Telugu girl got bronze medal in compound archery asian games 2014

jyothy surekha, archery compound games, asian games, saina nehwal, kashyap, saina nehwal losses the games, saina nehwal jyothy surekha, indian compound archery game, trisha dev, purvasha sudhir shinde

telugu girl got bronze medal in compound archery asian games 2014 where saina nehwal losses in badminton semi finals

ఆసియా క్రీడల్లో మెరిసిన జూనియర్.. వెలిసిన సీనియర్!

Posted: 09/27/2014 01:42 PM IST
Telugu girl got bronze medal in compound archery asian games 2014

ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అమ్మాయిలు సరికొత్త చరిత్రను సృష్టించారు. ఒకవైపు పురుషుల విభాగంలో అబ్బాయిలందరూ వెనుదిరిగి వస్తుంటే.. మహిళలు మాత్రం స్వర్ణాలతో మెరవకపోయినా కాంస్య, రజత పతకాలతోనే భారతదేశ గౌరవాన్ని కాపాడుతున్నారు. విలువిద్యలో మహిళల విభాగంలో మన దేశానికి మొట్టమొదటి పతకాన్ని అందిచారు. ఈ విజయంలో మన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ పాత్ర చాలా వుంది. విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిపతం అందించింది. ఇదే విషయాన్ని ఆమె తండ్రి సరేంద్ర పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు.

17వ ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ లో భారతజట్టుకు కాంస్య పతకం వచ్చింది. జ్యోతి సురేఖతోపాటు త్రిషా దేవ్, పూర్వాషా సుధీర్ షిండే ఈ జట్టులో వున్నారు. మొదట్లో బాగానే రాణించి, సెమీ ఫైనల్ దాకా చేరుకున్న ఈ జట్టు.. చైనా చేతిలో ఓడిపోయింది. అయితే కాంస్య పతక పోరులో మాత్రం ముందంజ వేసింది. ఇరాన్ జట్టుతో తలపడిన భారత అమ్మాయిలు 224 పాయింట్లు స్కోర్ చేయగా.. ఇరాన్ జట్టు మాత్రం 217 పాయింట్లకే పరిమితం అయ్యింది. ఈ మొత్తం విభాగంలో దక్షిణ కొరియా స్వర్ణం, చైనా రజతం, ఇండియా కాంస్య పతకాలను సాధించుకున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. కాంపౌండ్ ఆర్చరీ అనే పోటీ తొలిసారిగా ఈ ఆసియా క్రీడల్లోనే మొదలైంది. అంటే.. మొదటిసారిగా జరిగిన పోటీల్లో మన భారత జట్టు మహిళలు కాంస్య పతకం గెలుచుకుని రావడం నిజంగా విశేషమే!

ఇలా ఈ విధంగా జూనియర్లు తమ ప్రతిభతో భారతగౌరవాన్ని కాపాడుతుంటే.. మరోవైపు సీనియర్లు మాత్రం ఆట మొదట్లోనే చతికిలపడిపోతున్నారు. ఇప్పటికే బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ లో కశ్యప్, శ్రీకాంత్ లాంటి గొప్ప ప్లేయర్లు ఓడిపోయి ఇంటిదారి పట్టగా.. సైనా నెహ్వాల్ కూడా క్వార్టర్ ఫైనల్ లోనే నిష్ర్కమించింది. దీంతో ఇంచియాన్ ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ఏ పతకం సాధించకుండానే ముగిసింది. 1982 ఆసియా క్రీడల తర్వాత ఇప్పటివరకు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకం నెగ్గలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సైనా 21-18, 9-21, 7-21తో రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. 2010 గ్వాంగ్‌జౌ ఆసియా క్రీడల్లోనూ సైనా క్వార్టర్స్‌లోనే ఓడింది. ఇక పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కశ్యప్ 12-21, 11-21తో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (వులేసియూ) చేతిలో; శ్రీకాంత్ 21-19, 11-21, 18-21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ వాన్ హో సన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jyothy surekha  saina nehwal  compound archery game  asian games 2014  kashyap  

Other Articles