Pawan Vizag Speech target only AP MPs | పవన్ టార్గెట్ మొత్తం ఏపీ ఎంపీలేనా?

Pawan vizag speech brief version

Pawan Kalyan, Chalo Re Chalo Re Chal, Janasena Party, Vizag DCI Meet Speech, Andhra Pradesh MPs, Pawan Vizag Speech, Pawan Janasena Vizag Meet

Actor and Jana Sena chief Pawan Kalyan warned the Centre over the issue of proposed privatization of Dredging Corporation of India (DCI) by the Government of India. Later He Targeted AP MPs who comments on Him using harsh words. He issued an ultimatum to the Central Government saying if it goes ahead with the privatisation of DCI, he will withdraw his support to BJP.

ఏపీ ఎంపీలే పవన్ టార్గెట్?

Posted: 12/06/2017 02:08 PM IST
Pawan vizag speech brief version

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వరం పెరిగింది. ఇంతకాలం అధికార పక్షాలపై ఓ మోస్తరు వ్యాఖ్యలు చేసిన పవన్.. బుధవారం విశాఖ ప్రసంగంలో మాత్రం ఆ డోస్ ను పెంచేశాడు. ఆవేశంతో మాట్లాడినప్పటికీ ప్రజా సమస్యలపై ఆవేదనతో కూడిన మాటలే అందులో ఎక్కువగా కనిపించాయి. మరోవైపు అధికారం, పదవులు తనకు తృణ ప్రాయాలు అంటూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు.. రాజకీయాలకు కొత్త అంటూ వ్యాఖ్యలు చేసే వారికి తాను 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్న విషయం తెలీదేమో అంటూ ఈ మధ్యే ఆయనపై వ్యాఖ్యలు కొంత మంది ఎంపీలన ఉద్దేశించి ప్రత్యక్ష్యంగానే చురకలు అంటించారు. పవన్ కేవలం అధికారం కోసమే పాకులాడుతున్నాడని వ్యాఖ్యలు చేసేవారికి చెంప పెట్టులా స్పష్టత ఇచ్చేశాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉన్నా కూడా ఆ పని చేయలేదని చెప్పటాన్ని బట్టి మిత్రపక్షాల నుంచి ఆ ఆఫర్ అప్పుడే అందిందన్న విషయం చెప్పకనే చెప్పినట్లయ్యింది. కేవలం ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానే తప్ప పదవులు, ప్రజలు చేసే నినాదాలు తనకు సంతృప్తి ఇవ్వవని పవన్ తన నిజాయితీని ప్రకటించారు.

రాజకీయాల్లోకి వచ్చిన రోజే చెప్పాను. మీరు ఓట్లేయండి, మీ తరపున నేతలను నేను నిలదీస్తాను' అని.. అందుకే వచ్చాను. ఇప్పుడు అడుగుతున్నాను" అంటూ ఉద్వేగంగా మాట్లడం వెనుక సమస్యల పరిష్కారం వెనుక ప్రభుత్వ చిత్తశుద్ధిపై పవన్ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నాడన్నది అర్థమౌతోంది. ఇంత వరకు ప్రతిపక్షాల ఊహకు కూడా అందని సమస్యలను పవన్ తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పరిష్కారం దిశగా ప్రభుత్వం నుంచి హామీ కూడా తీసుకున్నారు. కానీ, ఇంత వరకు దేంట్లో కూడా ప్రభుత్వం పూర్తిస్థాయి పరిష్కారం చూపలేకపోయింది. ఇంత దాకా నాలో ఓపిక చూశారు.. ఇక ముందు సహనం నశించిన నేతను చూస్తారు. ఇంకా నిజాయతీగా ఉండాలంటే తన వల్ల కాదని ఆయన చెప్పారు. అయినా కొంత మంది కోడిగుడ్డుపై ఈకలు పీకాలన ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలా పీకాలనుకుంటే పీకవచ్చని, తాను ఏం పీకగలనో చూపిస్తానని కాస్త ఘాటుగానే ఆయన మాట్లాడం బట్టి చూస్తే పవన్ ధోరణి పూర్తిగా మారినట్లుగానే స్పష్టమవుతోంది.

అయినప్పటికీ సమస్యలను ఎదుర్కోవటం తనకు తెలుసునన్న జనసేనాని టీడీపీ, బీజేపీ ఎంపీలను ఏకీ పడేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని తాను ఆశ్రయించలేదని చెప్పడాన్ని బట్టి ఎవరిపైనో సెటైర్లు వేసినట్లు స్పష్టమౌతుంది. డీసీఐ సమస్యలను లెవనెత్తుతూనే తనకు భవిష్యత్తులో నిలదీతలు ఎదురైతే పారిపోనని అధికార పార్టీ నేతల నుద్ధేశించి వ్యాఖ్యలు చేశారు. జీవన్మరణ సమస్యగా పోరాడుతున్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు ప్రజలను పట్టించుకోవడం లేదు. ఓట్లడిగేటప్పుడు ప్రజలే దేవుళ్లు అని ఇంటింటికి వెళ్లి, సమస్యలు వచ్చినప్పుడు ప్రజల్ని పట్టించుకోని నేతలకు ఓట్లడిగే హక్కులేదంటూ అధికార, ప్రతిపక్షాల నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

అందరి సహకారంతోనే సమస్యల పరిష్కారం అవుతుందని భావించే తాను రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. తొలిసారి డీసీఐ ఉద్యోగుల తరపున ప్రధానికి లేఖ రాస్తున్నానన్న ఆయన పీఎం మోదీ, సీఎం చంద్రబాబు విషయంలో మాత్రం కాస్త గౌరవ పూర్వక వైఖరినే మరోసారి ప్రదర్శించారు. ఏది ఏమైనా పాదయాత్రతో ప్రజల దృష్టి కొట్టేద్దామనుకున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు విభజన హామీ, కోకోల్లలైన సమస్యలపై పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు, యువతనే టార్గెట్ చేస్తూ చేస్తున్న పర్యటనలు.. ప్రకటనలు భవిష్యత్తులో  జనసేన ఓటు బ్యాంకును కొల్లగొట్టడం ఖాయమని తేలుస్తున్నాయి. ఏదిఏమైనా తనపై ప్రేలాపనలు చేస్తున్న అధికార నేతలపై పవన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడన్నది తేటతెల్లమైపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles