Rs 1000 coin coming? Opposition wants govt to clarify పాతనోటు పోయి కొత్త నాణెం వస్తుందా..? ఢాం..ఢాం.. ఢాం.!!

Rs 1000 coin coming opposition wants govt to clarify

Rs 1000 coin, Rs 2000 notes, RBI currency, New Currency, Arun Jaitley, Rajya Sabha, rs 200 notes, rs 200 notes launch, rs 200 notes news, rs 200 news, rs 2000 news, rbi, rbi news demonetisation, rs 200 printing, rbi india, pink notes, demonetisation, indian economy

The Opposition on Wednesday asked Finance Minister Arun Jaitley in the Rajya Sabha to clarify whether the government has decided to scrap the newly launched Rs 2,000 note and introduce a Rs 1,000 coin instead.

నోటు పోయి నాణెం వస్తుందా..? ఢాం..ఢాం.. ఢాం.!?

Posted: 07/27/2017 04:15 PM IST
Rs 1000 coin coming opposition wants govt to clarify

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయబోతుంది..? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది..? కేంద్రం అడుగులు ఏ విధంగా సాగుతున్నాయి.. ఎందుకని చెప్పిన మాటలను వెనక్కి తీసుకోనుందియి. పాత పరిస్థితినే ఎందుకు తీసుకురాదలిచింది.. కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా ఎందుకు వ్యవహరించాలని భావిస్తుంది...? అసలేం జరుగుతుంది.. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం లక్ష్యాలను చేరిందా..? చేరితే మళ్లీ ఎందుకు అలాంటి నిర్ణయాలు..? నోట్ల రూపంలో రద్దు చేసిన డినామినేషన్ ను మళ్లీ నాణెం రూపంలో ఎందుకు తీసుకురావాలని భావిస్తున్నారు..? ఎందుకని డొంకతిరుగుడు విధానాన్ని అవలంభిస్తున్నారు.

ఇవన్నీ ప్రశ్నలు పెద్దల సభలోని పార్లమెంటు సభ్యలు సంధిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తనదైన మౌనముద్రను వహిస్తుంది..? గత ఏడాది నవంబర్ 8న పాత పెద్ద నోట్లు రద్దును చేసిన ప్రభుత్వం.. తాజాగా అదే తరహాలో కేవలం రెండు వేల నోటును రద్దు చేయనుందన్న వార్తలు రావడంతో రాజ్యసభలోని ఎంపీలు ఈ విషయమై ప్రభుత్వం నుంచి సమాధానం రావాలని కోరారు. అయినా అటు కేంద్రం నుంచి కానీ ఇటు అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి కానీ ఏ సమాధానం లేదు. దీంతో మళ్లీ ఏదో జరగబోతుందన్న సంకేతాలు మాత్రం దేశప్రజలకు అందుతున్నాయి.

పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం చెప్పిన అవినీతి, నల్లధనం, నకలీ దనం లక్ష్యాలను అందుకుందా..? అంటే లేదన్న సమాధానమే వస్తుంది. ఇందుకు కోట్ల రూపాయలలో నల్లధనం, నకిలీ దనం అధికారుల తనీఖీలలో బయటపడుతూనే వుంది. ఈ నేపథ్యంలో ఈ అర్తిక సంవత్సరం నుంచి కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ.2000 గులాబీ నోట్లును కూడా తాము ముద్రించడం లేదని స్వయంగా అర్బీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో అసలేం జరుగుతుందన్న ఉత్కంఠ విపక్షాలకు చెందిన ఎంపీలతో పాటు ఇటు దేశ ప్రజల్లోనూ నెలకొంది.

ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన మరో తాజావార్త దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. అదే వెయ్య రూపాయల నాణెం. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని చెప్పిన కేంద్రం.. మళ్లీ పాత విలువతో కూడిన నాణాన్ని చెలామనిలోకి తీసుకురానున్నట్లు వస్తున్న వార్తులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. నోటుకు బదులు నాణెలను తీసుకువస్తే.. అసులు నోట్లు రద్దు ఉద్దేశ్యం ఏమిటన్నది కనీసం ప్రభుత్వానికైనా స్పష్టత వుందా..? లేక ప్రజలు కష్టాలు పడితేనే తమను గుర్తుంచుకుంటారని కేంద్రం భావిస్తుందా..? అన్న ప్రశ్నలు విపక్షాల సభ్యుల నుంచి వినబడుతున్నాయి. మరీ ఈ విషయంలో ఇకనైనా కేంద్రం క్లారిటీ ఇస్తుందా..? లేక తన వ్యూహమేదో తానే కొనసాగిస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 1000 coin  Rs 2000 notes  RBI currency  New Currency  Arun Jaitley  Rajya Sabha  demonitisation  

Other Articles