Corrit Electric Launches Hover 2.0 And Hover 2.0+ E-Bikes కోరిట్ ఎలక్ట్రిక్ నుంచి ఫ్యాట్ టైర్లతో ఈవీ బైక్స్ విడుదల..

Corrit electric launches hover 2 0 and hover 2 0 e bikes

auto news, bikes, Corit Electric Scooter, Corit Hover 2.0, Corrit, electric, electric scooter, ELECTRIC VEHICLE, Electric Vehicle Start-up, electric vehicles, Global News, globe news insider, Hindi News, Hindustan, Hover, International News, latest news, launched, EV Trending, Trending news

Electric vehicle (EV) start-up Corrit Electric has launched two new low-speed electric bikes in the Indian market. The names of these e-bikes are Hover 2.0 and Hover 2.0+. You will be able to buy these electric bikes in four color options Red, Black, White and Yellow. Hover 2.0 is priced at Rs 79,999 and Hover 2.0+ is priced at Rs 89,999.

కోరిట్ ఎలక్ట్రిక్ నుంచి ఫ్యాట్ టైర్లతో ఈవీ బైక్స్ విడుదల.. రెండు వేరియంట్లలో..

Posted: 08/24/2022 04:44 PM IST
Corrit electric launches hover 2 0 and hover 2 0 e bikes

గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ రెండు మోడల్స్ ఒరిజినల్ హోవర్ స్కూటర్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్లుగా చెప్పవచ్చు. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉన్నాయి. డిమాండ్, యూజర్ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోరిట్ కంపెనీ తమ మొట్టమొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ మాల్‌లో ప్రారంభించింది.

మార్చి 2023 నాటికి దేశవ్యాప్తంగా 50 ఆఫ్‌లైన్ డీలర్‌షిప్‌లకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది. కోరిట్ హోవర్ 2.0 ధర రూ. 79,999/- కాగా, హోవర్ 2.0+ ధర రూ. 89,999/- గా నిర్ణయించారు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు రెడ్, బ్లాక్, వైట్ అలాగే ఎల్లో వంటి నాలుగు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. ఇవి లో-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు కాబట్టి ఈ రెండు బైక్‌ల గరిష్ట వేగం గంటకు 25 కిమీ మాత్రమే. అయితే కేవలం 3 సెకన్లలో 0-25 km/h వేగాన్ని అందుకోగలవు. సిటీలలో అయినా, గ్రామాల్లో అయినా తక్కువ దూరాలకు ప్రయాణించేందుకు ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి.

బేసిక్ మోడల్ హోవర్ 2.0లో 1.5 kWh బ్యాటరీని అమర్చారు. ఇది పూర్తి ఛార్జ్‌లో 80 కిమీల ప్రయాణ పరిధిని అందించగలదు. అదేవిధంగా మరొక మోడల్ హోవర్ 2.0+లో 1.8KWh బ్యాటరీని అమర్చారు. ఇది పూర్తి ఛార్జ్‌లో 110 కిమీల ప్రయాణ పరిధిని అందించగలదు. ఫీచర్ల విషయానికొస్తే, కోరిట్ హోవర్ 2.0 అలాగే 2.0+ రెండింటిలో సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కాంబినేషన్ స్విచ్, మెరుగైన లాక్ సిస్టమ్‌, యాంటీ-థెఫ్ట్ అలారం, ఇగ్నిషన్, జియోఫెన్సింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా హోవర్ 2.0+లో కస్టమ్ బైక్ కవర్‌లు, మొబైల్ హోల్డర్‌లను కలిగి ఉంది. హోవర్ 2.0 కోసం వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles