భారత కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 18వ స్థానం దక్కించుకున్నారు. 2012లో ఆయన వ్యక్తిగత సంపద సుమారు 2,470 కోట్ల డాలర్లుగా లెక్కతేలింది. ప్రపంచంలో 100 మంది అత్యంత సంపన్నుల జాబితాను రోజువారీ రూపొందించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఏడాది ప్రపంచ కుబేరుల్లో చోటు దక్కించుకున్నారు. సంపద 2,100 కోట్ల డాలర్ల నుంచి 2,470 కోట్ల డాలర్లకు పెరగడంతో ముకేశ్ 19వ స్థానం నుంచి 18వ స్థానానికి చే రారు.ప్రపంచంలో టాప్ 100 బిలియనీర్ల సంపద 2012లో దాదాపు 15 శాతం పెరిగి 1.81 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఈ జాబితాలో మెక్సికన్ టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం టెల్మెక్స్ చైర్మన్ కార్లోస్ స్లిమ్ 7,640 కోట్ల డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫ్యాషన్ రిటైలింగ్ సంస్థ జారా వ్యవస్థాపకుడు ఆమాన్చియో ఓర్టెగా వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ నాలుగో స్థానంలోనూ, ఐకియా వ్యవస్థాపకుడు ఇంగ్వర్ కాంప్రాద్ అయిదో స్థానంలో నిల్చారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more