Lack of sponsors forces squash gold medallist to offer kidney for sale

Lack of sponsors forces squash gold medallist to offer kidney for sale

Ravi Dixit, Squash player Ravi Dixit, Squash player offers kidney on social media

Squash champion Ravi Dixit, a gold medallist in the 2010 Asian junior championships, has offered one of his kidneys for sale on social media to fund his participation in next month’s South Asian Games and subsequent tournaments.

ఆట కోసం కిడ్నీ అమ్మకానికి పెట్టిన ప్లేయర్

Posted: 01/12/2016 04:06 PM IST
Lack of sponsors forces squash gold medallist to offer kidney for sale

అవును... నిన్నటి దాకా మన దగ్గర క్రీడాకారులకు ఎంతటి దారుణమైన పరిస్థితి ఉందో అందరికి తెలుసు. గోల్డ్ మెడల్స్ సాధించిన వారు కూడా రోడ్డు పక్కన టీ కొట్టు, టిఫిన్ సెంటర్ లు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా మరో క్రీడాకారుడు తాను ఆడాలంటే డబ్బులు కావాలని కానీ తన దగ్గర అంత డబ్బులు లేవని చివరకు తన కిడ్నీనే అమ్మాకానికి పెట్టాడు. తాను ఇప్పుడు ఆడాలంటే డబ్బులు అవసరం అని అందుకే తాను కిడ్నీని అమ్మాకానికి ఉంచినట్లు అతడు వెల్లడించారు. అయితే ఆ క్రీడాకారుడు స్క్వాష్ క్రీడాకారుడు రవి దీక్షిత్. రవి దీక్షిత్ చాలా కాలంగా ఇండియా తరఫున ఎన్నో ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడాడు. అయితే ప్రస్తుతం తనను ఎవరూ స్పాన్సర్ చెయ్యడానికి ముందుకు రాకపోవడంతో ఇలా కిడ్నీని అమ్మాకానికి ఉంచినట్లు వెల్లడించారు.

రవి దీక్షిత్ తన ఫేస్ బుక్ పేజ్ లో కిడ్నీని అమ్మాకినిక పెడుతున్నట్లు పోస్ట్ చేశారు. అయితే తర్వాత ఆ పోస్ట్ ను తొలగించారు. ఆ పోస్ట్ లో రవి దీక్షిత్ ‘‘ నేను  సౌత్ ఏషియన్ గేమ్స్ కోసం ప్రాక్టీస్ చెయ్యడానికి కనీసం లక్ష రూపాయలైనా కావాలి. అందుకని నా కిడ్నీని అమ్మాకానికి ఉంచుతున్నాను. ఎమినిది లక్షలకు నా కిడ్నీని అమ్మకానికి ఉంచుతున్నాను’’ అని రాశాడు. గతంలొ తనను కొన్ని సంస్థలు స్పాన్సర్ చేశాయని కానీ అవి మాత్రం ఎంత కాలం సహాయం చేస్తాయని రవి దీక్షిత్ వెల్లడించారు. అయితే రవి దీక్షిత్ పోస్ట్ మీద తీవ్ర సంచలనం రేగింది. కొంత మంది రాజకీయ నాయకులు, కొన్ని సంస్థలు రవికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Dixit  Squash player Ravi Dixit  kidney  social media  

Other Articles