Organizing tips to stay away from office stress

organizing tips, tip of the day, healthy tips, organizing healthy tips, office tips, stress free tips, health tips, organizing tips in telugu, telugu news, telugu tips, tips in telugu

organizing tips to stay away from office stress

ఆఫీసు ఒత్తిడిని జయించే సులభమైన చిట్కాలు

Posted: 09/20/2014 03:11 PM IST
Organizing tips to stay away from office stress

(Image source from: organizing tips to stay away from office stress)

సాధారణంగా ప్రతిఒక్కరు తమ దైనందిన జీవితంలో నిత్యం చేస్తున్న కార్యకలాపాల వల్ల మానసిక ఒత్తిడికి గురికావడం సహజం. ముఖ్యంగా ఉద్యోగస్తులు అయితే.. ప్రతిరోజు ఆఫీసుకు వెళ్లడం వల్ల ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వాపోతుంటారు. ఆఫీసులలో ఇచ్చే పనిభారం, ఇంట్లో చేసే కార్యకలాపాల ఎక్కువయినప్పుడు మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల వారు ఆఫీసు విధులకు సరిగ్గా హాజరుకాకుండా తప్పించుకుంటూ తిరుగుతారు. లేదా మద్యపానానికి బానిసలవుతారు. ఈ మానసిక ఒత్తిడి మానసికంగానే కాకుండా శారీరకంగా ప్రభావాన్ని చూపుతుంది. దీంతో వారు ఇరిటేషన్ కు గురై, కోపగ్రస్తులుగా మారుతారు.

సాధ్యమైనంతవరకు ఒత్తిడిని జయించడానికి వీలుగా వుంటుంది కానీ.. స్థాయికి దాటిపోయినప్పుడు మానసిక, భావోద్వేగాలకు గురవుతాం. దీన్నే మానసిక ఒత్తిడి అంటారు. అయితే ఇది ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా వుంటుంది. కొందరు ఇటువంటి ఒత్తిడికి గురైనప్పుడు చాలావరకు ఇతరులమీద కోప్పడకుండా తమనుతాము అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మరికొందరైతే భయంకరంగా వ్యవహరిస్తారు. అంతేకాదు.. ఇది అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. మనకు దగ్గరగా వున్న బంధుత్వాలు (కోలీగ్స్, ఫ్రెండ్స్, బంధువులు) తెగిపోయే అవకాశాలు కూడా వుంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా కొన్ని మార్గాలను అనుసరిస్తే.. మనం ఒత్తిడి నుండి ఉపశమనం పొందే అవకాశం వుందని అంటున్నారు నిపుణులు.

మీరు చేస్తున్న పని మీకు భారంగా అనిపించినప్పుడు మీలో మానసిక ఒత్తిడి ఏర్పడిందని సంకేతం. దీంతో మీరు పని మీద నిరాశ చెందడం, దాని మీద ధ్యాస లేకపోవడం జరుగుతుంది. దీంతో మీరు మీ పనిమీదే కాకుండా మీ ఏకాగ్రతను కూడా కోల్పోతారు. దీంతో మీకు తలనొప్పి, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది. శాస్త్రజ్ఞుల ప్రకారం.. మన శరీరంలో ఒత్తిడి ఎప్పుడైతే ఏర్పడుతుందో వెంటనే దానికి సంబంధించిన ర్యాడికల్స్ అధిక సంఖ్యలో తయారు అయిపోతాయి. ఇవి మన శరీరంలో జరిగే జీవనక్రియకు నెగెటివ్ గా పనిచేస్తాయి. దీంతో నాడీవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం కూడా వుంటుంది. కాబట్టి మీకు మీరే పనిభారాన్ని గుర్తించి, ఒత్తిడికి గురికాకుండా చూసుకుంటే చాలామంచిది.

చాలావరకు ప్రతిఒక్కరూ ఆరోగ్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సమయానికి ఆహారం తీసుకోవడం, పనులకు వెళ్లేటప్పుడు సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. కానీ విశ్రాంతి గురించి అస్సలు పట్టించుకోరు. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ప్రస్తుత కాలంలో అయితే పగలు, రాత్రికి తేడాలేకుండా పనులు చేస్తుంటారు. అయితే ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. మనం మెదడుకు కనీసం 8 గంటలవరకైనా విశ్రాంతినివ్వాలని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలామంచిదంటున్నారు. దీంతో మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుందని వారు సలహాలు ఇస్తున్నారు.

మనం చేసే దైనందిన పనిలో పెద్దగా తేడా ఏమీ వుండదు. కాబట్టి ఏ పనిని ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే ప్రణాళికను సిద్ధం చేసుకుంటే మంచిది. ప్రతిరోజూ ఉదయాన్నే కనీసం గంటవరకు వ్యాయామం చేస్తే మంచిది. దీంతో మనం ఆరోగ్యవంతంగా వుండగలం. శారీరకంగా కూడా ఎటువంటి ఒత్తిడి వుండదు. అలాగే మనం పనిచేస్తున్న ప్రాంతాలలో వీలైనంతవరకు అందరితో స్నేహాపూర్వకంగా వుండాలి. అలా వుండడం వల్ల వారు మన పనులలో చేయూతనందిస్తారు. వీలైనంతవరకు మనలో కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుకోవాలి. ఆఖరిగా ముఖ్యమైంది సమయం. దీనిని సమర్థవంతంగా పాటిస్తే చాలావరకు మీ పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చనంటున్నారు నిపుణులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : organizing tips  office tips  stress free tips  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more