Apple pay turns iphone into credit card

i phone 6, wallet, credit card

Get ready to leave your wallet at home and pay for everything with your iPhone 6.

సకల చెల్లింపులకు క్రెడిట్ కార్డు ఐ ఫోన్-6

Posted: 09/15/2014 05:14 PM IST
Apple pay turns iphone into credit card

ఫ్రపంచ స్మార్ట్ ఫోన్  ప్రేమికులను ఎప్పటినుంచో ఊరిస్తున్న ఐ ఫోన్ 6 వచ్చేసింది. అయితే ఇది అక్టోబర్ మాసంలో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది. తాజాగా యాపిల్ సంస్థ ఈ ఫోన్ ను ఆవిష్కరించింది. అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ నూతన ఫోన్ ను ప్రదర్శించారు. పర్సుతో అవసరం లేకుండా అన్ని రకాల చెల్లింపులను కేవలం ఐ ఫోన్-6 ద్వారానే చెల్లించుకునే సౌలభ్యం ఐ ఫోన్-6లో వుంది. ఇప్పుడు ఈ ఫోనును వైర్ లెస్ డిజిటల్ వాలెట్ గా అభివర్ణిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అత్యంత అధునాతన అప్షన్లతో వచ్చిన తొలితరం ఫొన్లతో పొల్చితే చాలా రెట్లు అభివృద్ది చెందిన సాంకేతిక పరిజ్ఞానం ఇమిడి వుంది. జేబులో బడ్డులు పెట్టుకుని తిరగలేమని బాధపడే వారు, సమీపంలో ఏటీయం సెంటర్ల లేవనే వారు ఇక ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. మీ చేతి బోటన వేలును ఐడీ పెట్టుకుని డబ్బు చెల్లింపులను జరిపే అవకాశం మీకు ఐ ఫోన్-6 కల్సించనుంది.

పే విత్ అపిల్ పే అప్షన్లు వినిగించి డబ్బు చెల్లింపులు చేసుకునే వెసలుబాటును ఈ అత్యాధునిక ఫోన్ లో కల్పించారు. డబ్బులు చెల్లించే ఆప్షన్ ను నొక్కి.. దానిపై బోటన వేలును పెడితే బీప్ శబ్బం వస్తుంది. శబ్దం రాగానే డబ్బులు చెల్లించినట్లు మీ ఫోన్ కు మెసేజ్ కూడా వస్తుంది. నిజానికి ఈ అప్షన్ నోక్కగానే చిన్నపాటి రేంజ్ రేడియో తరంగాల ద్వారా ఫోన్ లో అమర్చిన చిన్నటి చిఫ్ గుండా తరంగాలు చెల్లింపులు జరిపే వ్యక్తి వద్దనున్న ఎన్.ఎఫ్.సి కి చేరుతాయి. దీంతో చెల్లింపులు అన్ని జరుగుతాయి. అమెరికాలో సుమారు 2 లక్షల ఇరవై దుకాణాదారులు ఎన్.ఎఫ్.సి ని అమర్చుకుని ఈ పద్దతి ద్వారా చెల్లింపులను చేపడుతున్నారు. ఐ ఫోన్-6 ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో రాగానే.. ఈ తరహాలో చెల్లింపులు జరిపేందుకు అందరు దుకాణాదారులు పోటీ పడతారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది సురక్షితం

అభద్రతాభావంతో డబ్బులు పట్టుకుని తిరగలేమని భావించే వారు, ఏటీఎం కోసం కిలోమీటర్ల మేర వెళ్లాలని భావించే వారికి ఐఫోన్ 6 తరుణోపాయంగా నిలుస్తోంది. ఇక మరో రకంగా చెప్పాలంటే క్రెడిట్ కార్టు చోరికి గురై..కాకతాళీయంగా దోంగ కోట్టిన నెంబరు మీ పిన్ నెంబరును ఒక్కటే అయితే.. మీ డబ్బులు గోవింద.. అదే ఐ..ఫోన్ -6 ద్వారా అయితే మీ ఫోన్ పోయినా.. దోరికిన వారు ఫొన్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపలేరు. ఎందుకంటే వారికి మీ బొటన వేల్రు దొరికదు కాబట్టి. అదే మీ సీక్రెట్ కోడవుతుంది కాబటి.. సో ఫ్రెండ్స్ బుక్ యుర్ ఐ ఫోన్-6 రైట్ నౌ.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i phone 6  wallet  credit card  

Other Articles