral on social media

    గోతులమయంగా జాతీయ రహదారులు.. నెట్టింట్లో వీడియోలు..

    Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more

  • Will luck favour ruling trs party to win munugode assembly by elections

    అక్కడ కలసిరానీ లక్కు.. మునుగోడులో కలసి వచ్చేనా..?

    Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more

  • Manchu manoj and bhuma mounika reddy ganesh pandal visit sparks marriage rumours

    త్వరలో మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డీల పరిణయం.?

    Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్  రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more

  • Janasena chief pawan kalyan comments change equations in telangana

    జనసేనాని వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల అంతర్మధనం.!

    May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more

  • Is actor ali upset over ysrcp party for ignoring him for rajya sabha seat

    వైసీపీ అధిష్టానంపై నటుడు అలీ మనస్తాపం.. అదే కారణమా.?

    May 19 | సీనియర్‌ కమేడియన్ అలీ అధికార వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీలో సినీమారంగం నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి... Read more