Qatar women basketball team rejected to play match with mangolia team in asian games without burka

qatar women basket ballteam, mangolia women basketball team, asian games 2014, incheon asian games, asian games officials, qatar basketball team player amal mohammad, asian games problems, asian games sports persons

qatar women basketball team rejected to play match with mangolia team in asian games without burka

ఆసియా క్రీడల్లో ముస్లిం మహిళల ‘‘బురఖా’’ వివాదం..!

Posted: 09/25/2014 01:36 PM IST
Qatar women basketball team rejected to play match with mangolia team in asian games without burka

దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈసారి అనుకోకుండా కొన్ని వివాదాలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే ఈ వివాదాలకు కారణమవుతున్నది మరెవ్వరో కాదు.. స్వయంగా ఆ ఆటలను నిర్వహిస్తున్న అధికారులేనని క్రీడాకారులు పేర్కొంటున్నారు. ఆటలు మొదలయ్యే ముందు ఒక విధంగానూ.. మొదలైన తర్వాత మరోవిధంగానూ అధికారులు వ్యవహరిస్తున్నారని క్రీడాకారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ క్రీడల్లో పాల్గొన్న ముస్లిం మహిళలు కూడా ఇటువంటి ఆరోపణలనే అధికారుల మీద గుప్పిస్తున్నారు. ఈ వివాదాల వల్ల ఒక బాస్కెట్ బాల్ మ్యాచే ఆగిపోయింది.

అసలు జరిగిన విషయం ఏమిటంటే... ఆసియా క్రీడలకు వచ్చేముందు అధికారులు బురఖా ధరించడానికి తమకు హామీ ఇచ్చారని కతార్ క్రీడాకారిణి అమల్ మహ్మద్ చెప్పింది. కానీ తీరా మ్యాచ్ ఆడే సందర్భంలో బురఖా ధరించడానికి అధికారులు నిరాకరించారు. దీంతో కతార్ మహిళల బాస్కెట్ బాల్ జట్టు ఆసియా క్రీడల్లో మంగోలియాతో మ్యాచ్ ఆడేందుకు తిరస్కరించారు. ‘‘బురఖా తొలగించడానికి మా ముస్లిం మతం అనుమతించదు. అందుకే మంగోలియాతో మ్యాచ్ ను వదిలేసుకున్నాం. అధికారులు తమ నిర్ణయం మార్చుకునేంతవరకు ఈ క్రీడల్లో మ్యాచ్ లు ఆడబోము’’ అని అమల్ తెలిపింది.

మరోవైపు.. ఆసియా క్రీడల ప్రతినిధులు ఈ విషయం వెనకడుగు వేస్తున్నట్లు కనిపించడం లేదు. మ్యాచ్ కు ముందు బురఖా తొలగించాలని క్రీడాకారులను కోరామని.. అయితే అందుకు వారు తిరస్కరించడారని ఒక ప్రతినిధి చెప్పాడు. ‘‘ఇది అంతర్జాతీయ బాస్కెట్ సమాఖ్యకు సంబంధించిన విషయం. ఆసియా క్రీడలతో బురఖాతో ఎటువంటి సంబంధం లేదు’’ అని వివరంగా చెప్పకుండా ముగించేశారు. మరి ఈ వివాదం ఎంతవరకు కొనసాగుతుందో..? అధికారులు బరఖా ధరించడానికి అనుమతి ఇస్తారా..? లేదా ముస్లిం మహిళలే బురఖాలు తొలగించి క్రీడల్లో పాల్గొంటారా..? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles