Health tips for those who doesnt sleep in the night

health tips, tip of the day, sleeping tips, sleeping pills, health tips telugu, telugu tips, sleeping tips, health tips telugu, telugu latest news, tip of the day telugu

health tips for those who doesnt sleep in the night : the simple health tips are available for those who doesn't sleep in the night.

సుఖమైన నిద్రకోసం సులువైన చిట్కాలు...

Posted: 09/11/2014 05:45 PM IST
Health tips for those who doesnt sleep in the night

మానవుని నిత్యజీవితంలో అవసరమయ్యే కార్యకలాపాల్లో అత్యంత ముఖ్యమైంది ‘‘నిద్ర’’. మనిషి తన దైనిందిన జీవితంలో ఎంత శ్రమిస్తాడో.. దానికి అనుగుణంగా అంతే ప్రశాంతతను తీసుకోవాలి. మనుష్యులు ఆరోగ్యంగా మెలగాలంటే నిద్రపోవడం ఎంతో అవసరం. ఆరోగ్యకరమైన దినచర్యలో ‘‘నిద్ర’’ ఎంతో ప్రాముఖ్యతను కలిగి వుంటుంది. శారీరపరంగాను, మానసికపరంగాను, భౌతికపరంగాను అనేక సమస్యల నుంచి దూరం చేస్తూ... ఒక ఔషధంలా పనిచేస్తుంది. మెదడును మరింత ఉత్తేజపరిచి, చురుకుగా అన్ని కార్యకలాపాల్లో పాల్గొనేందుకు సహాయపడుతుంది. కాబట్టి రోజువారి జీవితంలో కనీసం 7 నుంచి 9 గంటలవరకు నిద్రపోవడం తప్పనిసరి. శాస్త్రవేత్తలు కూడా తమ పరిశోధనల ద్వారా ఇవే మాటలను వెల్లడిస్తున్నారు.

అయితే కొన్ని సందర్భాలలో నిద్ర రాకపోవడం సహజం. ఎంత ప్రయత్నించినప్పటికీ నిద్ర రాదు. కళ్లు బరువుగా అనిపించి, నిద్రపోవాలనుకునే భావన మనసులో వున్నా... నిద్ర సామాన్యంగా రాదు. కొంతమందయితే రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఏవో పనులు చేసుకోవడం, పార్టీలలో ఎంజాయ్ చేయడం వంటివి చేస్తారు. అయితే ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో హానికరం. రాత్రివేళల్లో ఖచ్చితంగా నిద్రపోవాలి. నిద్ర కనుక సమయానికి రాకపోతే.. అందుకు కొన్ని సహజ మార్గాలలో చిట్కాలు అందుబాటులో వున్నాయి.

మెలటోనిన్...

నిద్రపోయేందుకు ప్రేరేపించే సహజమైన హార్మోన్. వీటి శాతం మానవ శరీరంలో తక్కువ అయినప్పుడు నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అటువంటి సందర్భాల్లో ఈ మెలటోనిన్ హార్మోన్ల సంఖ్యను పెంచుకుంటే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. వీటికి సంబంధించిన కొన్ని మందులు కూడా ప్రతిఒక్క మెడికల్ షాపులలో అందుబాటులో వుంటాయి. అయితే వీటిని ఒక ప్రణాళికబద్దంగా మాత్రమే ఉపయోగించాలి. దీనిని నిత్యం తీసుకుని అలవాటు చేసుకుంటే మాత్రం అనేక పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. 3 నుంచి 5 మిల్లీగ్రాముల వరకు వుండే ఈ మాత్రలను మూడురోజుల కొకసారి వేసుకుంటే మంచిది. ఈ మెలటోనిన్ హార్మోన్లు శరీర అలసటను దూరం చేసి, ప్రశాంతంగా వుండేందుకు సహాయపడుతుంది.

వ్యాయామం...

శరీరం ఎంత అలసిపోతుందో.. అంతే ఎక్కువగా నిద్ర వస్తుంది. ప్రస్తుతకాలంలో ఉద్యోగస్తులు ఎల్లప్పుడూ కుర్చీలలో కూర్చొని, కంప్యూటర్ ముందు కాలయాపన చేస్తుంటారు. దాంతో వారికి మానసిక ఒత్తిడి పెరుగడంతోపాటు, మెదడులో రకరకాల ఆలోచనలు మెదులుతూనే వుంటాయి. ఫలితంగా నిద్ర రాదు. అటువంటి సమయాల్లో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళలో వ్యాయామం చేస్తే ఎంతో ఆరోగ్యంకరం. వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోతుంది. మెదడులో వున్న ఆలోచనలన్ని తొలగిపోయి, ప్రశాంతతను కోరుకుంటుంది. ఫలితంగా నిద్ర అనుకోకుండానే వచ్చేస్తుంది.

ఆహారపు అలవాట్లు...

తాజాగా నిర్వహించిన పరిశోధనల ఆధారంగా.. చేపలు, చెర్రీలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా నిద్ర వస్తుందని వెల్లడిస్తున్నారు. ఎందుకంటే.. చెర్రీస్ లలో నిద్రకు సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్లు ఎక్కువగా వుంటాయి. అలాగే చేపలలో వుండే పోషక విలువలు మెదడును ప్రశాంతంగా వుంచేందుకు ప్రేరేపిస్తాయి. వీటితోపాటు వైన్ లేదా విస్కీ వంటి ఆల్కాహాల్ ను కూడా పరిమిత పరిమాణంలో తీసుకుంటే... నిద్ర వస్తుందని కొన్ని అధ్యయనాల ద్వారా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చదవడం లేదా రాయడం...

దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేటి కాలంలో వున్న విద్యార్థులు త్వరగా నిద్రపోవడానికి కారణం ఈ పుస్తకాలే! పుస్తకాలను తరచూ చదువుకోవడం వల్ల మనసులో వున్న భావోద్వేగాలు క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయి. అలాగే మన మనసులో వున్న భావాలను పుస్తకాల రూపంలో రాయడం వల్ల ప్రశాంతత కలుగుతుంది. ఇలా ప్రతిరోజు నిద్రపోయే ముందు అరగంటవరకు రాయడం లేదా చదవడం కాని చేస్తే... అనుకోకుండానే నిద్రలోకి జారిపోతారు.

సీమ చామంతి టీ...

ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి నిద్రపోవడానికి సహాయంగా టీ రూపంలో లేదా రసం రూపంలో ఉపయోగించడం జరుగుతోంది. అంతేకాదు.. ఇది పొట్ట, కలత, చర్మ వ్యాధుల మీద తన ప్రభావాన్ని చూపించి, వాటి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. అయితే పరిశోధనల ప్రకారం ఇది గర్భస్రావాలకు కారణం అవుతోందని శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. కాబట్టి గర్భంతో వున్న మహిళలు దీనిని తీసుకునే ముందు ఒకసారి వైద్యసలహాలు పాటిస్తే మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  sleeping tips  excercise  melatonin pills  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more