TRS acts as said by the TPCC President Revanth Reddy ఔరా.. రేవంత్ రెడ్డి చెప్పింది.. చెప్పినట్లు చేసిన టీఆర్ఎస్..!

Trs acts as said by the telangana pcc president revanth reddy

TPCC, Congress, TPCC President Revanth Reddy, BJP high command, Central government orders, TRS, Telangana rice procurement, Telangana Rashtra Samithi, Parliament, winter session, Rajya Sabha, Lok Sabha, black shirts Protest, boycott Parliament session, K Keshava Rao, Nama Nageshwar Rao, Central Government, Telangana Politics

Telangana Pradesh congress committee President Revanth Reddy said on monday a day before that TRS MPs will not attend both the Parliament Houses from Tuesday as per the directions issued by the BJP headed central government. To the Surprise the TRS MPs said that they have decided to boycott the rest of the winter session of Parliament, protesting against the central government's alleged indifferent attitude on paddy procurement.

ఔరా.. రేవంత్ రెడ్డి చెప్పింది.. చెప్పినట్లు చేసిన టీఆర్ఎస్..!

Posted: 12/08/2021 08:09 PM IST
Trs acts as said by the telangana pcc president revanth reddy

రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనను టార్గెట్ చేసిన టీఆర్ఎస్.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఇంట్లోకి ప్రవేశించి.. ఆయనను విచారణ పేరుతో కొడంగల్ నుంచి తీసుకెళ్లిన పోలీసులు.. ఆ ఎన్నికలలో ఆయనను స్థానికంగా ఓడించడానికి కారణమయ్యారు. రేవంత్ అంటే అధికార పార్టీకి అంతటి టార్గెట్ వుందన్న విషయం రాజకీయ వర్గాల్లో అప్పట్లో హాట్ టాపిక్ గా కూడా మారింది. అంతగా టార్గెట్ చేసిన వ్యక్తి ఆరు నెలల తరువాత మల్కాజ్ గిరి నుంచి పార్లమెంటు ఎన్నికల బరిలో పోటీ చేసిన సమయంలో ఆక్కడ మాత్రం అధికార పార్టీ పప్పులు ఉడకలేదు. దీంతో రేవంత్ రెడ్డి గెలిచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అలాంటి రేవంత్ రెడ్డి ఆ తరువాత జరిగిన పరిణామాల్లో రాజకీయంగా ఓ మెట్టు ఎదిగారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా వున్న ఆయన ఏకంగా టిపిసీసీ అధ్యక్షుడి పదవికి ఎంపికయ్యారు. అయితే ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నా తన టార్గెట్ ను మాత్రం మర్చిపోలేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఎన్నికలు సుదూరంలో వున్నా ఇప్పట్నించే ఆయన తన కార్యచరణను అమలు పరుస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్రలు చేస్తూ.. ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ ప్రజలను జాగృతం చేస్తున్నారు. తాజాగా కేంద్రంలోని ప్రభుత్వం విధానాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిరసన తెలిపింది.

ఈ క్రమంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా వాడీ వేడిగా జరుగుతున్న క్రమంలో అక్కడ కూడా రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎంతస్థాయిలో కొంటారన్న విషయాన్ని కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. ఇలా కేంద్రంతో తాడో పేడో తేల్చుకుందామని రెడీ అయిన టీఆరఎస్ పార్టీ.. సమావేశాలు ఇంకా కొనసాగుతున్న తరుణంలో.. కాంగ్రెస్ ఎంపీ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పింది చెప్పినట్లుగానే చేసింది. బద్దశత్రువగా భావించే రేవంత్ చెప్పిన విషయాన్ని టీఆరఎస్ పార్టీ.. అందులోనే అటు లోక్ సభ ఇటు రాజ్యసభ ఎంపీలందరూ ఆచరించడం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ రేవంత్ రెడ్డి చెప్పిన విషయం ఏంటీ.. దానిని తూచా తప్పకుండా టీఆర్ఎస్ ఎంపీలు ఎలా ఆచరించారు.. అన్న సందేహాలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లోపాయికారిగా కూడబలుకుని రైతులను నిట్టనిలువునా ముంచేందుకు ప్రణాళికలను రచించాయని.. అందులో భాగంగానే వారిపై వీరు.. వీరిపై వారు అరోపణలు చేసుకుంటున్నారని అరోపించారు. వీరిద్దరి దోబూచులాట మధ్యలో రైతులే తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని పేర్కోన్నారు. రాష్ట్రంతో పాటు పార్లమెంటులోనూ టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రపు నిరసనలు చేపడుతున్నారని రేవంత్ విమర్శించారు.

ఈ నిరసనలతో కడుపుల సల్ల కదలకుండా పార్లమెంటుకు వెళ్లి.. అక్కడ నిరసనలు చేపట్టి.. ఫోటోలకు ఫోజులిచ్చి రావడం తప్ప.. టీఆర్ఎస్ నిరసనలతో రైతులకు  ఒనగూరే ప్రయోజనమేమీ లేదని ఎద్దేవా చేశారు. అయితే గత కొన్నిరోజులుగా చేపడుతున్న నిరసనలకు ఇక బ్రేక్ పడుతుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు అదేశాలు వచ్చాయని.. మంగళవారం నుంచి పార్లమెంటు ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు అదృశ్యం అవుతారని ఆయన సోమవారమే తెలిపారు. ఈ రెండు పార్టీలో కూడబలుకుకుని రైతులను, ప్రజలను మభ్య పెడుతున్నాయని విమర్శించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.

ఇంతవరకు బాగానే వున్నా టీఆరఎస్ ఎంపీలు కూడా సరిగ్గా మంగళవారం నుంచి పార్లమెంటు సమావేశాలకు హాజరుకాబోమని ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న క్రమంలో సమావేశాలను బహిష్కరించి తెలంగాణ ఎంపీలు ఏం సాధిస్తారని.. ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎంపీలకు ఓట్లు వేసి ఢిల్లీకి పంపిస్తే.. తమ తరపున పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా వాణి వినిపించి.. పోరాడి.. లక్ష్యాలను సాధించాల్సిన తరుణంలో ఎంపీలు సమావేశాలను బహిష్కరించడమేంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

అయితే టీఆరఎస్ మాత్రం సమావేశాలను బాయ్ కాట్ చేయడం బాధాకరమైన విషయమేనని... అయితే, కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై గత ఏడు రోజులుగా నిరసనలు తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోలేదని... కొనుగోళ్ల విషయంలో ఎఫ్సీఐ నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. బాయిల్డ్ రైస్ ను కొంటారో, లేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టతను ఇవ్వడం లేదని... డొంక తిరుగుడు సమాధానాలను చెపుతోందని మండిపడ్డుతోంది. కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపిస్తోంది. తెలంగాణ రైతులకు న్యాయం జరగడం లేదనే కారణంతోనే పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తున్నామని చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles