Airasia india tata propose joint airline

Tata Group- AirAsia Joint Venture, aviation, airplane, aircraft, helicopter, travel, transport, air, airlines

Asia largest low-cost carrier AirAsia on Wednesday announced plans to invest in an airline joint venture with India giant Tata conglomerate and another party.

AirAsia-India Tata propose joint airline.png

Posted: 02/21/2013 12:09 PM IST
Airasia india tata propose joint airline

air-asiaటాటా కంపెనీ... ఈ కంపెనీ ప్రతివస్తువును సామాన్యులకు అతి తక్కువ ధరకు అందించాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఉద్దేశ్యంతో వివిధ రంగాల్లో టాటా తన హవాను కొనసాగిస్తుంది. ఇక స్వాతంత్ర్యం రాకముందే ప్రజలకు విమాన యోగాన్ని కల్పించిన వారిగా ఘనతకెక్కారు టాటాలు. జేఆర్‌డీ టాటా నేతృత్వంలో టాటా ఎయిర్‌లైన్స్‌గా మొదలై... తర్వాత ఎయిరిండియాగా పేరు మార్చుకున్న ఈ కంపెనీ... ప్రభుత్వ గూటికి చేరడంతో క్రమంగా టాటాలు విమానయాన రంగానికి దూర మయ్యారు. ఇప్పుడు దాదాపు ఆరు దశాబ్దాల తరువాత టాటాలు మళ్లీ విమాన రంగంలో అడుగుపెట్టబోతున్నారు. మలేసియాకు చెందిన చౌక ధరల విమానయాన దిగ్గజం ఎయిర్ ఏషియాతో . టాటా గ్రూప్‌ జత కట్టి భారత్ లో కొత్త ఎయిర్ లైన్స్ ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఏయిర్ ఏషియా ప్రకటించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే... టాటా-ఎయిర్ ఏషియా జేవీ తన విమానయాన కార్యకలాపాలను చెన్నై నుంచి నిర్వహించే ప్రణాళికల్లో ఉంది. ఎయిర్ ఏషియాకు 49 శాతం మెజారిటీ వాటా ఉండే ఈ ప్రతిపాదిత జేవీలో టాటా గ్రూప్‌నకు 30 శాతం, భాటియాకు చెందిన హిందుస్థాన్ ఏవియేషన్‌కు 21 శాతం చొప్పున వాటాలు ఉండేలా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఏదైతేనేం మళ్లీ టాటాలు విమానరంగంలోకి రాడంతో సంతోషకరమైన విషయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Five hundred rupees note
Mahindra satyam buys 51 stake in brazilian firm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles