Tata teleservices introduces new offers to subsribers

Tata teleservices introduces new offers to subsribers, tata teleservices, tata indicom news, tata indicom new offers, tata indicom users and subsribers, tata indicom news, tata indicom subscribers

new offers to tata indicom subscribers

టాటా ఇండికాం యూజర్లకు శుభవార్త!

Posted: 07/21/2014 04:28 PM IST
Tata teleservices introduces new offers to subsribers

టాటా ఇండికాం యూజర్లకు శుభవార్త! ఢిల్లీలో టాటా టెలిసర్వీసెస్ వారి బ్రాండ్ అయిన సీడీఎమ్ఏ (CDMA).. వినియోగదారులకోసం అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఇకనుంచి అన్ని ఎస్టీడీ, లోకల్ కాల్స్ ప్రతిక్షణానికి కేవలం 1 పైసా మాత్రమే ఛార్జ్ చేస్తున్నట్టు సదరు సంస్థ ప్రకటనను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఒక పే రసీదును కూడా విడుదల చేసింది.

ప్లాన్ ఓచర్ 91 (PV 91) ప్రకారం... చందాదారులు అన్ని స్థానిక, ఎస్టీడీ కాల్స్ ను క్షణానికి కేవలం 1 పైసా మాత్రమే చెల్లించుకోవచ్చు. అలాగే ఎక్స్ ట్రా టాక్ టైమ్ కు సంబంధించిన ఆపర్లతోపాటు ఆరునెలల వరకు మెసేజ్ ఆఫర్లను వినియోగించుకునే విధంగా ఈ ప్లాన్ ను తెరమీదకు తీసుకొచ్చినట్టు సదరు కంపెనీ స్టేట్ మెంట్ ఇచ్చుకుంది. ఈమేరకు ఎంబీయూ హెడ్ అయిన అజిత్ చతుర్వేది ఢిల్లీలో వుండే టాటా ఇండికాం ఆఫీసులో... ‘‘చందాదారులకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను కల్పించడం కోసం ఈ PV 91 చాలావరకు సహకరిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

PV 91 టాటా ఇండికాం నెట్ వర్క్ ను కొనుగోలు చేసుకునే కొత్త చందాదారులకు అందుబాటులో వుంటుంది. వారు ప్రవేశపెట్టిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే... టాటా కంపెనీ ఆధ్వర్యంలో వున్న టాటా డొకొమోకు ఏకీకృత బ్రాండ్ నేమ్ ను ఇవ్వడంతోపాటు వాటిని వినియోగిస్తున్న వినియోగదారులకు ఇంటిగ్రేటెడ్ టెలికాం పరిష్కారాలను నిర్వహిస్తోంది. అలాగే జీఎస్ఎమ్, సీడీఎంఏ, 3జీ సాంకేతిక వేదికలకు వైర్ లైస్ నెట్ వర్క్ లను నిర్వహిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles