KCR Introduced Female Minister in his Cabinet | తీవ్ర విమర్శలు.. పుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో కేసీఆర్

Kcr cabinet female minister soon

Telangana, CM K Chandrasekhara Rao, Woman Minister in T Cabinet, Telangana Cabinet, KCR Female Minister, T Cabinet Reshuffle, KCR Cabinet Female

Telangana Chief Minister K Chandrasekhara Rao is expected to have a cabinet shuffle very soon. Reports are emerging that KCR is mulling to bring in the first female Minister into the cabinet which has emerged as an uncomfortable question in the recent times

కేసీఆర్ కేబినెట్ లో మహిళకు చోటు?

Posted: 12/07/2017 02:12 PM IST
Kcr cabinet female minister soon

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎట్టకేలకు విమర్శలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైపోయారు. త్వరలో కేబినెట్ లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారని సమాచారం అందుతోంది. ఈ మేరకు త్వరలో కేబినెట్ పునర్వవ్యస్థీకరణ ఉండబోతుందన్న సంకేతాలు అందుతున్నాయి.

గత కొంతకాలంగా తెలంగాణ కేబినెట్, సీఎం వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకుండా వివక్షత చూపుతున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మహిళలకు ప్రాధాన్యం పేరిట జీఈఎస్ నిర్వహించిన తర్వాత ఈ అంశంపై చర్చ మరింత ముదిరింది. ఈ ప్రభావం రాబోయే ఎన్నికలపై స్పష్టంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కేసీఆర్ కు సూచించటంతో ఆయన ఆలోచనల్లో పడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆయన కేబినెట్ లో ప్రస్తుతం ఉన్న 9 మంది మహిళా నేతల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎప్పటి నుంచో కేబినెట్ లో మార్పులు కోరుకుంటున్న ఆయన కేవలం ఒక్క మార్పుతోనే సరిపెడతారా? లేక మొత్తం మంత్రిత్వ శాఖలనే మారుస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles