Moodys says india rating stable despite challenges

Moody's says India rating stable despite challenges, RBI,Moody's,gdp,Credit ratings,BRIC

Moody's says India rating stable despite challenges

India.gif

Posted: 06/26/2012 07:18 PM IST
Moodys says india rating stable despite challenges

Moody's says India rating stable despite challenges

భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం అనేది శాశ్వతమైన లక్షణం కాదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థ విషయంలో బేరిష్ ధోరణి ప్రదర్శిస్తుండగా అందుకు భిన్నంగా మూడీస్ స్టేబుల్ రేటింగ్‌ను కొనసాగించింది.స్టాండర్డ్ అండ్ పూర్, ఫిచ్, మోర్గాన్ స్టాన్లీ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌ను కుదించిన నేపథ్యంలో మూడీస్ రేటింగ్‌కు ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వానికి గుర్తుగా ఇచ్చిన 'బిఎఎ3' రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. క్రెడిట్ రేటింగ్‌కు సవాలుగా నిలుస్తున్న బలహీనమైన ఆర్థిక నిర్వహణ, ద్రవ్యోల్బణం పట్ల వైఖరి, అస్థిరమైన పెట్టుబడుల వాతావరణం దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నవేనని, రేటింగ్‌ల సమయంలో ఆ లక్షణాలను ఇప్పటికే పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న వృద్ధిలో క్షీణత, పెట్టుబడుల మందగమనం, కొరవడిన వ్యాపార విశ్వాసం వంటి లక్షణాలు శాశ్వతం లేదా మధ్యకాలిక లక్షణాలుగా మారే అవకాశం లేదని తేల్చి చెప్పింది. అయితే దేశీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు వ్యవసాయ రంగం నిరాశావహమైన పనితీరు కారణంగా మరి కొన్ని త్రైమాసికాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ సాధారణ ధోరణి కన్నా తక్కువ వృద్ధిరేటునే సాధించే అవకాశం ఉన్నట్టు మూడీస్ పేర్కొంది.

రూపాయి విలువ క్షీణత ప్రభావం కూడా ప్రభుత్వ రుణభారాన్ని పెద్దగా పెంచబోదని మూడీస్ అభిప్రాయపడింది. బహుముఖ, ద్వైపాక్షిక రుణసంస్థల నుండి తీసుకున్న విదేశీ మారకం రుణాలన్నీ తక్కువ వార్షిక చెల్లింపులు గలవి కావడం వల్ల ప్రభుత్వంపై రూపాయి విలువ క్షీణత ప్రభావం పెద్దగా ఉండబోదని వివరించింది. తక్కువ వృద్ధిరేటు, అధిక ద్రవ్యోల్బణం సమీప భవిష్యత్తులో భారతదేశం క్రెడిట్‌కు సవాలుగా నిలుస్తాయని పేర్కొంది. భారత రుణ, విత్తలోటు నిష్పత్తి ఎప్పుడూ ఇదే రేటింగ్ గల ఇతర దేశాలతో పోల్చితే అత్యంత కనిష్ఠ స్థాయిలోనే ఉంటుందని వ్యాఖ్యానించింది. వైవిధ్యం, అసమానతలు, పేదరికం హెచ్చుగా గల సమాజంలో ప్రభుత్వాదాయాలు పరిమితంగానే ఉండడం, ప్రభు త్వం వ్యయాలు వత్తిడికి లోను కా వడం సహజమేనని కూడా పేర్కొం ది. వృద్ధిరేటు, ఆర్థిక వ్యవస్థ సగటు పరిమాణం అంతర్జాతీయ సగటు కన్నా హెచ్చుగానే ఉన్నా పేదరికం, దానికి సంబంధించిన అవరోధాల కారణంగా భారత్‌కు మధ్యస్థ రేటింగ్‌నే ఇవ్వగలుగుతున్నట్టు తేల్చి చెప్పింది.

మూడీస్ రేటింగ్ భేష్ భారతదేశానికి మూడీస్ సంస్థ స్టేబుల్ రేటింగ్ ఇవ్వడం పట్ల ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ రంగరాజన్ హర్షం ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలోనే ఉన్నదని ఈ రేటింగ్ నిరూపిస్తున్నదని ఆయన అన్నారు.మూడీస్ రేటింగ్ సమతూకమైనదని హెచ్‌డిఎఫ్‌సి సీనియర్ ఎకనామిస్ట్ జ్యోతీందర్ కౌర్ అన్నారు. భిన్న కోణాల్లో ఆర్థిక రంగంపై వత్తిడులున్నప్పటికీ భారత క్రెడిట్ సామర్థ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని ఆమె అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kingfisher shares tank 13 as lessors take back 34 planes
Delhi most competitive city in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles