Stock markets getting high profits than gold in 2014

stock markets getting high profits than gold in 2014 by the market analysts, stock markets in india, stock markets profits, gold prices in india, stock markets better than gold, sensex stock market profit, gold profits in india, stock markets getting profits, stock markets with gold, stock market profits and gold prices in india, silver prices india, silver prices hike in india, gold prices getting down in dina

stock markets getting high profits than gold in 2014 by the market analysts

స్టాక్ మార్కెట్ల ముందు బంగారం పనికిరాదట!

Posted: 07/30/2014 12:59 PM IST
Stock markets getting high profits than gold in 2014

ప్రస్తుతం ఈ ఏడాదిలో బంగారం విలువ పూర్తిగా తగ్గిపోయిందని కొన్ని సర్వేల ప్రకారం తెలియజేస్తున్నారు నిపుణులు. బంగారంతో వచ్చిన లాభాల కంటే స్టాక్ మార్కెట్లే ఎంతో మేలని వారు తేల్చి చెబుతున్నారు. ఈ సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు, బంగారంకంటే మంచి ఆదాయాన్ని రాణించడమే కాకుండా... ఆర్థిక సంవత్సరానికి ఎంతగానో తోడ్పడుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఇందులో బీఎస్ఈ సెన్సెక్స్ 22.76 శాతం దాకా దూసికెళితే.. బంగారం ధరలు దాదాపు 5 శాతం వరకు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే వెండి మాత్రం కొంతమేరకు అంటే 2.38 శాతంమేరు వేగం పుంజుకుంది.

మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. దేశీయ మదుపర్ల సెంటిమెంట్ మెరుగుపడటంతోపాటు విదేవీ మదుపర్ల నుంచి భారీ నిధులు రావడం వల్ల భారత మార్కెట్లు లాభాలపంటను పండించాయి. సాధారణంగానే స్టాక్ మార్కెట్లు, బంగారు ధరలు విలోమానూపాతంలో ప్రవర్తిస్తాయి. అంటే బంగారం ధరలు పెరిగితే మార్కెట్లు పడిపోవడం... మార్కెట్లు రాణిస్తే బంగారం ధరలు తగ్గడం వంటివి జరుగుతుంటాయి. అయితే ద్రవ్యోల్బణం వంటి కష్టాలను అధిగమించడం కోసమే మదుపర్లు బంగారంవైపు అడుగులు వేస్తుంటారు.

దశాబ్దకాలంలో స్టాక్ మార్కెట్ల కంటే ముందుకు దూసుకుపోయిన బంగారం వరుసగా రెండేళ్లలో మాత్రం వెనుకడుగు వేసింది. 2013 డిసెంబర్ 31నాటికి బంగారం ధర రూ.29,800, వెండి కిలో రూ.43,755 వద్ద వుండగా.. తాజాగా సోమవారం నాడు (2014 జూలై 28) బంగారం ధర రూ.28,370, వెండి కిలో రూ.44, 8000 వద్ద నిలిచాయి. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే.. 2013 డిసెంబర్ 31న 21,170.68 వద్ద స్థిరపడగా.. జూలై 25న 26,300.17తో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని నమోదు చేసుకుంది.

2014 సంవత్సరం మొదలైన ఆరంభం నుంచి ఇప్పటివరకు విదేశీ మదుపర్లు నికరంగా 25.5 బిలియన్ డాలర్లు (రూ.1.53 లక్షల కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే సెన్సెక్స్ 9 శాతం వరకు ప్రతిఫలాలను అందించగా.. బంగారం, వెండి ధరలు 3,4 శాతాల మేర వున్నాయి. అలాగే 2012లో సెన్సెక్స్ 25 శాతంతో దూసుకెళ్లగా.. బంగారం, వెండి ధరలు 12.95, 12.84 శాతం వరకు పెరిగాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles