Nitish Kumar Hand Over Bihar to BJP

Jd u key leaders in modi cabinet

Nitish Kumar Modi Trap,Janata Dal (United) Modi Cabinet, Sharad Yadav Narendra Modi, JD(U) Sharad Yadav Nitish Kumar Cabinet Berths, Nitish Bihar Crisis

Narendra Modi-led cabinet may undergo a reshuffle in the coming weeks. Nitish Kumar's Janata Dal (United) or JD(U) could get one cabinet post and one Minister of State (MoS) – junior minister with an overseeing Cabinet Minister – portfolio, top sources in the party told Zee News. Sources further said Sharad Pawar and Nitish Kumar could be included in the Cabinet not confirmed yet.

కేంద్ర మంత్రులుగా నితీశ్, శరద్ యాదవ్.. నిజమేనా?

Posted: 07/27/2017 04:08 PM IST
Jd u key leaders in modi cabinet

మోదీ హవాను తట్టుకుని మరీ మహాకూటమితో అధికారంలోకి వచ్చిన నితీశ్ 20 నెలలు కూడా తిరగకుండానే బ్రేకప్ చెప్పేశాడు. లాలూ కొడుకు అవినీతిని కారణంగా(సాకుగా) చూపిస్తూ కాంగ్రెస్ తో సంప్రదించకుండానే రాంరాం పలికాడు. కాంగ్రెస్ తో పెద్ద ప్రభావం లేకపోవటంతో వచ్చే దఫా అధికారంలోకి రావాలంటే ఆర్జేడీ కన్నా బీజేపీనే బెటర్ అన్న భావనకు నితీశ్ వచ్చి ఉండొచ్చు. లేదా ఆ అవినీతినే ఆయుధంగా చేసుకుని తమనూ ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంటుందని భావించి ఉండొచ్చు.

కారణం ఏదైనా విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత మళ్లీ ఒకటయింది బీజేపీ-జేడీయూలు. ఈ విషయంలో పార్టీ పెద్ద శరద్ యాదవ్ కూడా అసంతృప్తిగా ఉన్నప్పటికీ, పదవులను కూడా ఆశ చూపించి బీజేపీ చీఫ్ అమిత్ షా చక్రం తిప్పతున్నాడన్న మరో కొత్త వాదన ఇప్పుడు తెరపైకి వస్తోంది. బీహార్ గవర్నర్ అయిన రామ్ నాథ్ కోవింద్ ను సడన్ గా రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించటం, దానికి నితీశ్ మద్ధతు తెలపటం ఓవైపు జరుగుతూనే, ఇంకోవైపు సీబీఐ తో లాలూ అండ్ ఫ్యామిలీని ఇరకాటంలో నెట్టేసే యత్నం చేస్తూ జేడీయూను గ్రిప్ లోకి తెచ్చుకున్నాడన్న వాదన లేకపోలేదు.

ఇది చాలదన్నట్లు త్వ‌ర‌లో కేంద్ర మంత్రివ‌ర్గంలో మార్పుల చోటు చేసుకునే అవ‌కాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నితీశ్ కుమార్ జ‌న‌తా ద‌ళ్ (యునైటెడ్‌) వ‌ర్గానికి ఒక మంత్రి ప‌ద‌వి, ఒక స‌హాయ మంత్రి ప‌దవి కేటాయిస్తార‌ని బీజేపీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. పైగా మోదీ కేబినెట్‌లోకి నితీశ్ కుమార్‌, శ‌ర‌ద్ ప‌వార్‌ల‌ను లాగేసి కమలం పార్టీనే సీఎం కుర్చీని లాక్కునే అవకాశాలు ఉన్నాయన్నస‌ంకేతాలు అందుతున్నాయి. దీని గురించి బీజేపీ గానీ, జేడీయూ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రావటం లేదు. కానీ, ఆ అవకాశాలు తక్కువే అయినా పూర్తిగా మాత్రం తోసిపుచ్చలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar Crisis  Nitish Kumar  BJP Alliance  

Other Articles