Nikhat Zareen accorded grand welcome at Airport స్వర్ణ పతక విజేత నిఖత్ జరీన్ కు హైదరాబాదులో ఘనస్వాగతం

Rousing reception for world champion nikhat zareen in hyderabad

Grand Welcome, Nikhat Zareen, Esha Singh, ISSF Junior World Cup, Sports Authority of Telangana State (SATS) chairman, Guguloth Soumya, Gokulam Kerala Women team, Indian Women’s League championship. Gokulam Kerala Women team, venkateshwar reddy, hyderabad, nikhat zareen, v srinivas goud, Hyderbad, Telangana

Nikhat Zareen, the newly-crowned world champion in the 52kg category, returned to Hyderabad to a rousing reception with Sports Minister V Srinivas Goud, Sports Authority of Telangana State (SATS) chairman A Venkateshwar Reddy and other association members receiving the boxer at the Rajiv Gandhi International Airport, on Friday.

బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు హైదరాబాదులో ఘనస్వాగతం

Posted: 05/27/2022 06:28 PM IST
Rousing reception for world champion nikhat zareen in hyderabad

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్​కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో క్రీడా శాఖ ఏర్పాట్లు చేసింది. నిఖత్​తో పాటు జర్మనీలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్​షిప్​లో గోల్డ్ మెడల్స్ సాధించిన సికింద్రాబాద్​కు చెందిన ఇషా సింగ్, ఫుట్​బాల్​ ప్లేయర్​ సౌమ్య​ కూడా హైదరాబాద్​ చేరుకున్నారు. ఈ ముగ్గురికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డితో పాటు శాప్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు.

మరోవైపు డప్పులు, ఒగ్గుడోలు, గిరిజన కళాకారులు తమ నృత్యాలతో అదరగొట్టారు. ఈ కార్యక్రమంలో యువతతో పాటు క్రీడా అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిఖత్ జరీన్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తనకు ఎంతో సహకరించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని టోర్నీలలో గెలిచి తెలంగాణే కాదు దేశానికే పేరు తీసుకువస్తానని తెలిపింది. తెలంగాణకు నిఖత్ జరీన్ ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా మంత్రులు కొనియాడారు.

ప్రపంచ ఛాంపియన్​గా నిలవడం మాములు విషయం కాదని.. ఎంతో కఠోర శ్రమ చేసిందని ప్రశంసించారు. ఇషా సింగ్, సౌమ్యలకు అభినందలు తెలిపారు. క్రీడాకారులకు తెలంగాణ సర్కార్ అండగా ఉంటుందని చెప్పారు. టర్కీ ఇస్తాంబుల్​లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్​లో 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్​ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్​ మెడల్​తో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పతకం గెలిచిన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. మొత్తం మీద ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో పసిడి గెలిచిన అయిదో భారత బాక్సర్‌గా నిలిచింది నిఖత్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles