Tata Tiago EV launched: Price, specs and other details టాటా టియాగో ఈవీ వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు ఇలా..

Tata tiago ev with 315km range launched in india price starts at rs 8 49 lakh

Tata Tiago EV, Tata Tiago EV launch, Tata Tiago EV price, Tata Tiago EV range, Tata Tiago EV charging, Tata Tiago EV variants, Tata Tiago Ev Price, Tata Motors, Tata Tiago EV, Tigor EV, Nexon EV, electric vehicles

Tata Motors launched its Tiago EV with introductory prices for first 10,000 customers ranging between Rs 8.49-11.79 lakh (ex-showroom). The Tata Tiago EV will be available in four trims: XE, XT, XZ+ and XZ+ Tech Lux. The hatchback comes with two distinct battery set-ups, driving modes and connected car telematics across the trims.

టాటా టియాగో ఈవీ వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు ఇలా..

Posted: 09/29/2022 08:38 PM IST
Tata tiago ev with 315km range launched in india price starts at rs 8 49 lakh

విద్యుత్‌ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్‌ భారత మార్కెట్లో మరో విద్యుత్‌ కారును లాంచ్‌ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇందులో 19.2kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 24 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.9.09 లక్షలు నుంచి మొదలవుతుంది. అయితే, తొలి 10 వేలమంది కస్టమర్లకే ఈ ధర అని పేర్కొంది. ఆ తర్వాత ధర ఎంత ఉంటుందనేది కంపెనీ  వెల్లడించలేదు. అక్టోబర్‌ 10 నుంచి వీటి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది.

ఇక కారు స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. 19.2kWh ఆప్షన్‌తో వస్తున్న వేరియంట్‌ 3.3 kW AC ఛార్జర్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. సింగిల్‌ ఛార్జ్‌తో ఈ కారు 250 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. 24 kWh బ్యాటరీ వేరియంట్‌ కారు 7.2 kW ఏసీ ఛార్జర్‌తో వస్తోంది. ఇది బ్యాటరీని 3.36 గంటల్లోనే ఫుల్‌ ఛార్జ్‌ చేస్తుందని తెలిపింది. డీసీ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం ఛార్జ్‌ అవ్వడానికి 57 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది. ఫుల్‌ ఛార్జ్‌తో ఈ కారు ద్వారా 315 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. ఇది కేవలం 5.7 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.

టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఎలక్ట్రిక్‌ ORVMs, క్రూజ్‌ కంట్రోల్‌, స్టార్ట్‌/స్టాప్‌ పుష్‌ బటన్‌, లెదర్‌ సీట్స్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సిటీ, స్పోర్ట్‌ డ్రైవింగ్‌ మోడ్స్‌ ఇస్తున్నారు. రిమోట్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ కంట్రోల్‌, రిమోట్‌ జియో ఫెన్సింగ్‌, వెహికల్‌ ట్రాకింగ్‌ వంటి మొత్తం 45 కనెక్ట్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి. ఈ విద్యుత్‌ కార్లలో వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి రూ.1100 ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల (ఏది ముందైతే) వారెంటీ ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tata Tiago Ev Price  Tata Motors  Tata Tiago EV  Tigor EV  Nexon EV  electric vehicles  tata motors  

Other Articles