Is senior citizen concession withdrawn? కరోనా పేరుతో సీనియర్లను బాదేస్తున్న రైల్వేశాఖ

Railways pulling back concessions for senior citizens

train fare, railways fare, indian railways, indian railways news, indian railways latest news, Why are festival train fares high, Is senior citizen concession withdrawn, railway news today, IRCTC ticket booking, IRCTC tatkal booking, IRCTC fare, train fare hike, railway fare hike, railway fare chart, railways withdraws concession, senior citizen concession, railways

The railways offers concessions to 53 categories including those for senior citizens etc. Some of the concessions stand withdrawn due to the Covid-19 pandemic as a move to discourage people from travelling. But the railways have clarified that it is not withdrawing the other concessions. The decision is under review as normal passenger trains remain suspended.

కరోనా పేరుతో సీనియర్లను బాదేస్తున్న రైల్వేశాఖ

Posted: 11/30/2021 09:23 PM IST
Railways pulling back concessions for senior citizens

యుక్తవయస్సులో తమ శాయశక్తులా శ్రమించి దేశ అభ్యున్నతికి పాటుపడిన సీనియర్ సిటిజన్లు గౌరవించడం.. వారికి కొన్ని రాయితీలు కల్పించి.. అవసాన దశలో అండగా నిలవడం ప్రభుత్వాలు తీసుకున్న సముచిత నిర్ణయమే. అయితే తమ బిడ్డలు, మనవళ్లపై ఆధారపడి జీవించే వీరికి పట్ల రైల్వేశాఖ మాత్రం ఇంకా చిన్నచూపును ప్రదర్శిస్తూనే వుంది. కరోనా మహమ్మారి పేరు చెప్పి సీనియర్ల అనవసర ప్రయాణాలను అడ్డుకునేందుకే కఠిన నిర్ణయమంటూనే.. వారిపై కనీస కనికరం కూడా లేకుండా బాదేస్తోంది. అరకొర ఆదాయంతోనే పొదుపు చేసుకున్న సీనియర్ల డబ్బు.. తమ ఆదాయానికి తక్కువ పడిందన్నట్లు దోచేసుకుంటోంది.

దేశాభ్యున్నతిలో, ప్రగతిలో కొన్నిదశాభ్దాల పాటు భాగమై.. దాచుకున్ని కొద్దిపాటి సొమ్మును భద్రంగా ఖర్చుపెట్టుకుంటూ.. మరికోందరుమాత్రం బిడ్డలు, మనమళ్లపై ఆదారపడతూ జీవనాన్ని గడిపేస్తున్నారు. అలాంటి సీనియర్‌ సిటిజన్స్ తమ బిడ్డలను చూసేందుకో లేక దైవదర్శనాల కోసమో.. లేక ఇతర వ్యవహారాల నిమిత్తమో సుదూర ప్రయాణాలను చౌకధరకు కల్పించే రైల్వేలోనే సురక్షితంగా ప్రయాణాలు చేస్తుంటారు. అయితే గత ఏడాది మార్చి 22 నుంచి తమకు కేటాయిస్తున్న రాయితీపై కోరడా ఘుళిపించింది కేంద్రం. దీంతో రైల్వేశాఖ ఎప్పుడెప్పుడు తమకు తీపికబరు చెబుతుందా అంటూ గత కొన్ని నెలలుగా సీనియర్ సిటిజన్లు కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నా.. కేంద్రం మాత్రం పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది.

కరోనా సమయంలో సాధారణ రైళ్లను పూర్తిగా నిలిపేసిన కేంద్ర రైల్వే శాఖ.. ప్రత్యేక రైళ్ల పేరుతో ప్రయాణికులను ఏడాపెడా బాదేస్తోంది. ఇక పండుగలు, పబ్బాలు, సెలవులు, ఇత్యాది ప్రత్యేక రోజులలో ఈ బాదుడు మరో రేంజ్ లో వుంటోంది. రైల్వేలో ప్రయాణాలపై సంబంధిత శాఖ బాదుడు.. తమ కారులో పెట్రోల్ పోయించుకుని ఎంచక్కా వెళ్లవచ్చనని కూడా ప్రయాణికులు సిద్దమవుతున్నారు. అయితే సీనియర్ల పాలిట మాత్రం రైల్వే శాఖ తాత్సార ధోరణి.. నిర్లక్ష్య వైఖరి వారికి భారంగా మారింది. కరోనా సంక్షోభం సమయంలో ఎత్తి వేసిన రాయితీలు నేటికి పునరుద్ధరించకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందంటున్నారు సీనియర్‌ సిటిజన్లు.

