Yogeswar dutt won gold medal in wrestling 65 kgs free style segment asian games 2014

yogeswar dutt, yogeswar dutt gold medal, yogeswar dutt wrestling, asian games 2014, sania mirza, indian sports persons asian games, indian players, indian women athletes

yogeswar dutt won gold medal in wrestling 65 kgs free style segment asian games 2014

ఆసియా క్రీడల్లో 28 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన భారత్!

Posted: 09/29/2014 04:40 PM IST
Yogeswar dutt won gold medal in wrestling 65 kgs free style segment asian games 2014

ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు మన భారత క్రీడాకారులు ఓ మోస్తరు వరకు తమ సత్తా చాటుకుంటూ ముందుకు వచ్చారు. ఒకవైపు చైనా 100కు పైగా స్వర్ణ పతకాలను సాధించి ముందుకు దూసుకుపోతుంటే.. ఇండియా మాత్రం ముక్కుతూ మూలుగుతూ ముందుకు సాగుతోంది. రజత, కాంస్య పతకాలను సాధించడంలో ఫర్వాలేదనిపించుకున్న భారత్.. స్వర్ణ పతకాలను సాధించడంలో చాలా వెనుకబడిపోయిందనే చెప్పుకోవాలి. ఇంతవరకు భారత్ కేవలం 4 స్వర్ణపతకాలను మాత్రమే గెలుచుకున్నప్పటికీ.. ఆ పతకాలను సాధించడంలో క్రీడాకారులు చరిత్రనే సృష్టించారని చెప్పుకోవాలి. మొదటి మూడు స్వర్ణపతకాల విషయం పక్కనపెడితే.. తాజాగా నాలుగో స్వర్ణాన్ని గెలుచుకోవడంలో రెజ్లింగ్ విభాగంలో యోగేశ్వర్ దత్ 28 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు.

1986 సియోల్ ఆసియా క్రీడల్లో కర్తార్ సింగ్ పసిడి గెలుచుకున్న తర్వాత భారత్ కు రెజ్లింగ్ లో స్వర్ణం రావడం ఇదే తొలిసారి. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ లో మొదటినుంచి బాగానే ప్రదర్శించిన యోగేశ్వర్.. సెమీఫైనల్లో కాస్త తడబడ్డాడు. ఒక దశలో 5-7తో ఓడిపోయే స్థితిలో వున్న దత్.. అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించాడు. ఇఖ ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించి 3-0తో జలీంఖాన్ (తజకిస్తాన్)ను చిత్తు చేశాడు. 2006 క్రీడల్లో కాంస్యం గెలిచిన దత్ కు ఇదే ఎంతో ఉత్తమమైన ప్రదర్శన. దీంతో ఇతను విజయం సాధించడంతో ఇండియా ఖాతాలోకి నాలుగవ స్వర్ణం చిక్కింది. అయితే రెజ్లింగ్ లో పురుషుల 97 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సత్యవర్త్కడియన్, మహిళల 55 కేజీల ఫ్రీస్టయిల్ లో బబితా కుమారిలు కాంస్య పతక మ్యాచుల్లో ఓడిపోయారు. ఇక జ్యోతి 75 కేజీల విభాగంలో క్వార్టర్స్ లోనే పరాజయం చవిచూసింది.

మిగతావారి విషయాలకొస్తే.. మహిళల 20 కి.మీ నడకలో కుశ్ బీర్ సంచలన విజయం సాధించింది. ఆసియా క్రీడల అథ్లెటిక్స్ లో 20 కి.మీ. విభాగంలో పతకం గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు సాధించింది. మరోవైపు పురుషుల 400 మీ. పరుగులో రాజీవ్ అరొకియా కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 400 మీ. పరుగులో పూవమ్మ కాంస్యం గెలిచింది. మహిళల హ్యామర్ త్రోలో మంజుబాలా కాంస్యం సాధించింది. ఇక హైదరాబాదీ సానియా మీర్జా కూడా తన సత్తా చాటుకుంది. మహిళల డబుల్స్ ప్రార్థనతో కలిసి కాంస్యం గెలిచిన సానియా.. తెలుగుతేజం సాకేత్ మైనేని తోడుగా మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్ చేరి రజతం ఖాయం చేసుకుంది. ఇలా ఒక్కొక్కొరు తమతమ ప్రతిభతో కాంస్యం, రజత పతకాలను గెలుచుకోవడంలో తమ ప్రతిభను బాగానే ప్రదర్శిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yogeswar dutt  sania mirza  asian games 2014  indian sports persons  telugu news  

Other Articles