Saina Nehwal visits tirumala with parents

Saina nehwal offers prayers to tirumala balaji

indian ace shuttler saina nehwal, tirupati, tirumala, andhra pradesh, saina nehwal at tirupati, saina nehwal parents, saina parents, saina tirumala, saina balaji, saina prayers

Indian ace shuttler saina nehwal today visited tirumala tirupati devasthanam with her parents, offers her prayers to balaji.

తిరుమల శ్రీవారి సేవలో సైనా, తల్లిదండ్రులు

Posted: 12/25/2015 08:09 PM IST
Saina nehwal offers prayers to tirumala balaji

ఇండియన్ ఏస్ షట్లర్, ప్రపంచం నెంబర్ టు రాంకర్ సైనా నెహ్వాల్ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంది. తన తల్లిదండ్రులతో కలసి అమె తిరుమలకు చేరుకుని ప్రత్యక పూజలు నిర్వహించారు. వేకువ జామున బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా తమకు అద్భుతమైన శ్రీవారు (బాలాజీ) దర్శనం కల్పించినందుకు అమె ఆలయ అధికారులు శ్రీనివాస రాజు, ఎల్వీ సుబ్రహ్మణ్యంలకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయ ప్రాంగణాన్ని సందర్శించి, అక్కడి పిల్లలతో కాసేపు గడిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం ఉంటేనే బ్యాడ్మింటన్ క్రీడలో రాణిస్తారని తెలిపింది. ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పింది. సొంత శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉండాలని సైనా తెలిపింది. ఈ కార్యక్రమంలో సైనాతో పాటు ఏపీ క్రీడలు, యువజన శాఖ కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ కూడా పాల్గొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  tirupati  tirumala  andhra pradesh  

Other Articles