కరోనా వంటి సంక్షోభం సమయంలో ఓ వైపు ఆదాయం తగ్గిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే.. ప్రభుత్వాలు అండగా నిలవాల్సిందిపోయి.. ప్రభుత్వాలే బాదుడుకు తెరలేపితే.. తామేం కావాలని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. తమకు కల్పించే రాయితీలకు మహమ్మారి నెపం చూపుతూ కోత పెడుతూనే.. అదే మహమ్మారి ప్రభావం లేదంటూ సినిమా థీయేటర్లు, మాల్స్, బార్లు, మద్యం దుకాణాలను ఎలా నిర్వహిస్తున్నారని వారు నిలదీస్తున్నారు. ఆంక్షలు పాటిస్తూనే కుంభమేళాలు హాజరుకావాలని ప్రకటిస్తూనే.. తమబోటివారు రాకుండా రాయతీలను ఎత్తివేసి అడ్డుకుంటున్నారని దుయ్యబడుతున్నారు.

సామాజిక బాధ్యతగా రైల్వేశాఖ సమాజంలోని సీనియర్‌ సిటిజన్లు, ఉద్యోగార్థులు, రోగులు, జర్నలిస్టులు, ఆర్మీ, విద్యార్థులు తదితర 53 వర్గాలకు రైలు ప్రయాణం సందర్భంగా రాయితీలు కల్పిస్తోంది. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు సంబంధించి 58 ఏళ్లు దాటిన స్త్రీలకు 50 శాతం 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం రాయితీ ఉంది. అయితే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా రైళ్ల సర్వీసులను 2020 మార్చి 22 నుంచి రద్దు చేశారు. ఆ తర్వాత మూడు నెలల తర్వాత రైళ్లు క్రమంగా ప్రారంభం అయ్యాయి. అయితే రాయితీ మాత్రం పునరుద్ధరించలేదు.

రైలు సర్వీసులు ప్రారంభమైనా రాయితీల విషయంలో రైల్వేశాఖ మౌనముద్ర వహించింది. కాగా, కొన్ని వర్గాలకు మాత్రం రాయితీలను పునరుద్దరించిన రైల్వేశాఖ.. సీనియర్ల సిటిజన్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో గత ఏడాది జూలై నుంచి దాదాపుగా అన్ని మార్గాల్లో అందుబాటులోకి వచ్చిన రైళ్లలో ప్రయాణాల్లో సీనియర్‌ సిటిజన్లు టిక్కెట్టు ఛార్జీలు పూర్తిగా చెల్లించాల్సి వస్తోంది. పైగా ప్రస్తుతం నడుస్తున్నవి ప్రత్యేక రైళ్లు కావడంతో అన్నింటా అధికంగానే సొమ్ములు చెల్లించాల్సి వస్తోంది. ఆదాయం తగ్గిపోయి, అనారోగ్యాలకు చేరువైన సీనియర్‌ సిటిజన్లకు రైలు ప్రయాణాలు భారంగా మారాయి. ముఖ్యంగా హెల్త్‌ చెకప్‌ల కోసం క్రమం తప్పకుండా ప్రయాణాలు చేసే వారు మరీ ఇబ్బందులు పడుతున్నారు.

లాక్ డౌన్‌ తర్వాత స్పెషల్‌ ట్యాగ్‌తో రైల్వే సర్వీసులు ‍ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఎంత మంది సీనియర్‌ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారనే వివరాలు కావాలంటూ మధ్యప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌  అనే ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు సమర్పించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 2021 సెప్టెంబరు 31 నాటికే దేశవ్యాప్తంగా రిజర్వ్‌డ్‌ రైళ్లలోనే 3,78,50,668 మంది ప్రయాణం చేసినట్టు రైల్వే రికార్డులు వెల్లడించాయి. ఇక దాదాపు రెండు నెలల కాలంలో మరికొన్ని లక్షల మంది సీనియర్ సిటిజన్లు రైల్వేలో ప్రయాణాలు చేసివుంటారు. దీంతో ఈ సంఖ్య నాలుగున్నర కోట్ల మేర చేరివుంటుంది. ఇన్నాళ్లు జరిగిన జాప్యాన్ని పక్కనబెట్టి కనీసం ఇప్పటికైనా కేంద్రం రైల్వేమంత్రిత్వశాఖ ఈ సీనియర్ల రాయితీని పునరుద్దరించే విషయమై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  senior citizen concession  Trian fare  Railway ministry  Covid-19 pandemic  

Other Articles