Lakshya Sen joins Kidambi Srikanth in semis బీడ‌బ్ల్యూఎఫ్ ఛాంపియ‌న్‌షిప్‌ మెన్స్ సింగిల్స్: రెండు పతకాలు గ్యారెంటీ

Bwf world championships kidambi srikanth confirms india s first medal

BWF World Championships, lakshya sen, kidambi srikanth, Indian star shuttler, PV Sindhu, Pornpawee Chochuwong, Thailand, nemesis Tai Tzu Ying, Chinese Taipei, Kirsty Gilmour, Scotland, Quarter-finals, sports, Badminton

Twenty-year-old Lakshya Sen created history by becoming the youngest Indian to win a men's singles medal the World Championships. He will face Kidambi Srikanth in the last four stage. PV Sindhu, however, was dethroned by Tai Tzu Ying 17-21, 13-21 in the women's singles quarterfinal.

బీడ‌బ్ల్యూఎఫ్ ఛాంపియ‌న్‌షిప్‌ మెన్స్ సింగిల్స్: రెండు పతకాలు గ్యారెంటీ

Posted: 12/17/2021 09:31 PM IST
Bwf world championships kidambi srikanth confirms india s first medal

బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్‌ పతకం ఖాయం చేసుకున్నాడు. బీడబ్ల్యూసీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో పతకం సాధించిన మూడో భారతీయ క్రీడాకారుడిగా ఘనత సాధించాడు. నెదర్లాండ్స్‌ ఆటగాడు మార్క్ కాల్జివౌను 21-8, 21-7తో చిత్తు చేసిన కిదాంబి సెమ ఫైనల్ కు దూసుకెళ్లాడు. కెరీర్‌లో మొదటిసారి కాల్జివౌతో తలపడిన శ్రీకాంత్ తొలి నుంచీ దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

దీంతో ఆటపై చివరి వరకూ ఆయనే ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో కిదాంబికి పతకం ఖాయమైంది. అయితే బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంఫియన్ షిప్ ఫైనల్స్ లో శ్రీకాంత్ గెలిస్తే చరిత్రను తిరగరాస్తాడు. అలాకాకుండా ఒకవేళ శ్రీకాంత్‌ సెమీస్ లో ఓటమిపాలైనప్పటికీ కాంస్య పతకం మాత్రం ఖాయం. అయితే ఫైనల్ కు చేరుకుని బంగారు పతకం కొట్టాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పురుషుల పోటీల్లో ప్రకాశ్ పదుకొణె (1983), సాయి ప్రణీత్‌ (2019) మాత్రమే కాంస్య పతకాలను అందుకున్నారు. వీరి సరసన కిదాంబి శ్రీకాంత్‌ చేరతాడు.

ఇక డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా బ‌రిలో ఏకైక భారతీయ షెట్లర్ గా ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గోన్న సింధూ క్వార్టర్ ఫైనల్స్ లో తన పోరాటాన్ని ముగించింది. ప్రపంచ నెంబర్ వన్ చైనీస్ తైపీ తై జు యింగ్ చేతిలో ఓటమిపాలైంది. 42 నిమిషాలపాటు సాగిన పోరులో సింధు 17-21, 13-21తో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చిన సింధుకు ప్రత్యర్థి నుంచి ఓటమి తప్పలేదు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెట్‌ను తై జు కైవసం చేసుకుంది. రెండో సెట్‌లోనూ ప్రారంభంలో కాస్త ప్రతిఘటించినా.. ఆఖరికి సింధు చేతులెత్తేయడంతో తై జు విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles