Re-scrutiny of actor Vishal's nomination? విశాల్ నామినేషన్ పున:పరిశీలన.?

Rk nagar bypoll re scrutiny of actor vishal s nomination papers

vishal, Rk nagar by polls, returning officer, k. velusamy, re-scrutiny, Chief Electoral Officer, Rajesh Lakhoni. madhusudhanan, ttv dinakaran, ganeshan, hero vishal, independent candidate, tamil politics, Tamil Nadu

A day after actor Vishal’s nomination papers for the RK Nagar bypolls were rejected by Returning Officer K Velusamy, the Election Commission appeared to be toying with the idea of ordering re-scrutiny.

ఈసీ దిగివస్తుందా..? విశాల్ నామినేషన్ పున:పరిశీలన.?

Posted: 12/07/2017 02:35 PM IST
Rk nagar bypoll re scrutiny of actor vishal s nomination papers

నాటకీయ పరిణామాల మధ్య ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోయిన నటుడు విశాల్ నామినేషన్ ను పున:పరిశీలన చేయాలని ఎన్నికల సంఘం భావిస్తుందా..? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. విశాల్ చేసిన విమర్శలకు దిగివచ్చిన ఎన్నికల సంఘం ఆయన సమర్పించిన నామినేషన్ ను మరోమారు పరిశీలించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలా చేయడానికి ఎన్నికల సంఘానికి ఎలాంటి అవకాశం లేనప్పటికీ.. కోలీవుడ్ ప్రముఖ హీరోగా అవతరించిన విశాల్ ఈ విషయంలో చేసిన అరోపణలు, విమర్శలకు జడిసిన ఎన్నికల సంఘం తమకు అపఖ్యాతి మూటగట్టుకోవడం ఇష్టంలేక.. రాజ్యంగంలోని అర్టికల్ 324 మేరకు వెసలుబాటును అందిపుచ్చుకుని మరీ విశాల్ నామినేషన్ ను పున:పరిశీలన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

అయితే విశాల్ ఎన్నికల ప్రధాన రిటర్నింగ్ అధికారి రాజేష్ లోహానీని కూడా కలసి తన నామినేషన్ పత్రతాను ఎందుకు తిరస్కరించారో తెలిపాలని పిటీషన్ దాఖలు చేశారు. దీంతో పాటు ఆయన పిటీషన్ ను పరిగణలోకి తీసుకుని అమోదిస్తున్నామని చెప్పిన ఎన్నికల స్ర్కూటినీ అధికారుల చెబుతున్న వీడియోను కూడా సాక్ష్యంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో ఈసీపై విమర్శలు, అరోపణలు అధికమయ్యాయి ఈ నేపథ్యంలో ఈసీ విశాల్ నామినేషన్ ను పున:పరిశీలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు ఆయన తన నామినేషన్ విషయమై ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతుల దృష్టికి సామాజిక మాద్యమం ద్వారా తీసుకెళ్లారు. ఇక మంగళవారం తన నామినేషన్ విషయంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని తీవ్రస్థాయిలో స్పందించాడు.  ప్రజాస్వామ్య దేశంలో ఓ యువకుడు స్వంతంత్రంగా పోటీచేస్తే.. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు.  రెండ్రోజుల క్రితం సినీఫక్కీలో జరిగిన ఈ నాటకీయ పరిణామాలకు విశాల్‌తో పాటు తమిళనాడు ప్రజలను కూడా గందరగోళానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో క్రితం రోజున విశాల్ మరో సవాల్ చేశారు. తన నామినేషన్ ను విత్ డ్రా చేయించినంత మాత్రం నష్టం లేదని, తాను ఓ స్వతంత్ర అభ్యర్థిని ఎంచుకుని అతనికి విజయాన్ని కట్టబెట్టి.. అతని ద్వారా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. అయితే అతని వ్యాఖ్యల నేపథ్యంలో కూడా శరవేగంగా మార్పులు సంభవించి.. అతని నామినేషన్ పున:పరిశీలనకు ఈసీ అదేశించనుందా..? అన్న సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles