signs of currency ban once again పెద్ద గులాబీ నోటును రద్దు యోచనలో కేంద్రం..?

Rbi stops printing rs 2000 notes demonetisation again

rs 200 notes, rs 200 notes launch, rs 200 notes news, rs 200 news, rs 2000 news, rbi, rbi news demonetisation, rs 200 printing, rbi india, pink notes, demonetisation, indian economy

The Reserve Bank of India (RBI) has reportedly stopped the printing of Rs 2000 currency notes, rumours surround that its demonetisation once again..?

రూ.2000 నోట్లను రద్దు యోచనలో కేంద్రం..?

Posted: 07/26/2017 06:58 PM IST
Rbi stops printing rs 2000 notes demonetisation again

దేశంలో నల్లధనాన్ని, నకిలీ ధనాన్ని, అవినీతిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తాజాగా మరోమారు అలాంటి నిర్ణయాన్ని తీసుకోనుందా..? అన్న ఊహాగానాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నోట్ల రద్దు కాదు నోట్ల మార్పిడి మాత్రమే జరిగిందని, పెద్ద నోట్లు రద్దు పేరు చెప్పిన కేంద్రం అంతకన్నా పెద్ద నోటును తీసుకువచ్చి దేశంలోని సంపన్నవర్గాలకు మేలు చేసిందన్న విపక్షాల అరోపణలకు దేశవ్యాప్తంగా బలం చేకూరుతున్న తరుణంలో కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందా...? అంటే అవునన్న సంకేతాలు వినబడుతున్నాయి.

మరోమారు నోట్ల రద్దు కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టనుందా..? రూ. 2000 నోట్లను రద్దు చేసేందుకు సర్వం సిద్ధమైందా..? అంటే రమారమి సంకేతాలు మాత్రం అవుననే వినబడుతున్నాయి. మోడీ సర్కార్ గత ఏడాది నవంబర్ మాసంలో కొత్తగా చెలమాణిలోకి తీసుకువచ్చిన 2వేల నోట్లు ఎక్కడా దర్శనమివ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై స్పందించిన భారతీయ రిజర్వు బ్యాంకు మాత్రం తాము కేవలం రూ.200 నోటుపై అధిక దృష్టిని సారించామని చెబుతుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. అగస్టు మాసంలో రూ.200 కొత్తగా చెలామణిలోకి తీసుకువస్తున్నామని తెలిపింది.

దీంతో ఇక గులాబీ నోటు ప్రింటింగ్ ను భారతీయ రిజర్వు బ్యాంకు నిలిపేసిందన్న వార్తలు రావడంతో.. త్వరలోనే ఈ పెద్దనోటును కూడా ప్రభుత్వం రద్దు చేస్తుందన్న వార్తలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఈ పెద్ద ోటునును గత ఐదు నెలలుగా ఈ నోటు ప్రింటింగ్ ను చేపట్టనే లేదని అర్బీఐ అధికారుల నుంచి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నోటును కూడా త్వరలోనే రద్దు చేస్తారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా ఈ విషయం పార్లమెంటు వరకు వెళ్లింది. రూ. 2000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించారా? అంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విపక్షాలు ప్రశ్నలు సంధించాయి. దీనిపై ఆయన కనీస క్లారిటీ కూడా ఇవ్వలేదు. దీంతో, మరో డీమానిటైజేషన్ కు కేంద్రం సిద్ధమవుతోందనే వార్తలకు మరింత ఊపు వచ్చింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles