Pawan Kalyan comments change equations in Telangana జనసేనాని వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల అంతర్మధనం.!

Janasena chief pawan kalyan comments change equations in telangana

Pawan kalyan, Jana sena President, Jana Sena, BJP, Bandi Sanjay, Congress, Revanth Reddy, TDP, Chandrababu, YSRTP, YS Sharmila, political Equations, Goparajupally village, Nalgonda, financial assistance, Kongari Saidu, road accident, Sumathi, Saidu's son, health condition, education, health, Telangana, Politics

Janasena chief Pawan Kalyan Political comments draw attention of Telangana political parties. After National Party Leaders of Congress and BJP conducted meetings the Actor turned Politician today visited Telangana to extend financial assistance to the deceased party activist Kongari Saidu.

జనసేనాని వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల అంతర్మధనం.!

Posted: 05/21/2022 07:50 PM IST
Janasena chief pawan kalyan comments change equations in telangana

రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ పోటీచేస్తారని తొలుత ప్రకటించినా.. తరువాత అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే జనసేన ఏపీకే పరిమితం అన్న సమయంలో ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఈక్వేషన్స్ ను పవన్ వ్యాఖ్యలు మార్చేస్తున్నాయి.

తెలంగాణలో ఇప్పటికే పక్కలో బళ్లెంలా మారిన బీజేపి పార్టీకి.. పవన్ కల్యాణ్ కూడా జత కలిస్తే ఆ ప్రభావం ప్రజల్లోకి ఎలా వెళ్తుందని అధికార టీఆర్ఎస్ పార్టీ సహా విపక్ష పార్టీలు బేరిజు వేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నిక్లలో తెలంగాణలోనూ జనసేన సత్తా చాటుదామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పవన్ వ్యాఖ్యలతో అప్పటికే ఈలలు, కేరింతలతో ఉత్సాహంగా వున్న కార్యకర్తలు, అభిమానలకు పవన్ కల్యాణ్ మాటలు.. జీవవాయువును అందించాయి. జనసేన అవిర్భావంలో ఎన్నికలకు దూరంగా నిలిచిన జనసేన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా నిలవడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.

ఇక అప్పటి లోటును భర్తి చేసేలా ఇవాళ పవన్ చేసిన ప్రసంగం.. కార్యకర్తలు.. అభిమానులలో నూతనోత్తేజం కలిగించింది. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరిమిత సంఖ్యలో జనసేన పోటీ చేయబోతోందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాజకీయాల్లోనూ తాము గెలుపోటములను ప్రభావితం చేస్తామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో తమకు ఓటు బ్యాంకు ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పిన పవన్.. ఓటమికి కుంగిపోను అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగాలని అన్నారు. రాష్ట్రంలో జనసేన జెండా ఎగరాలని ఆకాంక్షించారు.

ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలోని పలు రాజకీయ పార్టీలు తమ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయని పరిశీలించే పనిలో పడ్డారు. తమ పార్టీతో ఇప్పటికే కొనసాగుతున్న మైత్రి.. తెలంగాణలోనూ వినియోగించుకునేలా బీజేపి ప్లాన్ చేసిందా.? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని.. అందుకు అన్ని ప్రత్యర్థి పార్టీలు కలసి కూటమిగా ఏర్పడాలని ఇప్పటికే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జనసేనాని.. అదే కూటమితో తెలంగాణలోనూ రాజకీయ తెరంగ్రేటం చేసి రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపుతారా.? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక అధికార టీఆర్ఎస్ లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కొత్త టెన్షన్ ను రాజేశాయి. ఓ వైపు సీఎం హస్తిన పర్యటనలో, కీలకమైన మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండగా, రాష్ట్రానికి వచ్చిన పవన్ అగ్గిరాజేశారనే చెప్పాలి. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ బ్రాండ్ ఇమేజ్ అయిన ఆయన ఎర్రని కండువాను భుజాలపై వేసుకుని.. పవన్ అభిమానులను తమవైపు తిప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ.. రానున్న ఎన్నికలలో పవన్ కల్యాణ్ సహ జనసేన పార్టీని ఎలా ఎదర్కోవాలి అని ఆ పార్టీ నేతలు మేధోమధనంలో పడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన సభ విజయవంతమైన నేపథ్యంలో..దానిని ప్రజలు మర్చిపోయి.. తన పర్యటనను గుర్తుపెట్టుకుని మాట్లాడేలా తెరవెనుకనుంచి టీఆర్ఎసే ఇలా ప్లాన్ చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది నిజమో తెలియాలంటే.. ఎన్నికల సీజన్ వరకు వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles