Health And Beauty Benefits With Litchi Fruit | Health Tips | Beauty Tips | Home Remedies

Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

litchi fruit health benefits, litchi fruit health tips, litchi fruits, litchi fruit nutrients, litchi fruit heart diseases, litchi fruit cancer cells, litchi fruit updates, health tips, beauty tips, healthy fruits, healthy foods

litchi fruit health beauty benefits home remedies face packs heart diseases : Health and beauty benefits will get by eatinig litchi fruits daily. It contains number of nutrients which prevents heart, cancer diseases.

లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

Posted: 05/25/2015 11:35 AM IST
Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. రకరకాల జబ్బుల నుంచి ఉపశమనం కలిగించడంలోనూ దోహదపడుతాయి. అంతేకాదు.. అందానికి సంబంధించిన సమస్యలను దూరం చేయడంలోనూ ఈ ఫ్రూట్ సహాయపడుతుంది. మరి.. ఇందులో ఏ పోషకాలున్నాయో, అవి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తాయో చూద్దామా..

లిచీ పండ్లలో వుండే పోషకాలు.. వాటివల్ల కలిగే ప్రయోజనాలు :

లిచీ పండ్లలో ప్రోటీన్, విటమిన్స్, ఫ్యాట్, సిట్రిక్ యాసిడ్స్, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే.. ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు నిల్వవుంటాయి. ఆ ఖనిజాలు.. శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంపొందించడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్‌ను నిరోధించే పెక్టిన్ ఈ పండ్లలో పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీయాక్సిడెంట్స్ శరీరానికి హానీ కలిగించే ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.

గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాలిపినాల్స్ ఈ ఫ్రూట్ లో అధికంగా ఉంటాయి. వీటితోపాటు బీటాకెరోటిన్, ఓలిగోనల్ వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా వుంచడంలో దోహదపడుతాయి. లిచీ ఫ్రూట్ పెద్దప్రేగు కాన్సర్‌కు కారణం అయ్యే క్యాన్సర్ కణాలు, కణితులు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. ముఖ్యంగా ఇందులో వుండే పాలిఫినాల్స్ క్యాన్సర్ వ్యాధులను అరికట్టడంలో బాగా పనిచేస్తాయి. ఈ ఫ్రూట్ చిరుజబ్బులను సైతం తక్షణమే మటుమాయం చేయడంలో ముందుంటుంది.

జలుబు సమస్యను త్వరగా ఉపశమనం కలిగించే పోషక విలువలు ఇందులో పుష్కలంగా వుంటాయి. కాబట్టి.. వీటిని తరుచుగా తీసుకుంటే మంచిది. అలాగే.. ఈ ఫ్రూట్ ఆస్తమా నుండి రక్షణ కల్పిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. లీచీలో ఉండే అధిక న్యూట్రీషియన్స్, విటమిన్స్ (సి విటమిన్)వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సౌందర్య ప్రయోజనాలు :

ఈ లిచీ ఫ్రూట్ తో కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు.. సౌందర్య ఫలితాలూ కలుగుతాయి. ఈ ప్రూట్ లో ఒలిగోనల్ అనే పోషకం వుంటుంది. అది వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. ఇంకా చర్మం నుండి డార్క్ స్పాట్స్‌ను నిరోధిస్తుంది. కాబట్టి లిచీ పండు అలాగే తినడం కానీ లేదా ఫేస్ ప్యాక్‌గా ట్రై చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : litchi fruit  health tips  healthy fruits  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Tamarind leaves carrots health benefits home remedies

    చిగురు, క్యారెట్ తీసుకోండి.. చింత మానేయండి!

    May 22 | వేసవికాలంలో ఎండతాపం వల్ల ప్రతిఒక్కరూ నీరసంగా మారిపోతారు. తద్వారా వారి శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో.. ఏవైనా పనులు నిర్వర్తించుకోవాలన్న శక్తి చాలదు. అలాంటప్పుడు తిరిగి శక్తిని పొందాలంటే.. చిగురు, క్యారెట్... Read more

Today on Telugu Wishesh