stomach pain problems | health tips | best home remedies

Best home remedies to free from stomach pain

stomach pain problems, stomach pain symptoms, stomach pain news, stomach pain disease, health tips, health tips for stomach pain, stomach pain health tips, health tips telugu, pudina health benefits, aloevera health benefits, lemon water health benefits, baking powder health tips, health home remedies

best home remedies to free from stomach pain : The Best Home remedies which helps to reduce stomach pain problem In a short time.

కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఉత్తమ చిట్కాలు...

Posted: 03/28/2015 07:39 PM IST
Best home remedies to free from stomach pain

సాధారణంగా ప్రతిఒక్కరూ ఎప్పుడోసారి కడుపునొప్పి సమస్యకు గురై వుంటారు. అజీర్ణం, అతిసారం వంటి సమస్యలతో ఇది వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి కొద్దిసేపటిలోనే తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు ఇది విపరీతంగా బాధిస్తుంది. అలాంటి సందర్భాల్లో దీనిని నిర్లక్ష్యం చేస్తే.. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి.. ఈ సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందాలంటే అందుకు కొన్ని ఉత్తమమైన చిట్కాలు అందుబాటులో వున్నాయి. అవేమిటో తెలుసుకుందాం...

1. పుదీనా : ఇది కడుపునొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలిగించడంతో ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇందులో పోషక విలువలు అధిక సంఖ్యలో వుంటాయి. అవి.. కడుపునొప్పి కారణాలతో పోరాడి, దాన్నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి, నేరుగా నోట్లో వేసుకుని నమిలి మింగొచ్చు. లేదా ఈ ఆకులతో టీ చేసుకుని తాగితే.. ఫలితం పొందవచ్చు.

2. అలోవెరా జ్యూస్ : ఇది ఆరోగ్యపరంగా ఎన్నోవిధాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో అనేక ఔషధగుణగణాలున్నాయి. శరీరంలోని హానికారక క్రిముల నుంచి పోరాడి అనారోగ్య సమస్యల నుంచి దూరంగా వుంచుతుంది. ఒక కప్పు అలోవెరా జ్యూస్ తీసుకుంటే.. పొట్ట, ప్రేగు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం, కడుపులో తిమ్మెర్లను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

3.  లెమన్ వాటర్ : లెమన్ జ్యూస్ లో కాస్త గోరువెచ్చని నీరు కలుపుకుని తాగితే.. కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం పిండి, కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే.. ఫలితాన్ని పొందవచ్చు.

4. బేకింగ్ సోడా : ఇది హార్ట్ బర్న్, అజీర్తిని నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే కడుపు నొప్పిని నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కాస్త బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసి త్రాగడం వల్ల వెంటనే మంచి ఫలితం ఉంటుంది.

5. అల్లం : ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీతోపాటు కొన్ని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల వుంటాయి. ఇవి అజీర్తిని తగ్గించి, కడుపునొప్పిని నివారిస్తాయి. ఎండిన అల్లంకంటే, తాజాగా ఉన్నది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. తాజాగా ఉండే అల్లంను టీ చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : stomach pain problems  health tips  health home remedies  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more