Nifty ends below 8000 on Fed comments; Bihar exit polls eyed

Nifty tests important support ahead of key election results

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Sensex and Nifty closed at 5-week lows after the US Federal Reserve Governor reiterated the possibility of raising interest rates in December, while caution ahead of Bihar state exit polls accelerated the selloff.

సూచీలకు భారీ నష్టాలు.. 8 వేల పాయింట్లకు దిగువన నిఫ్టీ

Posted: 11/05/2015 06:26 PM IST
Nifty tests important support ahead of key election results

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో భారత మార్కెట్లు ఇవాళ పతనాన్ని చవిచూశాయి. నిఫ్టీ ఎనమిది వేల పాయింట్లకు దిగువన ట్రేడింగ్ ముగించిడం కొసమెరుపు. ఫలితంగా మార్కెట్ ఇవాళ ఐదువారాలా కనిష్టస్థాయికి పడిపోయాయి. అగ్రరాజ్యం అమెరికా కేంద్రీయ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు గవర్నర్ డిసెంబర్ మాసంలో వడ్డీ రేట్లను పెంచవచ్చని ఇచ్చిన సంకేతాలకు తోడు, బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న సందిగ్ధావస్థలో మదుపరులు అమ్మాకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలను ఎదుర్కోన్నాయి.

ఈ ఆలోచనలు ఇన్వెస్టర్లను నూతనంగా ఈక్విటీల కొనుగోళ్లకు దూరం చేశాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్ ఒక శాతం వరకూ నష్టపోగా, నిఫ్టీ కీలకమైన 8 వేల పాయింట్ల కన్నా కిందకు జారింది. డిసెంబరులో జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్లను పెంచే అంశాన్ని పరిశీలించనున్నామని అమెరికా ఫెడ్ రిజర్వు నుంచి సంకేతాలు వెలువడటంతో దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లన్నింటిపైనా కనిపించింది. పలు ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నాటి సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 248.72 పాయింట్లు పడిపోయి 0.94 శాతం నష్టంతో 26,304.20 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 84.75 పాయింట్లు పడిపోయి 1.05 శాతం నష్టంతో 7,955.45 పాయింట్ల వద్దకు చేరాయి.

మొత్తం 2,815 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 900 కంపెనీలు లాభాలను, 1,798 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో బ్యాకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, ఐటీ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రామిక సూచీలు భారీ నష్టాలను చవిచూడగా, కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంజీసీ, ఆయల్ అండ్ గ్యాస్ సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. ఇవాళ అన్ని సెక్టార్లు నష్టాలలోనే పయనించాయి. ఈ నేపథ్యంలో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, హీరో మోటో, ఆసియన్ పెయింట్స్, బీపీసీఎల్ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, సన్ ఫార్మా, వీఈడీఎల్, టాటా స్టీల్, బీహెచ్ఈఎల్, భారతీ ఎయిర్ టెల్ తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles