Priyanka Gandhi not produced in court even after 24 hours ప్రియాంకా గాంధీది అరెస్టా.? అనధికారిక నిర్భంధమా.?

Priyanka gandhi detained for last 28 hours without an order or fir

priyanaka cleans guest house, priyanka gandhi cleans detained room, priyanaka gandhi PAC guest house, priyanaka gandhi room cleaning video, priyanaka gandhi brooming video, viral video, priyanaka gandhi viral video, Lakhimpur kheri protest, Lakhimpur Kheri, Farmer Protest, farmer dead, Priyanka Gandhi, Congress, farmer protest updates, accident, farmer death, Ajay Mishras son, Uttar Pradesh, Crime

Congress general secretary Priyanka Gandhi Vadra, detained at a guest house in UP’s Sitapur, for the last 28 hours without an order or FIR. She was not even produced in the court as per the law. She lashed out at the Narendra Modi government for confining her while those who allegedly killed farmers in Lakhimpur Kheri were roaming scot-free.

ప్రియాంకా గాంధీది అరెస్టా.? అనధికారిక నిర్భంధమా.?

Posted: 10/05/2021 12:41 PM IST
Priyanka gandhi detained for last 28 hours without an order or fir

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల దారుణమారణకాండను నిరసిస్తూ.. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ జాతీయ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిన్న తెల్లవారు జామును నాలుగు గంటలకు అమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ మధ్యాహ్నం వరకు అక్కడే నిర్భంధించారు. అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన అగ్రనాయకురాలని అదుపులోకి తీసుకున్న పోలీసులు చట్టం ప్రకారం 24 గంటల వ్యవధిలో అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చాలి.

కానీ అమెపై ఎలాంటి అభియోగాలు మోపని పోలీసులు.. ఎందుకు అదుపులోకి తీసుకున్నారో.. ఏ సెక్షన్ల కింద అమెపై అభియోగాలను మోపారో కూడా అర్థంకావడం లేదని కాంగ్రెస్ నేతల వాదన. అంతేకాదు ఇవాళ ఉదయం అమె కూడా ఇదే విషయాన్ని పొందుపరుస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒ ట్వీట్ పోస్టు చేశారు. ఏ నేరం చేయని తాను.. చట్టం ప్రకారం సీతాపూర్ లోని పీఏసీ గెస్ట్ హౌజ్ లో నిర్భంధంలో వున్నానని, ఎలాంటి ఆర్డర్ లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా తనను ఇక్కడ పోలీసులు నిర్భంధంలో ఉంచారని అమె పేర్కోన్నారు.

అయితే.. మీ ప్రభుత్వంలోని అందులోనూ మీ క్యాబినెట్ లో మంత్రిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కొడుకు అశీష్ మిశ్ర తన కారుతో రైతులను తొక్కేసుకుంటూ వెళ్లి.. దారుణ మారణకాండకు కారణమయ్యారు. మరి ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదు.? ఆ మంత్రిని ఎందుకు మీరు బర్తరప్ చేయలేదు అని అమె ప్రశ్నించారు. ఆదివారం రోజున ఘటన జరిగినా.? అరెస్టు చేయడానికి ఇంకా పోలీసులకు అనుమతులు ఎందుకు ఇవ్వలేదని అమె ప్రశ్నించారు. పోలీసులను వారి పనిని వారు చేసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారని నిలదీశారు. నేరాలు చేసిన వారు స్వేచ్ఛవాయువును పిలుస్తారా.? మృతులను పరామర్శించడానికి వచ్చిన తమను అరెస్టు చేస్తారా.? అని అమె ప్రశ్నించారు.  


ఈ సందర్భంగా కేంద్రమంత్రి తనయుడు అశీష్ మిశ్రాపై అరోపణలు చేస్తూ తన ఎస్యూవీ కారును నడిపిస్తూ రైతులను ఎలా తొక్కేస్తూ వెళ్తున్నారో ఈ వీడియోలో వుంది. దీనిని మీరు చూశారా.? మరి చూసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని అమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని పక్కనబెడితే ప్రియాంక గాంధీని అరెస్టు చేశామని అతిధి గృహానికి తరలించిన పోలీసులు అమెను న్యాయస్థానంలో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. దేశంలో నియంత తరహా పాలన సాగుతోందా.? చట్టం ముందు అందరూ సమానమే అని అంటారు.. మరి ప్రియాంక విషయంలో బీజేపి ప్రభుత్వాలు ఎందుకిలా కొత్త తరహాలో వ్యవహరిస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles