50-yr-old differently abled Indian swims into Asian Records with one hand

Differently abled kerala swimmer sets record

Kerala swimmer sets record, 50-yr-old differently abled baburaj, 40 percent disability baburaj, Vembanad lake baburaj, treat me as record holder baburaj, tate and national events, Asian record title, International Wheelchair and Amputee Sports Federation (IWAS) World Games,Sochi, Russia

A 50-year-old differently abled Keralite has swum his way into the URF Asian Records.

రికార్డు క్రియేట్ చేసిన వికలాంగ కేరళ స్విమ్మర్ బాబురాజ్.

Posted: 12/22/2015 07:10 PM IST
Differently abled kerala swimmer sets record

కేరళ రాష్ట్రానికి చెందిన 50 ఏళ్ల వికలాంగుడు స్విమ్మింగ్‌ పోటీల్లో అదరగొట్టాడు. తన సత్తాచాటి రికార్డు క్రియేట్‌ చేశాడు. యూఆర్‌ఎఫ్‌ ఏషియన్‌ రికార్డుల్లో చోటు సంపాదించాడు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన ఈ అవార్డు సాధించడంతో ఆయన పేరు ఇప్పుడు కేరళలో మారుమ్రోగుతోంది. ఈడీ బాబురాజ్‌ అనే ఈ స్విమ్మర్‌ ఆగష్టు 18న జరిగిన పోటీల్లో 10 కిలోమీటర్లు సునాయాసంగా వెంబంద్‌ నదిలో ఈది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

40 శాతం వైకల్యం గల ఇతను ఈ ఘనత సాధించిన తర్వాత మరింత ఉత్సాహంతో ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి రికార్డు హోల్డర్‌గా తనని ప్రభుత్వం గుర్తించాలని కోరనున్నట్లు ఆయన తెలిపాడు. రాష్ట్రీయ, జాతీయ అవార్డు గ్రహీలకు ఇచ్చే గౌరవాన్ని తనకూ ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను కోరనున్నాడు. సమయానికి డబ్బులేని కారణంగా... బాబూరాజ్‌ గతంలో కొన్ని అంతర్జాతీయ ఈవెంట్లు మిస్‌ అయ్యాడు.

రష్యాలోని సోచిలో జరిగిన ఇంటర్నేషనల్‌ వీల్‌చైర్‌ స్పోర్ట్స్ ఫెడరేషన్‌ నిర్వహించిన పోటీల్లో పాల్గొనేందుకు 3 లక్షల రూపాయలు చేతిలో లేక ఆ టోర్నీకి వెళ్లలేకపోయాడు. రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగిన పోటీలన్నింటిలోనూ పాల్గొంటూ అవార్డులందుకున్నాడు.11 ఏళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో బాబూరాజ్‌ తన ఎడమ భుజాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం అతను ఎల్‌ఐసీ పాలసీలు అమ్మడం ద్వారా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asian Record books  URF Asian Records  Alappuzha  Baburaj  

Other Articles