Royal Enfield Electric Motorcycles To Soon Make Debut? సౌండ్ లేకుండా బుల్లెట్ బండి.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ త్వరలో..!

Royal enfield electric motorcycles to soon make debut

Auto news India royal enfield, electric scooter, electric royal enfield, electric bullet, electric bikes, bullet, royal enfield EV, electric Royal Enfield, Auto news, Cars, Bikes, Automobile news, Electric Vehicles news

Royal Enfield is said to be working on many new electric motorcycles for the global market, first bike likely to debut in 2025. Royal Enfield is currently enjoying strong demand in the Indian market and is aggressively updating its line-up for buyers. If reports are to be believed, Royal Enfield is currently developing new electric motorcycles for the market.

సౌండ్ లేకుండా బుల్లెట్ బండి.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ త్వరలో..!

Posted: 09/06/2022 09:33 PM IST
Royal enfield electric motorcycles to soon make debut

రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. భవిష్యత్తులో నిశబ్దంగా దూసుకెళ్లే బుల్లెట్ బైక్‌లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ తమ బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వార్తలు ఎన్నో వినిపించినా.. తాజాగా కొన్ని నివేదికలు వీటిని నిజమని సూచించడంతో నిశ్భద్ద బులెట్ల కోసం అభిమానుల నిరీక్షణలు కొనసాగుతున్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బుల్లెట్ రాబోతుందని గత రెండు, మూడేళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకే మార్కెట్ ఉండే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని లిమిటెడ్ ఎడిషన్‌లో అయినా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకురావాలని కంపెనీ ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. 2025 ద్వితీయార్థంలో లేదా 2026 ప్రారంభంలో ఆర్ఈ ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్ మార్కెట్లోకి రానున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

మరి భవిష్యత్తులో వచ్చే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ ఎలా ఉండవచ్చు? ఎన్ని కిలోమీటర్ల రేంజ్ అందివ్వగలవు అనే అంశాలపైనా కొన్ని అంచనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ మోటార్ కెపాసిటీ కూడా పెట్రోల్ బైక్ మోడళ్లలో ఉన్నట్లుగా 350cc నుంచి 650cc వరకు సమానమైన మోటారు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శక్తివంతమైన టార్క్‌తో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అదే మొత్తంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ ఈ బైక్ మెయింటెన్స్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ (ఈవీ) కూడా లాంగ్-రేంజ్ అందించే సౌకర్యవంతమైన బైక్‌గా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన 10kwh బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిమీ నుంచి 500 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. ఛార్జ్ చేయడానికి సుమారు 8-10 గంటలు పడుతుంది అని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను ఐషర్ మోటార్స్ తయారు చేస్తుంది. ఎలక్ట్రిక్ బుల్లెట్ ఊహాగానాల నేపథ్యంలో కంపెనీ వర్గాలు ఒక ఏజెన్సీతో మాట్లాడుతూ హై-ఎండ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మోడళ్లపై కస్టమర్ల అంచనాలను ఇంకా అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles