India banned by FIFA, stripped of World Cup భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యను సస్పెండ్‌ చేసిన ఫిఫా

India banned by fifa stripped of u17 women s world cup hosting rights

football, federation internationale de football association, FIFA Council, football, All India Football Federation, serious violation, Undue Influence, Ministry of Youth Affairs and Sports, Third Parties, FIFA U-17 Women's World Cup, sports

FIFA, the apex football body announced that it has decided to suspend the All India Football Federation (AIFF) with immediate effect and the decision was taken unanimously by the Bureau of the FIFA Council. The decision has been taken due to undue influence from third parties, which constitutes a serious violation of the FIFA Statutes.

భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యను సస్పెండ్‌ చేసిన ఫిఫా

Posted: 08/16/2022 05:44 PM IST
India banned by fifa stripped of u17 women s world cup hosting rights

ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్‌ చేసింది. ‘‘థర్డ్‌ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్‌ బూర్యో ఏకగ్రీవంగా నిర్ణయించింది’’ అని ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ తన రోజువారీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణను తిరిగి పొందే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

సస్పెన్షన్‌ కారణంగా ఈ ఏడాది అక్టోబర్‌ 11-30 తేదీల్లో భారత్‌లో జరగాల్సిన ఎఫ్ఐఎఫ్ఏ (FIFA U-17) అండర్-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొన్నది. భారత్‌ నుంచి టోర్నీని మరో దేశానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. టోర్నీకి సంబంధించి తదుపరి చర్యలను అంచనా వేస్తున్నామని, అవసరమైతే కౌన్సిల్‌ బ్యూరోకు రెఫర్‌ చేయనున్నట్లు ఫిఫా తెలిపింది. ఈ మేరకు భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖతో నిరంతరం నిర్మాణాత్మక సంప్రదింపులు జరుపుతున్నామని, ఇందుకు సంబంధించి సానుకూల ఫలితం వస్తుందనే ఆశాభావంతో ఉన్నామని ఫిపా పాలకమండలి తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles