దేవినేని నెహ్రూ, బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీలో చేరతారా? | Congress leaders devineni and vedavyas join TDP

Krishna cong leaders devineni and vedavyas join tdp

Krishna district Congress leaders, AP congress join TDP, Devineni Nehru and Burlagadda vedavyas, devineni and vedavyas, Krishna TDP, AP congress, congress to TDP

Krishna district Congress leaders Devineni Nehru and Burlagadda vedavyas join TDP

ఆ ఇద్దరితో ఎవరికి లాభం?

Posted: 08/03/2016 12:15 PM IST
Krishna cong leaders devineni and vedavyas join tdp

ఇంతకాలం ప్రతిపక్షం నుంచే అధికార టీడీపీలోకి వలసలు కొనసాగటం ఏపీలో జరిగింది. వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు తెదేపాలో ఇప్పటికే చేరిపోయారు. మరి కొంత మంది ఏ క్షణంలోనైనా ఫిరాయించేందుకు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు కూడా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. .

కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత దేవినేని నెహ్రూ చూపు ఇప్పుడు టీడీపీ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి దేవినేని ఉమాకు సోదరుడైన దేవినేని రాజశేఖర్ అలియాస్ దేవినేని నెహ్రూ గతంలో తెలుగుదేశంలోనే ఉండేవారు. చీలిక సమయంలో స్వర్గీయ ఎన్టీఆర్ వెన్నంటి ఉండి ఆయన స్థాపించిన అన్నా తెలుగుదేశం పార్టీలోకి మారిపోయారు. ఆపై ఎన్టీఆర్మరణంతో కాంగ్రెస్ లో చేరిపోయారు. అప్పటి నుంచి కాంగ్ లోనే ఆయన కొనసాగుతున్నారు. విభజన ఆపై కాంగ్రెస్ ప్రాభవం కొడిగడుతుండటం ఆయన్ను డైలమాలో పడేసింది. తమ్ముడితో ఉన్న వైరాలను సైతం పక్కన బెట్టి కలిసి ముందుకు సాగేందుకే మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన సొంత గూటికి చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారట.

ఇక జిల్లాకే చెందిన మరో కాంగ్రెస్ సీనియర్ బూరగడ్డ వేదవ్యాస్ కూడా సైకిల్ ఎక్కేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని వినికిడి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఓ దఫా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వేదవ్యాస్ రెండు రాష్ట్రాల ప్రజలకు చిరపరచితులే. చిరు ప్రజారాజ్యం ఆవిర్భాంలో ఆయనతో చేయి కలిపిన వేదవ్యాస్.. పీఆర్పీ వీలిన సమయంలో కాంగ్రెస్ లోకే వచ్చేశారు. అయితే కొన్నాళ్లుగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు తిరిగి యాక్టివేట్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, అందుకు టీడీపీలో చేరటమే సరైన మార్గమని నిర్ణయించుకున్నారంట. ఓ ప్రముఖ పత్రిక వీరి చేరికను ధృవీకరిస్తూ ఓ కథనం పేర్కొంది.

అయితే రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరినీ పార్టీలో చేర్చుకోవటం ద్వారా కీలకమైన కృష్ణా జిల్లాలో రాజకీయంగా మరింత బలపడొచ్చనే భావనలో ఉన్న చంద్రబాబు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Congress  TDP  Devineni Nehru  Burlagadda vedavyas  

Other Articles