Deccan chronicle posts rs1040 cr loss

Deccan Chronicle Holdings, company information, losses,media,newspaper and magazine,Deccan Chronicle Holdings, DHCL, Deccan Chronicle financial crisis

Deccan Chronicle Holdings Limited's total income fell by 63 per cent to Rs 149 crore for the quarter under review, compared to Rs 238 crore in the second quarter last year.

Deccan Chronicle posts Rs.1040 cr loss.png

Posted: 01/23/2013 05:00 PM IST
Deccan chronicle posts rs1040 cr loss

Chronicleఆర్థిక వివాదాలు చుట్టుముట్టిన తర్వాత తొలిసారిగా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్(డీసీహెచ్‌ఎల్) ఆర్థిక ఫలితాలను, ప్రమోటర్ల వాటాలను బహిర్గతం చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన 18 నెలల కాలానికి కంపెనీ రూ.1,040.41 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 18 నెలల క్రితం అంటే మార్చి, 2011కి కంపెనీ రూ.162.58 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. కంపెనీ ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో ఆర్థిక సంవత్సరాన్ని 18నెలలకు పెంచుకోవడానికి అనుమతి తీసుకుంది. దీనికి అనుగుణంగా సెప్టెంబర్ 30, 2012కి సంబంధించిన ఫలితాలను డీసీహెచ్‌ఎల్ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. కంపెనీ లిస్టింగ్ నిబంధనలను పాటించనందుకు జనవరి 23 నుంచి ట్రేడింగ్ నుంచి తప్పిస్తూ ఎన్‌ఎస్‌ఈ నిర్ణయం తీసుకోగా, 500 ఇండెక్స్ నుంచి డీసీహెచ్‌ఎల్‌ను తప్పిస్తూ బీఎస్‌ఈ నిర్ణయం తీసుకోవడం విదితమే.

ఈ 18 నెలలకు కంపెనీ ఆదాయం కూడా భారీగా క్షీణించింది.మార్చి, 2011 నాటికి రూ.1,031 కోట్లుగా(12 నెలలు) ఉన్న డీసీహెచ్‌ఎల్ ఆదాయం సెప్టెంబర్, 2012 నాటికి రూ.843 కోట్లకు(18 నెలలు) పడిపోయింది. ప్రమోటర్ల వాటా 73.83% నుంచి 38.40 శాతానికి తగ్గింది. ఆడిట్ కమిటీ పరిశీలించిన తర్వాత సోమవారం సమావేశమైన బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు ఆర్థిక ఫలితాలకు ఆమోద ముద్ర వేసినట్లు డీసీహెచ్‌ఎల్ పేర్కొంది. సెప్టెంబర్, 2012తో ముగిసిన 3 నెలలకు డీసీహెచ్‌ఎల్ రూ.149.16 కోట్ల ఆదాయంపై రూ.100 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.238 కోట్ల ఆదాయంపై రూ.30 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra bank shares slump
Sensex hits 20000 in trade  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles