Janasena party Entrance Test Main Reason

Reason behind janasena entrance test

Pawan Kalyan, Janasena Entrance Exam, Janasena Exam Reason, Basic Knowledge for Janasena Exam, Pawan Kalyan Janasena Party, Jaleel Khan Janasena Entrance Exam, Jaleel Khan SV Mohan Reddy

Pawan kalyan's Janasena Party Entrance Exam. Pawan think basic knowledge need to Candidates.

జనసేన ఎంట్రన్స్ ఎగ్జామ్ అందుకోసమేనా?

Posted: 05/02/2017 01:41 PM IST
Reason behind janasena entrance test

రాజకీయాల్లో తలపండిన నేతల్లా అనుభవం లేకపోయినా పవన్ సృష్టించే ప్రభంజనం అంతా ఇంతా కాదు. జనసేన ఆవిర్భావం నుంచి ప్రతీ సభకు ఆయన ఎదుగుదల చూస్తూనే ఉన్నాం. పిట్ట కూతలకే(ట్విట్టర్) పరిమితమయ్యాడన్న ఆరోపణలు వినిపించినప్పటికీ సమస్యలను పరిష్కారం చేసేందుకు తమ ముందు ఉన్న ఏకైక ఆఫ్షన్ పవనేనని ఇప్పటికీ కొన్ని వర్గాలు నమ్ముతున్నాయంటే అతిశయోక్తి కాదు.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికలను టార్గెట్ చేస్తూ పార్టీ విస్తరణ చేపట్టిన పవన్ జిల్లాల వారీగా దృష్టిసారిస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగా మొన్న అనంతపురంలో జనసేన సైనికుల కోసం ఎంపిక పేరుతో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించగా దానికి మంచి స్పందనే వచ్చింది. క్లీన్ పాలిటిక్స్ పేరుతో పవన్ చేసిన ఈ యత్నాన్ని కొందరు హేళన కూడా చేశారు. కానీ, కనీస పరిజ్ఞానం లేనివాళ్లు, మాట తీరు కూడా సరిగ్గాలేని కొంతమంది లీడర్లు నేడు పాలన చేస్తున్న క్రమంలో రాజకీయాల మీద కాస్త క్లారిటీ ఉన్న వాళ్లనే కార్యకర్తలుగా తీసుకోవాలన్న ఆలోచనతోనే పవన్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

బీకాంలో ఫిజిక్స్ చేసిన జలీల్ ఖాన్, ఈ మధ్య డిగ్రీలో సీఈసీ చదివిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి లాంటి వాళ్ల ప్రకటనలతో సోషల్ మీడియా బఫూన్లుగా మారిపోతున్న క్రమంలో ఆ పరిస్థితి జనసేనకు ఇసుమంతైనా రాకూడదనే ముందు జాగ్రత్తతోనే ఇలాంటి ప్రయోగానికి తెరలేపాడని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో కేవలం రెండుమూడు గంటలపాటు కూర్చొని రాసిన పరీక్షలతో వారి శక్తిసామర్థ్యాలను, రాజకీయ పరిజ్నానం అంచనా వేయటం కష్టం అనేవాళ్లు లేకపోలేదు. ఏది ఏమైనా కాస్త విద్యావంతులు, పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు రాజకీయాల్లో ఉండటం మంచిదేనన్న పవన్ ఆలోచన వర్కవుట్ అయితే చాలూ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena Party  Entrance Exam  

Other Articles