Reliance industries to sell textile business including only vimal segment

Reliance industries to sell textile business, including Only Vimal segment,textile business,Reliance Industries, Only Vimal, NM Rothschild, Mukesh Ambani, Dhirubhai Ambani, Cotton markets

Reliance industries to sell textile business, including Only Vimal segment

Reliance.gif

Posted: 06/22/2012 12:00 PM IST
Reliance industries to sell textile business including only vimal segment

Reliance industries to sell textile business, including Only Vimal segment

రిలయన్స్ ఇండస్ట్రీస్ వాణిజ్య సామ్రాజ్యానికి పునాదులు వేసిన తమ పురాతన వస్తవ్య్రాపారాన్ని అమ్మివేయాలని ఆ కంపెనీ నిర్ణయించింది. చమురుశుద్ధి, రిటైల్ తదితర వ్యాపారాలతో పోల్చి తే అంతగా లాభసాటికాని టెక్స్‌టైల్ విభాగాన్ని..అత్యంత ప్రజాదరణ పొందిన తమ ఐకాన్ బ్రాండ్ ‘ఓన్లీ విమల్’తో సహా విక్రయించాలని రిలయన్స్ భావిస్తోంది. టెక్స్‌టైల్ బిజినెస్ అమ్మిపెట్టే బాధ్యతల్ని రిలయన్స్ ఎన్‌ఎం రోత్‌స్కిల్డ్ సంస్థకు అప్పగించినట్లు ఈవ్యవహారంతో సంబంధం ఉన్న కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. నరోడా ఫ్యాక్టరీ సహా ఆర్‌ఎఎల్ టెక్స్‌టైల్ వ్యాపారం అమ్మ కం ప్రక్రియ ఈఏడాది చివరిలోగా పూర్తిచేయాలని భావిస్తున్నారు. కంపెనీ వస్తవ్య్రాపారాన్ని 1966లో సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ధీరూభాయ్ అంబానీ తన సోదరుడు రమణిక్‌లాల్ అంబానీతో కలిసి ప్రారంభించారు. ఆ తదనంతర కాలంలో ఈసంస్థ ఇంధనం, పెట్రోకెమికల్స్, రిటైల్ తదితర రంగాల్లోకి విస్తరించి సాలీనా రూ.85వేల కోట్ల టర్నోవర్‌తో దేశంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ టెక్స్‌టైల్ వ్యాపారం అమ్మకంలో ఓన్లీ విమల్ బ్రాండ్ నెట్‌వర్క్‌ను సైతం చేర్చినట్లు సంస్థ అధికారి పేర్కొన్నారు.  ఈ విషయమై రిలయన్స్ ప్రతినిధిని సంప్రదించగా, మార్కెట్ వదంతులపై తాము స్పందించబోమని అన్నారు. అయితే టెక్స్‌టైల్ బిజినెస్ విక్రయించడం ద్వారా లాభించే సొమ్మును బ్యాంక్ డిపాజిట్లలో పెడతామని కంపెనీ వర్గాలు తెలియజేశాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi most competitive city in india
Fitch lowers outlook on sbi other banks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles