ఆనందీబెన్ రాజీనామా వెనక అమిత్ షా | Anandiben Supporters alleges Amit Shah behind Anandiben resignation

Amit shah behind anandiben resignation

reason behind Anandiben resignation, Anandiben patel resignation, Amit shah interference in gujarat politics, Anandiben Supporters alleges Amit Shah, Anandiben Supporters fire on Amit Shah

Not Age, Amit Shah behind Anandiben resignation her Supporters says a day after she quit.

ఆనందీబెన్ రాజీనామా వెనక...

Posted: 08/02/2016 04:56 PM IST
Amit shah behind anandiben resignation

దేశంలో ఇంతవరకు కనివిని ఎరుగని రీతిలో పేస్ బుక్ ద్వారా రాజీనామా చేసిన గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ వ్యవహారంపై రాజకీయ చర్చ తారాస్థాయికి చేరిపోయింది. వయో భారంతో ఆమె స్వచ్చందంగా తప్పుకున్నారని చెబుతున్నప్పటికీ ఆ కారణం ఏ మాత్రం సహేతుకంగా లేదన్నది ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఆమె అనుచరులు మాత్రం ఇందుకు కారణంగా పేర్కొంటూ ఓ వ్యక్తి పైన తీవ్ర ఆగ్రహం వెల్లగక్కుతున్నారు.

మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన దగ్గర మంత్రిగా పని చేసిన ప్రస్తుత బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అప్పుడు ప్రభుత్వానికి బ్యాక్ బోన్ గా వ్యవహరించేవారన్న సంగతి తెలిసిందే. గుజరాత్ రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా ఆ రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెట్టడం మాత్రం అమిత్ షా మానలేదు. అక్కడి ఉన్నతాధికారులు కూడా వివిధ విషయాలపై ఆయనను సంప్రదించేవారు. అయితే ఆనందీబెన్ పటేల్ సీఎం అయ్యాక కూడా ఆ పరంపర కొనసాగిందట. దీంతో ఒకానోక దశలో పాలనపై ఆమె కంటే అమిత్ షాకే పట్టు ఎక్కువ ఉందని పలువురు రాజకీయ నిపుణులు తరచూ చెబుతుండేవారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆనందీ బెన్ రాజీనామా వెనుక ఆయనే ఉన్నారంటూ ఆమె అనుచర గణం ఆరోపణలు చేస్తోంది. అసలు మొదటి నుంచి ఆమెకు పరిపాలనలో స్వేచ్ఛే లేదని, పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం దగ్గరి నుంచి ప్రతీ అంశంలో ఆయనే చూసుకున్నారని, ఈ విషయమై ఆనందీబెన్ చాలా సార్లు మనోవేదనకు గురైందని వారంటున్నారు. అ వయోభారం, పని ఒత్తిడి కారణంగా ఆమె రాజీనామా చేయలేదని, ఆమెకు పరిపాలన స్వేచ్ఛ లేకపోవడం, కుట్రలు పన్నడంతో ఆమె రాజీనామా చేశారని వారు తెలిపారు. ఈ నవంబర్ లో 75 వసంతంలోకి అడుగుపెట్టాక స్వచ్ఛందంగా పదవీ విరమణ చేద్దామని ఆమె భావించారు. కానీ, ఇంతలో కుట్ర పన్ని ఆమెను తొలగించారు అంటూ ఓ కీలక నేత వ్యాఖ్యానించారు.

ఏదేమైనా నాటకీయ పరిణామాల మధ్య ఆమె ను దించేసిన కమల అధిష్ఠానం వచ్చే గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇదంతా చేస్తుందన్న వాదనకు బలమైన కారణాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రత్యామ్నాయ వేటలో ఆ పార్టీ తలమునకలై ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  Chief Minister  Anandiben patel  resignation  Amit Shah  

Other Articles