Sensex hits 20000 in trade

Tata Consultancy Services,Sensex,SBI,ONGC,nifty,ITC,Infosys,ICICI bank,GAAR,BSE,Bharti Airtel,Airtel

After breaching the 20,000-mark twice during trading, the BSE benchmark Sensex today finally closed at a tad lower at 19,986.82

Sensex hits 20000 in trade.png

Posted: 01/16/2013 08:28 PM IST
Sensex hits 20000 in trade

sensexపన్నుల ఎగవేతను నిరోధించే చట్టం(గార్) అమలును కేంద్ర ఆర్థిక శాఖ 2016 వరకూ వాయిదా వేయడంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. దీనికితోడు ఐటీ దిగ్గజం టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు కూడా సెంటిమెంట్‌కు బూస్ట్‌నిచ్చాయి. మరోవైపు డిసెంబర్ నెల ద్రవ్యోల్బణం కొంత అదుపులోకి రావడంతో రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల తగ్గింపును చేపడుతుందన్న అంచనాలు మెరుగుపడ్డాయి. వెరసి సోమవారం 243 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్ మంగళవారం మరో 80 పాయింట్లు లాభపడింది. 19,987 వద్ద ముగిసింది. కాగా, ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల అండతో మంగళవారం ట్రేడింగ్‌లో మిడ్ సెషన్‌లో ఒకసారి, చివర్లో మరోసారి 20,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సెన్సెక్స్ గరిష్టంగా 20,037ను తాకింది. ఇక నిఫ్టీ కూడా రెండు రోజుల్లో 105 పాయింట్లు బలపడి 6,057 వద్ద స్థిరపడింది. మార్కెట్లకు ఇది రెండేళ్ల గరిష్టం! ఇంతక్రితం 2011, జనవరి 6న మాత్రమే ఇండెక్స్‌లు ఈ స్థాయిలో నిలిచాయి! ప్రభుత్వం గార్‌ను వాయిదా వేయడానికితోడు, ద్రవ్యోల్బణం ఉపశమించడంతో ఈ నెల 29న పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల తగ్గింపు చర్యలను ప్రకటిస్తుందన్న అంచనాలు మార్కెట్లకు బలాన్నిచ్చాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deccan chronicle posts rs1040 cr loss
Mukesh ambani 18th richest man in world  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles