amit shah to get home ministry affairs in modis' cabinet దేశంలో ఇక నాటి గుజరాత్ మార్క్ పాలన..?

What narendra modi wants with amit shah s election to rajya sabha

Narendra Modi, amit shah, rajnath singh, union home minister, gujarat mark politics, congress, opposition, left parties, Lok Sabha, Lok Sabha elections, congress, lalu prasad yadav, politics

If sources are to be belived, BJP preparing ground to win 2019 Lok Sabha elections with massive victory, in gujarat mark. for which amit shah would be included into modi's cabinet and mostly will be given homi ministry affairs.

అమిత్ షాకు కేంద్రమంత్రి పదవి.? అదే కీలక శాఖ.?

Posted: 07/28/2017 09:11 PM IST
What narendra modi wants with amit shah s election to rajya sabha

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అనతికాలంలోనే పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేసిన అమిత్‌ షా తొలిసారిగా రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. రాజ్యసభకు గుజరాత్ అసెంబ్లీ నుంచి ఆయన ఎన్నకి రమారమి ఖాయం అయినట్లే. దీంతో ఇవాళ ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి బరిలోకి దిగనున్నారు. గుజరాత్ అసెంబ్లీలో సభ్యుడిగా వున్న ఆయనను ప్రధాని ఏకంగా పెద్దల సభకు తీసుకురావడం వెనుక ఉద్దేశ్యమేమిటన్న ప్రశ్నలు ప్రసత్తుం తెరపైకి వస్తున్నాయి.

లోక్ సభలో విపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులు అధికార పక్షం బలాన్ని చూసి కన్నుకుట్టేలా వుంది. ఇక దీనికి తోడు విపక్షాల కన్నా అధికస్థాయిలో తమ వాణిని వినిపించే అవకాశమూ వుంది. దీంతో ప్రస్తుతం పెద్దల సభగా పిలవబడుతున్న రాజ్యసభలో మాత్రం బీజేపి పెద్దలు అశించిన స్థాయిలో తమ వాణిని బలవంగా వినిపించలేకపోతున్నారు. దీంతో పెద్దల సభలోనూ తమ వాణిని బలంగా వినిపించే వ్యక్తి కోసం అన్వేషించిన ప్రధాని తన తరువాత నెంబర్ టు స్థానంలో కొనసాగుతున్న అమిత్ షాను రాజ్యసభకు పంపిస్తున్నారని సమాచారం.

ఇక దీనితో పాటు గుజారాత్ మార్కు స్థాయిలో ప్రధాని మోడీ, అమిత్ షాలు దేశంలో పాలన సాగించాలని కూడా యోచిస్తున్నారా..? అంటే అవునన్న సందేహాలే తెరపైకి వస్తున్నాయి. రాజ్యసభలోకి అడుగుపెట్టనున్న అమిత్ షాను ప్రధానమంత్రి తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అమిత్ షాకు అత్యంత కీలకమైన కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఇచ్చే అవకాశాలు వున్నాయని కూడా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రమంత్రి పదవులకు సరిపడా భాధ్యతాయుతమైన నేతలు కొరత బీజేపిని వెంటాడుతుంది.

అందుకనే పట్టున్న నేతలకు రెండేసి కేంద్ర మంత్రిత్వ శాఖలను ఇచ్చి ప్రస్తుతానికి పనికానిస్తున్నారు. అరుణ్ జైట్లీకి అర్థిక శాఖతో పాటు రక్షణ శాఖ, డాక్టర్ హర్షవర్థన్ కు పర్యావరణ శాఖ అదనంగా కేటాయిందచిందే. ఇక తాజాగా వెంకయ్యనాయుడు రాజీనామాతో కేంద్రసమాచారం శాఖ పదవిని కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలకు రానున్న రెండేళ్లు అత్యంత కీలకంగా మారిన తరుణంలో గుజరాత్ తరహాలో మునుపటి కన్నా అత్యధిక మోజారిటీని సాధించాలన్న ప్రణాళికలో భాగంగానే అమిత్ షాకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించనున్నారని సమాచారం.

అయితే ఈ బాధ్యతలను ప్రస్తుతం నిర్వర్తిస్తున్న బీజేపి సీనియర్ నేత రాజనాథ్ సింగ్ ను వేరే శాఖలు అప్పగిస్తారని తెలుస్తుంది. అలా కాని పక్షంలో ఆయనకు పార్టీ అధ్యక్షపగ్గాలను అప్పగించాలన్న యోచనలో బీజేపి వుందని సమాచారం. కేంద్ర క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ త్వరలో జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో అమిత్ షా రాజ్యసభ ప్రవేశంపై సర్వాత్రా అసక్తి నెలకొంది. ఆయనకు కేంద్రమంత్రి పదవి లభిస్తుందా..? ఏ శాఖను అప్పగిస్తారన్న వార్తల కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles