XOLO and Gadgets360 together to launch 'Era HD Smartphone'

Xolo era hd with 5 inch display launched at rs 4777

android, mobiles, xolo, xolo era hd, xolo era hd price, xolo era hd price in india, xolo era hd specifications, xolo mobiles

Xolo has launched the Era HD smartphone in India. The new Xolo smartphone is now exclusively available via Gadgets 360 at a price of Rs. 4,777 in Rocky

స్మార్ట్ ఫోన్ ప్రియులకు చౌకధరలో ఎరా హెచ్ డి ఫోన్..!

Posted: 11/07/2015 04:24 PM IST
Xolo era hd with 5 inch display launched at rs 4777

స్మార్ట్ ఫోన్ ప్రియుల కోసం క్సోలో సంస్థ నుంచి మరో చౌకధర ఫోన్: అందుబాటులోకి వచ్చింది. భారత విఫణిలోకి ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ ఫోన్ ధర ఐదు వేల లోపే వుండటం అభిమానులకు ఆసక్తి రేపుతోంది. ఎరా హెచ్ డి పేరిట విడుదలైన ఈ స్మార్ ఫోన్.లో ఆకర్షణీయమైన ఫీచర్లు వున్నాయి. 'ఏరా హెచ్డీ' పేరిట క్సోలో దీన్ని విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలను ఈ కామెర్స్ ద్వారానే అందుబాటులోకి తీసుకువచ్చింది.

'గాడ్జెట్స్ 360' ద్వారా ఆన్ లైన్ మాధ్యమంగా దీన్ని పొందవచ్చు. 5 అంగుళాల స్క్రీన్, 720/1280 హై డెఫినిషన్ పిక్చర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, వెనుకవైపు 8 ఎంపీ, ముందు 5 ఎంపీ కెమెరాలు, 1.2 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 గిగాబైట్ల మెమొరీ తదితర ఫీచర్లను సంస్థ ఈ ఫోన్ లో పోందుపర్చింది. కాగా ఈ ఫోన్ ధర రూ. 4,777 మాత్రమేనని సంస్థ వెల్లడించింది. ఇందులోని బ్యాటరీ 556 గంటల స్టాండ్ బై సామర్థ్యాన్ని కలిగివుంటుందని క్సోలో పేర్కొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : xolo era hd  android  mobiles  smart phone  

Other Articles