KCR is in contact with the farmers suicides

Kcr is in contact with the farmers suicides

KCR, farmers, Suicide, Pocharam, Telangana, Telaangana Govt

KCR is in contact with the farmers suicides. Telanagan govt didnt take any precautions to prevent farmers suicides.

కేసీఆర్ కు రైతుల ఉసురు తగులుతుంది

Posted: 09/19/2015 01:30 PM IST
Kcr is in contact with the farmers suicides

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. ఎలాంటి కష్టాలు ఉండవు.. విద్యార్థులకు ఉచితంగా విద్య  అందిస్తాం.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం.. ముసలి వాళ్లకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం.. రైతులకు అండగా ఉంటాం.. ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా.. అసలు తెలంగాణ రైతు అంటేనే ఆనందానికి చిరునామాగా నిలుస్తాం అంటూ ఉద్యమం సమయంలో కేసీఆర్ చేసిన ప్రకటనకు సర్వత్రా ఆనందం వ్యక్తమూంది. కేసీఆర్ ఎక్కడ ఈ మాటలు పలికినా ఈలలు, గోలలు కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నదిలో ఉన్నప్పుడు ఓడ మల్లన్న.. ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న అన్నట్లు తెలంగాణ లో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ అసలు రంగు ఉంటో ఇప్పుడు బయటపడుతోంది. రైతుల గురించి నాకు తెలుసు.. ఎందుకంటే నేను కూడా రైతునే అంటే రైతుల గుండెలు పులకించిపోయాయి. కానీ అవే గుండెలు ఆకలితో, అప్పులతో విలవిలలాడి చివరకు అర్దంతరంగా తమ జీవితాలకు ఉరికొయ్యలే శరణమవుతున్నాయి.

Also Read: అప్పుడు బండారు.. ఇప్పుడు దన్కర్.. రైతులంటే ఎందుకంత అలుసు..?

అంతన్నాడు... ఇంతన్నాడు.. చివరకు చూస్తే ఖాళీ చేతులు చూపిస్తారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్.. మొదటి నుండి రైతుల గురించి పట్టించుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం శ్రీనివాసులును నియమించడం కూడా చాలా మందికి మింగుడుపడలేదు. పోచారం లాంటి అసమర్థుడికి మంత్రి పగ్గాలు అప్పగిస్తే ఇలాగే ఉంటుందని కూడా కొంత మంది అనుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోకండి.. మీకు మా ప్రభుత్వం అండగా ఉంది... అని పోచారం శ్రీనివాస్ ప్రకటన చేసినా కూడా కనీసం స్పందన కనిపించలేదు. రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. రాజధానిలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే దాని మీద వివాదం తలెత్తితే.. ప్రభుత్వం అసలు అతడు రైతుకాదు వడ్డీ వ్యాపారి అని చెబుతోంది. సరే ఒక్క రైతు అంటే అలా అని అనుకోవచ్చు కానీ ఎంతో మంది చనిపోతున్నారు కదా మరి వారి మీద మాత్రం ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. అంటే విషయం ప్రభుత్వానికి తెలియాలంటే రాజధానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటే తప్ప అప్పటి దాకా మంత్రులకు, అధికారులకు విషయం అర్థం కాదన్న మాట.

Also Read: రైతు ఆత్మహత్యలపై సమాధానం ఇవ్వండి

ఒక్కో రైతు.. తన కష్టాన్ని నమ్ముకొని అప్పులు చేసి మరీ.. వ్యవసాయాన్ని చేసుకుంటాడు. అప్పులు చేసైనా సరే తాను మాత్రం పుడమి తల్లిని నమ్ముకొని సాగుకు సిద్దమవుతాడు. కానీ అన్నీ పోను అప్పులు మాత్రమే కనిపించడంతో చివరకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే మన కేసీఆర్ గారు మాత్రం ఓ గొప్ప పని చేయబోతున్నారట. ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని 5 లక్షలకు పెంచాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. పొరుగు రాష్ట్రం ఏపీలో బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తుండగా.. తెలంగాణలో లక్షన్నర మాత్రమే సాయం చేస్తున్నారు. ఇందులో రూ.50 వేలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద అప్పులు తీర్చడానికి ఇస్తుండగా... రూ.లక్షను వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతు కుటుంబానికి ఉపాధినిచ్చేందుకు, డిపాజిట్‌ చేసేందుకు కేటాయిస్తున్నారు. తాజాగా... అప్పు తీర్చేందుకు 1.50 లక్షలు, రైతు కుటుంబానికి నేరుగా 3.50 లక్షలు సాయం అందించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయినా రైతుల ఆత్మహత్యల మీద ఎంత డెడికేషన్ ఉందో అర్థమవుతోంది. రైతుల కుటుంబాలు ఎంత మనోవేధనకు గురవుతున్నారో వారికి తెలుసు. వారి ఉసురు ఖచ్చితంగా కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి తాకుతుందని అభిప్రాయపడుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : KCR  farmers  Suicide  Pocharam  Telangana  Telaangana Govt  

Other Articles