Tips to reduce obesity problem

obesity problems, tips reduce obesity, obesity people, obesity problems, healthy tips, tip of the day, health tips, obesity tips, tips to weight loss

Tips to reduce obesity problem which are very simple to follow

బొజ్జ తగ్గించుకోవడానికి సులువైన మార్గాలు!

Posted: 09/15/2014 04:49 PM IST
Tips to reduce obesity problem

(Image source from: Tips to reduce obesity problem)

సాధారణంగా ప్రతిఒక్కరి వయస్సు పెరుగుతున్నకొద్దీ మానవ శరీరంలో జీవన ప్రక్రియలు కాలక్రమంలో మారుతూ వుంటాయి. ఈ సమయంలోనే రకరకాల రోగాలు సంభవించే అవకాశాలు చాలానే వున్నాయి. అందులో బొజ్జ సమస్య కూడా ఒకటి. ఇది మన శరీరాకృతిని వికృతంగా మార్చడమే కాక, అనేక రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా మనలో వుండే జీవక్రియలు మందగించడం మొదలవుతాయి. దీంతో శరీరంలో అధికమొత్తంలో కొవ్వు పదార్థాలు పెరగడం ప్రారంభం అవుతాయి. ఇలా విడుదలైన కొవ్వు పదార్థాలు ఎంతో హానికరంగా తయారవుతాయి. దీంతో గుండెజబ్బులు, మధుమేహం, రొమ్ము క్యాన్సర్, పిత్తాశయ సమస్యలు, అధిక రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్ వంటి అనేక రోగాలు సంభవిస్తాయి. అయితే ఈ వ్యాధులన్నింటికి చెక్ పెట్టాలంటే.. అందుకు ముందుగా బొజ్జను తగ్గించుకోవాల్సి వుంటుంది. ఈ బొజ్జ సమస్య నుంచి బయటపడితే.. మానవుడు ఆరోగ్యంగా వుండటంతోపాటు నిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి వీలుగా వుంటుంది.

బొజ్జను తగ్గించుకునే చిట్కాలు :

1. చాలామంది బరువు ఎక్కువ వున్నారని తెలియగానే ఆహారం తీసుకోవడం మానేస్తారు. బొజ్జను తగ్గించుకోవాలని, బరువు పెరగకుండా వుండాలని డైటింగ్ లేదా కేవలం ఒకపూట తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు. ఇది ఎంతో ప్రమాదకరం. అలాకాకుండా మూడుపూటలా భోజనం తీసుకోవచ్చు. అయితే వాటిని తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తపడాలి. ప్రతిరోజూ తక్కువ మోతాదులో శక్తినిచ్చే (తక్కువ కేలరీలు) ఆహారపదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. ఇలా అల్పాహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాక, శరీరాకృతి కూడా అదుపులో వుంటాయి.

2. సాధ్యమైనంతవరకు ఉప్పు తక్కువగా వుండే పదార్థాలను తీసుకోవాలి. ఎందుకంటే.. ఉప్పు శరీరంలో నీటిని, కొవ్వును నిల్వవుండే గుణాన్ని కలిగివుంటుంది. దీంతో బరువు పెరగడమే కాకుండా, చురుకుగా వుండలేకపోతారు. కాబట్టి ఉప్పు వాడకం తగ్గించుకోవాలి.

3. లావుగా వున్నవారు జిమ్ కు వెళ్లడం, ఇతర వ్యాయామాలు చేయడం చేస్తుంటారు. అయితే వాటితోపాటు ప్రతిరోజు నడక చాలా అవసరం. సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ప్రతిరోజూ నడిస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు. అలాగే పరిగెత్తడం వల్ల శరీరంలో వుండే కొవ్వు చాలావరకు తగ్గిపోతుంది.

4. ఆహారపదార్థారాలలో రుచికరమైన వేపుడు కూరలు తీసుకోవడం చాలా ప్రమాదం. అలాకాకుండా ఉడికించిన కూరలు తింటే ఎంతో మేలైనది. దీంతో బొజ్జ తగ్గి, ఆరోగ్యంగా వుంటారు. ప్రతిరోజూ సాయంత్రం తాజాగా వుండే ఏదో ఒక ఆహారపదార్థాలను అంటే యాపిల్, అరటిపండు ఇంకా ఇతర పండ్లను తీసుకోవాలి.

5. నీరు.. దీనిని ప్రతిరోజు చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. ఇలా తీసుకోవడం వల్ల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. దీంతో జీవప్రక్రియ మెరుగవుతుంది. దీంతో బరువు తగ్గి, ఆరోగ్యంగా వుండొచ్చు.

6. నిద్రవల్ల కూడా బరువు తగ్గే అవకాశాలు వున్నాయి. ఎలా అంటే.. నిద్రపోవడం వల్ల కండరాలు అలసటపడి తేరుకుంటాయి. అలాగే శరీరంలో ఎక్కువ కాలరీలు కరుగుతాయి. దీంతో కొవ్వు పదార్థాలు తగ్గి, ఆరోగ్యంగా వుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obesity problems  health tips  obesity tips  weight loss tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more