Manchu Manoj does Ganesh Pooja with Bhuma Mounika త్వరలో మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డీల పరిణయం.?

Manchu manoj and bhuma mounika reddy ganesh pandal visit sparks marriage rumours

Manchu Manoj, Bhuma Mounika Reddy, Manchu Mohan Babu, Manchu Vishnu, Lord Ganesh Temple, late Bhuma Nagi Reddy, Shobha Nagi Reddy, couple entering wedlock, pranthi reddy, political circles, film celebrities, manchu manoj Fiancee, Hyderabad, Telangana

Tollywood actor Manchu Manoj stirred up the film and political circles of the two Telugu states with his latest public outing, was seen arriving at a Ganesh pandal in Sitaphalmandi area of Hyderabad with a woman, who is the daughter of late Bhuma Nagi Reddy and Shobha Nagi Reddy, Bhuma Mounika Reddy. The duo sought blessings of Lord Ganesh and is set to be soon entering wedlock.

త్వరలో మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డీల పరిణయం.?

Posted: 09/05/2022 01:16 PM IST
Manchu manoj and bhuma mounika reddy ganesh pandal visit sparks marriage rumours

టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్  రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ వార్త.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇక నిప్పు లేకుండానే పోగవస్తుంటూ ప్రచారం చేసే సోషల్ మీడియా.. ఇప్పడీ వార్తను సంచలనంగా మార్చేసింది. అయితే మంచు మనోజ్ ఈ సారి మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహం కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకోనున్నాడని బలమైన వార్తలు వినబడుతున్నాయి. అయితే మంచు మనోజ్ ఈ సారి చేయి పట్టుకుని పాణిగ్రహణం చేయబోనున్న వధువు ఎవరో తెలుసా.?

తెలుగు రాష్ట్రాల్లో బలమైన నేతలుగా ఎదిగిన దివంగతులైన భార్యాభర్తల కనిష్ట పుత్రిక. వారు ఎవరంటే.. మాజీ ఎంపీ దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంత సడన్ గా ఈ వార్త ఎందుకిలా గుప్పుమనిందో తెలుసా.? మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిలు కలిసి.. క్రితం రోజు రాత్రి సికింద్రాబాదులోని ప్రముఖ క్షేత్రమైన శ్రీ సిధ్దిగణపతి దేవాలయానికి రావడం ఈ వార్తలకు బలం చేకూరింది. ఇద్దరు కలిసి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మనోజ్ మాట్లాడారు.

భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోబుతున్నారా.? అని మీడియా అడిగిన ప్రశ్నకు పర్సనల్ విషయాలు పబ్లిక్ గా చెప్పడం సమంజసం కాదని.. మాట దాటవేశారు. అయితే ఈ లోపు ఓ సంకేతాన్ని మాత్రం అందించారు. ఓ మంచి రోజు చూసుకుని తానే అందరికీ విషయం చెబుతానని అన్నాడు. అదేవిధంగా సినిమాలు, రాజకీయాల్లోకి వచ్చే విషయంపై అడగ్గా.. వాటి గురించి కూడా త్వరలో మాట్లాడుతానని.. ప్రస్తుతం వినాయకుడి గురించి మాట్లాడుకుందామంటూ మంచు మనోజ్ సమాధానం ఇచ్చాడు. మంచు మనోజ్‌కు ఇదివరకే హైదరాబాద్‌కు చెందిన ప్రణతీ రెడ్డితో వివాహం జరిగింది. నాలుగేళ్లపాటు కొనసాగిన వీరి బంధం 2019లో విడిపోయింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles