Delhi most competitive city in india

New Delhi, Economist Intelligence Unit, news

Delhi has been named the most competitive city in India for its demonstrated ability to attract capital, business, talent and tourists by a new Economist Intelligence Unit (EIU) research report

Delhi most competitive city in India.gif

Posted: 06/25/2012 03:58 PM IST
Delhi most competitive city in india

Delhiవివిధ రంగాలను ఆకర్షించడంలో భారత రాజధాని ఢిల్లీ జాతీయస్థాయిలో అత్యంత దీటైన నగరమని సిటీ గ్రూప్‌కు చెందిన 'ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్' (ఈఐయూ) పరిశోధన నివేదిక ప్రశంసించింది. పెట్టుబడులు, వాణిజ్యం, నైపుణ్యం, పర్యాటకులను ఆకట్టుకోవడంలో ఇతర నగరాలతో పోలిస్తే దేశంలో అగ్రస్థానం ఢిల్లీదేనని పేర్కొంది. 'హాట్‌స్పాట్స్' పేరిట రూపొందించిన ఈ నివేదికలో ప్రపంచ స్థాయిలోని 120 పెద్ద నగరాల జాబితాలో 68వ స్థానం ఇచ్చింది.

మన దేశ వాణిజ్య రాజధాని ముంబైని 70వ స్థానంలో నిలపగా, భారత సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరుకు 79వ స్థానం దక్కింది. అలాగే పుణె 97, చెన్నై 105, కోల్‌కతా 106 స్థానాల్లో నిలిచాయి. ఈ 120 నగరాల మొత్తం జనాభా 75 కోట్లు కాగా, విశ్వ ఆర్థిక వ్యవస్థలో 29 శాతం వాటాతో 2011లో వీటి సంయుక్త జాతీయ స్థూల ఉత్పత్తిని 20 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. 'ఆర్థిక శక్తి' రీత్యా జాబితాలో అగ్రస్థానంలోగల అత్యధిక పటిష్ఠమైన 20 నగరాల్లో 15 ఆసియా ఖండంలోనివేనని తెలిపింది. అందులో భారత్‌లోని బెంగళూరు, అహ్మదాబాద్ 16, 19 స్థానాల్లో నిలిచాయని నివేదిక వివరించింది. మొత్తంమీద న్యూయార్క్, లండన్, సింగపూర్ తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. పారిస్, హాంగ్‌కాంగ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిస్తే, టోక్యో, జూరిచ్, వాషింగ్టన్ డీసీ, షికాగో, బోస్టన్ నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Moodys says india rating stable despite challenges
Reliance industries to sell textile business including only vimal segment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles